వెబ్ కాస్టింగ్ సిబ్బంది తో ఇబ్బంధంట !
దీని గూర్చి వివరించే ముందు పుస్తకం . నెట్ లో
''కధ 2013 '' పై నా రివ్యు చదివి వచ్చెయ్యండి .
( riview link kadha 2013 in pustakam . net )
''అమ్మా నేను ఎక్కడ ఉన్నానో చెప్పు '' పోయిన నెలలో
నివాస్ ఫోన్ .
ఎక్కడ ఉండటం ఏమిటి నా బంగారు కొడుకు చక్కగా
కె . ఎల్ . యు . లో రెండో ఏడాది ఇంజినీరింగ్ చదువుకుంటూ
కాలేజ్ లో ఉంటాడు . అదే చెప్పాను .
''కాదు నేను నర్సాపురం లో ఉన్నాను ''కాసింత గర్వం మాటల్లో .
వీడికి అక్కడేమి పని అదీ మా పర్మిషన్ లేకుండా ... కొంచెం
చుర్రుమంది . ''ఎందుకు పోయ్యావు ? ''
''నేను ఇక్కడ లోకల్ ఎలేక్షన్స్ కి వెబ్ కాస్టింగ్ చేయడానికి
వచ్చాను . కాలేజ్ లో 120 మంది విల్లింగ్ ఇస్తే నేను కూడా
ఇచ్చి వచ్చాను . చెపితే పంపుతారా ?అందుకే చెప్పకుండా
వచ్చాను ''
నా బంగారు . నిజంగా ఎంప్లాయ్ కాకుండానే ఎలేక్షన్స్ విధుల్లో
పాల్గొనడం దేశ రక్షణ సిపాయి అంత గౌరవప్రదం అయినదే .
దానిలో పాల్గొంటే పిల్లలను కోప్పడుతామా ? కాని తప్పదు.
''పిల్ల కాకికి ఏమి తెలుసు ఉండేలు దెబ్బ '' అని సామెత .
ఎన్నిక విధులు ఎలా ఉంటాయి . పైకి తేట నీళ్ళే ,కింద ముసళ్ళు .
కొన్ని సార్లు నేను లేడీ పి. ఓ . కాబట్టి లేడీస్ బూత్ కి వేస్తారు .
లేకుంటే జనరల్ . ఒక సారి లేడీస్ బూత్ కి వేసారు .
కాబట్టి పెద్ద గొడవలు ఉండవు
మహా అయితే ఐ . డి కార్డ్ కొంచెం ఇబ్బంది . ఏజెంట్స్ బాగున్నారు .
అంతా బాగుంది అనుకున్నాను .
ఒకామె వోట్ వేయడానికి వచ్చింది .
ఏజెంట్స్ తో పాత గొడవలు కాబోలు అతను ఆమెను
'' వేసావు లేమ్మా పెద్ద ఓటు ''అని అనేసాడు .
ఆమె ఎంత రియాక్ట్ అయింది అంటే వెంటనే
తప్పుడు మాటలు . ఎలెక్షన్ లో అంతా బాగున్నట్లే ఉంటుంది .
ఇదిగో ఇలాంటి సెన్సిటివ్ గొడవల్లో టకామని రెండుగా విడిపోతారు .
అసలు గొడవ ఎలా వచ్చిందో ఊహించలేము . నేను వెంటనే
రియాక్ట్ అయి పోలీస్ ని పిలిచి ఆమెను మెల్లగా పంపేసి ఏజెంట్
కి సర్ది చెప్పాను
''ప్లీజ్ పోలింగ్ ప్రశాంతంగా జరగనివ్వండి ''అని .
ఏదో అంటారు కదా !వాసుదేవుడు అంతటి వాడే అని .... అంటే
సామెత కరక్ట్ కాదు కాని మా కష్టాలు అలాగే ఉంటాయి .
పొరపాటున పోలింగ్ రద్దు అయిందో కింద వాళ్ళ దగ్గర నుండి
పై వాళ్ళ దాకా ''కాంట్ బట్ పొజిషన్ '' అని చెప్పి రుజువు
చేయాలి .
ఇదిగో ఇలాంటి పరిస్థితిలో మాకు ఈ వెబ్ కాస్టింగ్ వరం
నిజంగా . వీళ్ళు ఏమి చేస్తారు అంటే వాళ్ళ లాప్ టాప్
లో అంతా రికార్డ్ చేసి పై వాళ్లకు ఇస్తారు . ఇది వచ్చినాక
ఎంతో హాయిగా ఉంది . క్రౌడ్ వచ్చినా కూడా ఆ కెమరా వైపు
చూపిస్తే వాళ్ళే సర్దుకొని బయటకు వెళ్ళిపోతున్నారు .
సరే ఈ వెబ్ కాస్టింగ్ చేసే సిబ్బంది ఎవరబ్బా అంటే ఇదిగో
ఈ పిల్లలే . మొన్న ఇంటర్ దాకా అమ్మ హార్లిక్స్ లేదా టీ
ఇస్తే వేళ కి తిని పుస్తకాల తో కుస్తీ పట్టి ఇంజినీరింగ్
చేరినవారు . మాకైతే రెండు రోజులు నిద్ర , ఆహారం లేకుండా
ఏ స్కూల్ వేస్తే ఆ స్కూల్ లో దోమలతో కుట్టించుకుంటూ ,
ప్రజలతో తిట్టించుకుంటూ అందరిని సర్ది చెప్పుకుంటూ
విజయవంతంగా ఎలేక్షన్స్ చేయడం అలవాటు .
పాపం వీళ్ళకేమి తెలుసు ... మొన్ననే అమ్మా నాన్న గూడు
వదిలి ప్రపంచం లోకి తల పెట్టిన వాళ్ళు . అందులో
లోకల్ ఎలేక్షన్స్ .... డబ్బాల్లో వోట్లు వేస్తారు . పది వోట్లు
తేడా వచ్చినా తోసుకోవడాలు , కొట్టుకోవడాలు ,
ఇంతకు ముందు అయితే గోలి షోడాలు , మండింది అంటే
మమ్మల్ని కూడా లోపల పెట్టి తలుపు వేసేస్తారు .
మా తల కాపాడుకునేదే మాకు పెద్ద పని . ప్రజాస్వామ్యం
దేవుడేరుగు .
నిన్న ఎలేక్షన్స్ లో పాపం ఆ వెబ్ కాస్టింగ్ పిల్లవాడిని చూస్తే
నివాస్ గుర్తుకు వచ్చాడు . ఎప్పుడో నిన్ననగా నెల్లూర్ నుండి
వచ్చాడంట . అన్నం తిని రాపో అంటే ....
''తిరిగొచ్చాను మేడం ,ఎలేక్షన్స్ అని ఎక్కడా మెస్ లు లేవు ''
అన్నాడు . మొహం పీక్కొని పోయి ఉంది . కళ్ళ చుట్టూ
ముడతలు . రెండు అరటి పళ్ళు తిని వచ్చాడంట . మనసు
అయ్యో అని మూలిగింది . నా పెరుగన్నం తినెసాను .
లేకుంటే ఇచ్చేద్దును . ఇంత ప్రాణం మీద రిస్క్ ,మాతో
సమానంగా ఆకలి పంచుకున్న పిల్లలకి వాళ్ళు ఇచ్చే
అమౌంట్ 500. (బహుశా వాళ్లకి జీవితం లో మొదటి
సంపాదన కావొచ్చు ). మాకైతే అథర్ పోలింగ్ వాళ్లకి
బోథ్ దగ్గరే డబ్బులు ఇచ్చెస్తారు . వాళ్ళు అక్కడ నుండి
ఏడు కల్లా ఇళ్ళకు వెళ్ళిపోతారు .
కాని ఈ పిల్లలు పాపం మళ్ళా కంట్రోల్ యూనిట్ తెచ్చే
వాళ్ళతో రిసిప్షన్ కి వచ్చి ఆ రికార్డింగ్ కాసేట్ అప్పచెప్పాలి .
రాత్రి ఎంత పొద్దు పోతుందో తెలీదు అన్నం ఉండదు .
ఇంతా చేస్తే డబ్బులు సరిగా ఇవ్వరు . అసలు మనం
విడియో తీస్తే ఎంత ఇస్తాము ఇళ్ళ దగ్గర .
అసలు అన్ని లాప్ టాప్స్ కొనాలంటే
ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది .
పిల్లలు ఎంత మేలు చేస్తున్నారు .
పిల్లల్ని ఎంత విసిగించాలో అంత విసిగిస్తారు .
వాళ్ళు విసుగు పడి సమ్మెకు దిగుతారు .
అదిగో అప్పుడు
'' వెబ్ కాస్టింగ్ వాళ్ళతో ఇబ్బంది '' అంటారు .
ఎవరు ఎవర్ని ఇబ్బంది పెడుతున్నారు ?వాళ్ళ
వయసుని అయినా మనం గౌరవించ వద్దా ?
పాపం వాళ్ళ పొట్టలో ఆకలి ఎంత ఉంటుంది ?
మన లాగా భరించగలరా ?ఏమిటో అంతా మాయ !
నేను ఉన్న పోలింగ్ బూత్ లో నివాస్ ఫ్రెండ్స్ వోటు
వేయడానికి వచ్చి ''ఆంటీ నివాస్ వోటు వేయడానికి
రాలేదా ''అని అడిగితే కొంచెం నా మనసు బాధగా
మూలిగింది .
పాపం వాడు మొదటి సారి కదా వోటు వేయడానికి
వస్తాను అంటే వాళ్ళ నాన్న
''ఏమి రా వద్దు . నేను, అమ్మ ఇద్దరం డ్యూటీ
కి వెళితే నువ్వు ఎక్కడ ఉంటావు '' అని
కటినంగా చెప్పేశారు .
ప్రాక్టికల్ గా ఆలోచిస్తే కరక్టే . కాని పాపం వాడి వోటు
ముచ్చట తీరలేదు కదా !ఇంకో సారి ఎలెక్షన్
ఉంది కదా అంటారేమో ....
ఈ సారి ఇలాగా ఎలెక్షన్ ఉండదు .... సింపుల్ గా
ఎవరికి వారు ఎ . టి . ఎం బోథ్ కు వెళ్ళినట్లు
వెళ్ళడం ఫింగర్ ప్రింట్ , ఐ రిష్ ను ఐ . డి గా
చూపడం ..... ఎ . టి ఎం లో స్వైప్ చేసినట్లు
కావలిసిన వారికి చేయడం . ఇంత జనాభాకు
ఎలా అంటే ఒక వారం టైం ఇస్తారు లెండి ...
మనకు ఖాళి ఉన్నప్పుడు వెళ్లి వెయ్యడమే .
అందరు వోట్ చేస్తారా అంటే ....
ఏముంది వోట్ వేయని వారికి అన్ని రేష న్స్
కట్ అంటే వాళ్ళే పరుగు లు తీస్తూ వచ్చి
వోట్ వేస్తారు . వంద రూపాయలు ఖర్చు చేసి
మరీ ఆధార్ కార్డ్ తీసుకున్నారా లేదా ? అంతే .
పైసా మే పరమాత్మా హై :)

1 comment:
Tnks for understanding our prob's mam.. but I don't think they are big as it is related to responsibility , even teachers who has nearly same age as my parents r facing.. y can't we(young and energetic).They can't improve facilities overnight.But they can provide good food.
Regarding vote casting.. We talked about this with sasidhar garu,dist collector,kadapa,he arranged Postal Ballet system at our colg.. I hope same thing will happen in all other areas in future..
Post a Comment