''భూమి ఏమి చేస్తున్నావు ?''వంటింట్లో భార్య
చేస్తున్న వంటలోకి తొంగి చూస్తూ సుబ్బారావు .
విసుగ్గా మొహం పెట్టి కూరలో ఆలు ముక్కలు వేసి కలయ బెట్టి
పక్కన ఉన్న చపాతి పిండి చిన్న ముద్దలుగా చేయసాగింది .
పిల్లలిద్దరూ హాస్టల్ లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం వాళ్ళు ఇద్దరే .
ఉదయం ఇద్దరు ఆఫీస్ హడావడిలో మాట్లాడుకోవడం కూడా పెద్దగా
ఉండదు . కాసింత ఊసులాడుకొనే సమయం ఇదే .
అటు తిరిగి చపాతీలు పాముతున్న భార్య మీదకు వంగి చూస్తూ మెల్లిగా
భుజం మీద ముక్కు రాస్తూ ఉన్న తనని చూసి ,
ఇంక మొదలు మనసులోనే అనుకుంది .
''మా అమ్మ మరీ ఇంత చిన్న చపాతీ లు చేయదు . అందుకే
నీ చపాతీలు ఎన్ని తిన్నా కడుపు నిండదు . కొంచెం మా అమ్మ లాగా
చెయ్యొచ్చు కదా !''
మెల్లిగా నడుం మీద వేసిన చేయి విసిరి కొట్టి కూర వైపు కోపం గా
తిరిగి కలియబెట్టి కొంచెం మసాలా పౌడర్ వేసింది .
''అబ్బ మా అమ్మ లాగా నూరిన మసాలా వేయవచ్చు కదా !
మా పిన్ని చపాతి లోకి కారెట్ కూర ,పచ్చి కొబ్బరితో కలిపి
చేస్తుంది . ఎంత బాగుంటుందో . ఏమిటి దీనిలో బటానీలు వేసావా ?
అసలు తినాలని చేస్తావో ,తినకూడదని చేస్తావో అర్ధమే కాదు .
అసలు ఇది చపాతీ లోకి బాగా ఉండదు చూడు ''విసుగ్గా చెప్పాడు .
ఏమి తెలుసు మీకు కోపంగా మాట జారబోయి ,ఎందుకులే గొడవలు
అని పెదవి కొరుక్కుంది అసహనంగా . పెనం మీద చపాతీ కాలుస్తూ
ఉండే లోపల మనసు కూడా కోపం గా ఉడుకుతూ .
పట్టించుకోకుండా వెళ్లి టి . వి లో న్యూస్ చూడసాగాడు .
''ఛా ....... ఎలా విరిచేస్తారు వీళ్ళు ఉండే మనసును కూడా .
ఎంత చేసినా తృప్తి ఉండదు . ఎవరు ఎవరితోనో పోలికలు ,
అసలు ఈ రోజు ఆఫీస్ లో ఎంత పని ,పక్కన కొలీగ్ సెలవు
పెట్టడం తో నోట్స్ తయారు చేయడంలో అన్నం కూడా తినకుండా
పని చేసింది . రెండు సార్లు టీ తప్పితే ఇప్పటివరకు ఏమి తినలేదు .
అసలు ఓపిక లేకపోయినా ఫ్రెష్ బటానీలు ఈయనకు ఇష్టం అని
మసాలాతో కొత్తగా కూర చేస్తే పొగడటం లేదు ,కాసింత మెచ్చుకోలు
లేదు ,ఇంకా తినక ముందే బాగుండదు అని కామెంట్లు .
భర్త అయితే ఏమిటి పెద్ద ?పనికి విలువ ఇవ్వనప్పుడు .
తనతో ఇంటి బరువును మోస్తున్న భార్య కు కాసింత ప్రేమను
పంచనపుడు ''మనసులో సుడి తిరిగుతున్న బాధ రెప్పలపై
అశక్తత తడిగా ఊరుతూ ..... కొంగుతో తుడుచుకొని కాలిన చపాతి
హాట్ బాక్స్ లో పెట్టి ,ఇంకో వైపు ఇంకో చపాతి పామి పెనం పై వేసి
కూర కింద స్టవ్ ఆపేసి టేబుల్ మీద పెట్టింది . అటు తిరిగి చూస్తే
న్యూస్ లో లీనమై పోయి చూస్తున్నాడు .
విసురుగా వంటింట్లోకి వెళ్లి చేతిలోని ప్లేట్ సింక్ లోకి విసిరేసింది
కోపం అణుచుకోలేక . శబ్దానికి ఇటు తిరిగి మళ్ళా అటు తిరిగాడు .
అన్నీ రెడీ అయితే పిలుస్తుంది కదా అని .
అంత బాధ లోనూ అమ్మమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి భూమి కి .
''మగవాడికి అసహనం ఎక్కువ . జీవిత చక్రం మీద ఘర్షణ పడకుండా
కందెనలా మారి ఆడవాళ్లే అణుకువ తో కాపురం దిద్దుకోవాలి తల్లి .
పగలగొట్టుకుంటే అది ఎవరి కాపురం !నీదే కదా . నచ్చలేదు అని
విడాకులు తీసుకున్నా ,తరువాత వచ్చేవాళ్ళు మగ వాళ్ళే .
అణుకువే ఆడదానికి రక్ష గుర్తుంచుకో ''
''అవును అందరు ఆడదానికి అందరు అణకువ గురించి క్లాస్ లు
చెప్పే వాళ్ళే, ఆడదానికి ఏమి బాధ కలుగుతుందో అర్ధం చేసుకోమని
మగ వాళ్లకు చెప్పే వాళ్ళు ఉండరు . ఛీ ఈ లోకమే ఇంత ''
కళ్ళ నీళ్ళు కనపడకుండా తుడుచుకుంటూ అన్నీ టేబుల్ మీద సర్దింది .
మళ్ళా అవి కనపడినా బోలెడు తిట్లు తనకే ''మాటికి కుళాయి
తిప్పెస్తావు ,నేను ఎంత బాగా చూసుకున్నా ''అని .
చెప్పలేని బాధకి రూపం కన్నీళ్లు అని ,అది మా ఆశక్తతకి గుర్తు
అని వీళ్ళు ఎందుకు తెలుసుకోరు .
భార్య కోపం అర్ధం అయినట్లుగా ఉంది . గమ్మున ప్లేట్ లో చపాతీలు
కూర పెట్టుకొని ,నువ్వు కూడా తిను భూమి అనకుండా గబగబ
తినేసి లేచి చేయి కడుక్కున్నాడు . అగ్ని పర్వతం కింద లావా ఉబుకుతుందని
తెలిసినపుడు దానిలో తొంగి చూసే సాహసం సుబ్బారావు చేయడు .
మెల్లిగా కూర మూత తీసి చూసింది . ఏముంది అక్కడ ఒక్క గరిటెడు
కూర . బాగుందని మొత్తం తినేసాడు . ఈ పాటి దానికి ఏమి బాగుండదు
చూడు అని ముందే కామెంట్లు . కొత్త కూరనా ?తిని చెపుతాను అని
అంటే తనకు ఎంత సంతోషంగా ఉంటుంది . కావాలంటే తిన్న తరువాత
ఈ రుచి నచ్చ లేదురా అంటే ,తనకు ఇష్టం లేనిది ఇంకెప్పుడూ
చేయదు కదా . భార్య అలిసిపోయినపుడు తమ ప్రేమ వాళ్ళను సేద
తీరుస్తుందని ఈ మగ వాళ్ళు ఎప్పటికి గ్రహిస్తారో !!
కూర లేకుండా తినలేక , బాధతో ఆకలి చచ్చిపోయి వెళ్లి పడుకుంది
మౌనంగా . ఫోన్ మోగితే తీసి మాట్లాడుతున్నాడు .
''ఆ అమ్మా బాగున్నాము ''
''అత్త గారు కాబోలు . ఇంకేమిటి ,పాపం రా నీకు ఆలు కూర
ఇష్టం . తిని ఎన్ని రోజులు అయిందో నువ్వు పాపం . భూమి కి
రాదు కదా . ''అంటూ ఉంటుంది కసి గా అనుకొని మంచం
చివరకి గోడ దగ్గరకి జరిగి వీపు ఇటు వైపు ఉంచి ముడుచుకు
పడుకుంది . ఆకలి కంటే మనసులో బాధే ఎక్కువగా తలగడ
తడిసిపోతూ ఉంది .
పక్కన పడుకున్న అలికిడి కి కూడా తిరగలేదు .
మెల్లిగా పైన వేసిన చేయి గారంగా నిమురుతూ ....
నిజంగా స్పర్శ చాలా విసుగ్గా ఉంది .
తోసేస్తుంటే ఆయన బలం ముందు తన బలం ఎంత !
''చెప్పేది విను భూమి ,అమ్మ ఏమందో తెలుసా ?''
చేతిని భూమి ని పైకి లేవకుండా అడ్డు ఉంచి అన్నాడు .
విని తీరాల్సిందే అనే పంతం ఆ మొరటు బలం లో .
ఎందుకు లొంగాలి మనసులోనే గింజుకుంటూ ఉంది ,లేవాలని
ప్రయత్నం చేసినా వీలు కావడం లేదు .
''చెప్పేది విను ''భూమి మొహం అంత దగ్గరగా చూస్తూ ఆగలేక ,
వినను అని పక్కకి తిప్పిన మొహం పైకి వంగి చెవి ని నిమిరి
చెప్పాడు ''భూమి చాలా మంచిదిరా . ఆఫీస్ లో అంత పని
ఉన్నా మళ్ళా వచ్చి వంట చేస్తుంది . నేను ఇంట్లో నే
ఉంటూ ఒక్క వంట చేసిపెట్టడానికి ఎంత కష్టపడుతున్నాను.
అలాంటిది తను ఆఫీస్ లో ,ఇంట్లో . ఎంత శక్తి కావాలో తెలుసా
ఇంత పనికి . ఇంత పని ఎందుకు చేస్తారో తెలుసా ఆడవాళ్ళు !
కేవలం భర్త ప్రేమ కోసమే . నువ్వు తనకు ఇవ్వగల సహాయం
ప్రేమేరా ,ఎప్పుడూ ఇతరులతో తనని పోల్చొద్దు . ఎవరి భార్య
వాళ్లకు ఎక్కువ . ఇద్దరి లో ఉండే బలహీనతలు బట్టి ఒకరికొకరు
ప్రేమతో సహాయం చేసుకోవాలి . భూమి ఏడిస్తే ఇంటికి మంచిది
కాదు . భార్య నవ్వుతూ ఉంచగల మగ వాళ్ళే కాపురం సరిగా
చేస్తున్నట్లు . అర్ధం అయ్యేట్లు చెపితే మాట వినని వాళ్ళు ఉండరు .
కాకుంటే మీరు చెప్పేది విసుగుతో కాక ప్రేమతో ఉండాలి ''
అని చెప్పింది .
''అయితే ఏమిటి మీకెలాగు నా కూర నచ్చలేదు కదా ''
మెత్తబడినట్లు తెలీకుండా కోపం నటిస్తూ .
''నచ్చక పోవడమా సూపర్ ఉంది తెలుసా !''చటుక్కున
బుగ్గ పై చిన్న ముద్ర ............. ''ఇంత బాగుంది ''
చిలిపిగా చూస్తూ అన్నాడు .
ఆకలి ఎటు పోయిందో ,మనసంతా సంతోషం తో నిండిపోయి
చేతుల మధ్య ఒదిగిపోయింది .
''అత్తగారు థాంక్యు . ఎంత సేపు భార్యా భర్త ల మద్య అహాలు
రెచ్చగొట్టే వాళ్ళు కాదు ,మీలాగా మగ వాళ్లకు అర్ధం చేసుకొని
ప్రేమతో గెలవమని చెప్పే వాళ్ళు ఉండాలి ''మనసులోనే కృతఙ్ఞతలు
చెప్పుకుంది .
@@@@@@@@@@@@@@@@@@@

4 comments:
Very nice post..
thanks anu garu
chala baga chepparu madam
butiful
Post a Comment