Monday, 2 January 2012

రాజన్నా....నీకు నువ్వే....సాటన్నా.......



"నిగమా నిగమాంత వర్ణిత .......
పైపైన సంసార బంధముల కట్టేవు.....
సినిమాల సంగతేంటి నారాయణా..."


అలా ఒక్కో సారి మర్చిపోయి దేవుడి దగర కూర్చుని 
పాడేసుకుంటూ ఉంటాను.....ఒక మంచి రోజున మా వారు 
వినేసి నవ్వేసుకొని.....సరేపో న్యు ఇయర్ రోజు నిన్ను సినిమాకి 
తీసుకేళుతాను అనేసారు.....మాట ఇచ్చిందే మహా ప్రసాదం 
అనుకోని సాయంత్రం ఎన్ని వంకలు చెప్పినా వినకుండా
పట్టు పట్టి ...చేయి పట్టి(ఏమిటి చొక్కా బట్టా) లాక్కేళ్లి పోయాను...


ఎక్కడికా?"అమ్మా ..అవని ...నేల తల్లి....ఎన్ని సార్లు పిలిచినా 
తనివి తీరదేన్డుకని "ఈ క్షణం తలుచుకుంటే కూడా హృదయపు 
తడి కంటి పాపపై ఊరుతూ  ఉంది......


"మాట తూటా అయితే .....పాట ఫిరంగి ......
కోటి భావాలని ఒక్క పల్లవిగా ఆలపిస్తుంది...."


ఆసెంబ్లీ లో నేను పాడుదమా స్వేచ్చా గీతం .....అనగానే 
అది 750 మది గొంతుగా పల్లవించి.....
స్కూల్ యావత్తూ జులియాన్వాలా బాగ్ దురంతాల వెంట పరిగెడుతుంది....
రక్తాన్ని మరిగిస్తుంది......అదీ పాట కుండే పవర్........


కధలోకి వస్తే.....రాజన్న....తన స్నేహితులు నలుగురితో కలిసి 
బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన విప్లవ వీరుడు.....మనకు 
మొదట్లో తన సమాదినే చూపించి తన భార్యగా లక్ష్మమ్మ ని ,
తన వళ్ళో పురిటికందుగా కూతురు మల్లమ్మని ....దొరలు 
చంపటానికి తరుముతుండగా రెల్లు పొదలలలో దాక్కున్నట్లు చూపిస్తారు.పాపం ఆడ మనిషి ఎలా కాపాడగలదు బిడ్డని...
తల్లి మనసు చంపుకొని కన్నీళ్ళతో బిడ్డని నీళ్ళలో తాడి దుంగ 
పై పెట్టి వదిలేస్తుంది(అంతే ఏమిటో వెర్రి దేముడు మాకు ఇంత శక్తిని ఇచ్చి మమకారం అనే బలహీనతని పెట్టేశాడు)
దొరలూ రాజన్న మీద కసితో భార్యను కూడా తరిమి చంపేస్తారు.
అప్పుడు బిడ్డ లేదని తెలుసుకొని దొర నీళ్ళలో ఉన్న బిడ్డని 
చంపపోతే గుర్రం కింద పడేస్తే చచ్చి పోతాడు.సాంబయ్య ఆ 
బిడ్డని క్షేమంగా తీసుకొని తన మనవరాలి లాగ పెంచుతాడు.
అది చూసి లక్ష్మమ్మ ఆనందంగా దణ్ణం పెట్టి చనిపోతుంది.


పాపకి వాళ్ళ ఇంటి పక్కన ఉండే సమాది రాజన్నది అని ,
తను వాళ్ళ నాన్న అని తెలీదు.అక్కడ దెయ్యాలున్నాయి
అనిచేపుతాడు తాత(అయ్య బాబోయ్ మళ్ళా దెయ్యాల సినిమానా 
అని బయపడిపోయా) .ఆ ఊరిలో ఎవరు చదువుకోవాలన్న 
దొరసానికి చెప్పి చదువు పన్ను కట్టాలి.వాళ్ళు పన్ను కట్టటానికి 
వెళ్ళినప్పుడు దొర రాజన్న వలన చనిపోయాడని ,దొరసాని 
కోపంగా ఉంటుంది.ఎవరు చూసినా ఆమెకి "నీ కాళ్ళు మొక్త
బాంచన్"అనాల్సిందే...(నేను తెలంగాణలో ఇదే చూసాను.
వాళ్ళు హాస్టల్లో పిల్లల కు పర్మిషన్ కోసం వస్తారు....నీ కాల్మొక్త 
జరా పంపించు తల్లి అంటారు....నాకైతే ఇదేమిటి పర్మిషన్ 
కోసం కాళ్ళు మొక్కటం అని బాధ వేసేది)


అక్కడ దొర గాడీలో కులకర్ణి అనే సంగీత విద్వాంసుడు దొరసాని 
కూతురికి సంగీతం నేర్పుతుంటాడు.ఆమెకి ఏమి రాదు..కాని 
మల్లమ్మ ఒక్క సారి విని పాడేస్తుంది.....పాట వినగానే 
దొరసాని బయటకు వచ్చి మల్లమ్మ చిన్న పాప అనికూడా 
చూడకుండా కొరడాతో కొట్టేస్తుంది.....ఎందుకంటె 
రాజన్న పాటలతోనే ఫ్లాష్ బ్యాక్ లో ప్రజల హృదయాన్ని 
మరిగించి దొరలపై ప్రజలు వారే తిరుగుబాటు చేసేటట్లు చేస్తాడు.
తరువాత వాళ్ళు పన్ను ఆడవాళ్ళపై వెయ్యాలని స్నేహాని  అవమానిస్తుంటే కత్తి తీసుకొని దొర చెయ్యి నరికేస్తాడు.
(ఇక్కడ నాకు యెంత కోపం వచ్చిందంటే రాజన్న రాకుంటే 
నేనే వాడి తల నరికేయ్యలని పించింది.అది కధ మనలో దూసుకుపోయిందీ అని గుర్తు....విజిల్స్ అయితే హాల్ లో 
చెప్పక్కర్లేదు......అందరు తామే ప్రతీకారం తీర్చుకున్నట్లు 
ఫీల్ అయ్యారు....ఉంది భారతీయత ఇంకా....)తరువాత తానె 
లక్షుమమ్మ ను పెళ్లి చేసుకుంటాడు.మల్లమ్మ ను నిండు నెలలతో
ఉన్నప్పుడు ,నిజాం  దొరలూ దొంగ సమాచారం ఇచ్చి తే 
అందరు వేరే దగ్గరకు వెళ్లి యుద్ధం చేయటానికి కాచుకొని 
ఉంటారు.కాని వాళ్ళని దారి మళ్ళించి ,దొరలూ ఊరిపై దాడి
చేస్తారని తెలిసి మల్లన్న ఒక్కడే తన నలుగురు స్నేహితులతో 
కలిసి అందరిని చంపి ఉదయం వరకు కాపలా ఉండి
చనిపోతాడు.ఆ ఊరి వాళ్ళు సమాది కట్టి పూజ చేసుకుంటూ 
ఉంటారు.అబ్బ ఈ లాస్ట్ సీన్ ....అసలు ప్రతి సీన్ ఎందుకులెండి
మళ్ళా చూడాలి అనిపిస్తాయి....రక్తాన్ని మరిగిస్తాయి.....


(నాకైతే వీలయితే మళ్ళ హైదరాబాద్   dts లో చూడాలి అనిఉంది)


ఒక సీన్లో రాజన్న వాళ్ళ ఊరికి మొదట వస్తాడు ...అప్పుడే 
అమ్మ అవని పాట....ఊరి చివర ఒకామె వళ్ళో పాపను 
పడుకోబెట్టుకొని లాలి పాడుతూ ఉంటుంది.ఆమెని నువ్వు 
ఊరి చివర ఎందుకు ఉన్నావు ?అని అడుగుతాడు.
అప్పుడు ఆమె..."ఊరిమీద రజాకార్లు పడి మగోల్లను  
చంపిన్రు....ఆడవాళ్ళను.....అని వాళ్ళు ఎలా పాడు చేసింరో చెపుతుంది......(నిజమే ఆ సంఘటనలు అంత ఘోరంగానే 
 ఉంటాయి...యెంత కసి ఆడవాళ్ళలో రేగకుంటే తమ మానాలు 
అడ్డుపెట్టైనా విప్లవ కారులను కాపాడాలని అనుకుంటారు....
షర్మిలా చాను ఇంతవరకు నిరాహారంగా ఎందుకు దీక్ష 
చేస్తుంది.....చివరకి కోర్ట్ కూడా ఆడవాళ్ళు అభిమానం కోసం 
చంపామంటే శిక్ష వేయదు.....అవును ఆ ఘటనలు 
 అంత ఘోరంగా ఉండి ఉంటాయి)


తరువాత ఆమె ఒక మాట అంటుంది....అప్పుడు ఏడ్చి నిద్ర 
పోయిన బిడ్డ ఇంతవరకు కళ్ళు తెరవలేదన్నా.....అంటుంది.
అంటే ఆ బిడ్డ చనిపోయింది......అంటే హాల్ల్లో మొత్తం అందరి 
కళ్లపై కన్నీటి పొర......భాదని కమ్మేస్తూ.......


పాప కధలోకి వస్తే పాప రాజన్న బిడ్డ అని దొరసానికి 
తెలిసి ...వాళ్ళ తాతని చంపేసి పాపని ఇంట్లో ఉంచి 
కాల్చేస్తుంది.


కాని కులకర్ణి,ఊరివాళ్ళు పాపను కాపాడుతారు.
పాప డిల్లీ కి  బైలుదేరుతుందినెహ్రూ ని
కలిసి ఊరిని కాపాడాలని....అబ్బ అప్పుడు 
ఊరివాళ్ళంతా డబ్బులు వేసుకొని ఈయటం,
మట్టి తీసుకొని వెళ్ళటం,నడిచి వెళ్ళటం....
ఎంతవారినైన ఎక్కిళ్ళు పెట్టించింది పాప నటన.


తరువాత ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి నెహ్రు ముందు 
పాటల పోటిలోకి పాల్గొనటానికి దొరసాని నుండి 
తప్పించుకొని వెళుతుంది.కాని అప్పటికే అందరు ఆడిటోరియం
నుండి వెళ్ళిపోతారు.అయినా బయపడకుండా
మైక్ తీసుకొని...అమ్మ అవని ...పాడుతుంది....
నెహ్రు గారితో సహా అందరు వెనక్కి వచ్చి వింటారు.
వాళ్ళ ఊరికి మేలు చేస్తాడు.


ఒక్క పాట ఏమిటి ప్రతి..పాట ...మాట...
మట్టి పరిమళాన్ని మనకు పులుముతుంది....
హృదయాన్ని తడుముతుంది......నిద్ర పట్టని 
కనుపాపలుగా మారి ఆలోచింపచేస్తుంది.


(తెలంగాణా బాష కొంచం తగ్గించారు కాబట్టి 
అందరికి అర్ధం అయింది.మూడేళ్ళు హన్మకొండ లో 
ఉన్నాను.ఆడపడుచులా ఆదరించి మా వంశాంకురాన్ని 
వడి లో  నింపి పంపారు.....తడి నిండిన తల్లి హృదయంతో 
చెపుతున్నా .....తెలంగాణా వాళ్ళు ఎక్కడున్నా సల్లగుండాలే)


ఇంకా చెప్పెడిది ఏముంది?


మనిషికి 
మట్టేంటే ఇష్టం 
బూడిద గా నైన 
దానిలో కలుస్తాడు....


రాజన్నా....కళామతల్లికి శిరసు వంచి కాల్మొక్త ....బాంచెన్.....

11 comments:

శేఖర్ (Sekhar) said...

Patriotic review....bagundhi...

Even Nellore has multiplex or even in Tirupathi
:-))

పల్లా కొండల రావు said...

రివ్యూ సక్కగున్నాది !

రాజ్ కుమార్ said...

హ్మ్మ్.. మొత్తానికి సినిమాకి బాగా కనెక్ట్ అయినట్టున్నారు.. ;)

బాగుందండీ మీ రివ్యూ...

వనజ తాతినేని/VanajaTatineni said...

సినిమా ని చూపించారు. చాలా బాగుంది.. మద్యలో..మీ డైలాగ్స్ డైనమేట్ లా పేలి.. పొట్ట చేక్కలైంది. హృదయం తడి అయింది. ఈ మట్టి.. ఈ భావం ఎప్పుడూ గొప్పే కదా!

శశి కళ said...

యెలాగైన చూడాలి అనుకుంటున్నా...శెఖర్...థాంక్యు


కొండలరావు గారు థాంక్యు.


రాజ్,నీ ప్లస్ లొ పొస్ట్ చూసి వెళ్ళాను.అసలు ఇన్ని రొజులు యెందుకు వెళ్ళా లెదా?అనిపించింది.

శశి కళ said...

వనజ గారు మీ కామెంట్ చూస్తె కాని నాకు త్రుప్తి
ఉండదు...థాంక్యు

వేణూశ్రీకాంత్ said...

రాజ్ అన్నట్లు సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు :) బాగా రాశారండి.

శశి కళ said...

అవును వెణు....థాంక్యు

kiran said...

>>చేయి పట్టి(ఏమిటి చొక్కా బట్టా) :) -- హిహి :D

>>నేనే వాడి తల నరికేయ్యలని పించింది -- వద్దు..కంట్రోల్..కంట్రోల్

ఆహా..మీరు రాసిందంతా..చదివితే....ఇపుడు వెళ్లి సినిమా చుసేయాలని ఉంది :)

Unknown said...

Movie reviews lo meku mere sati ...baga rasaru akka

Krishna Palakollu said...

too late comment i know
but ya, i couldnt digest the movie story and felt the same thing:

రాజన్నా....కళామతల్లికి శిరసు వంచి కాల్మొక్త ....బాంచెన్.....

for our generation of people who dont know how painful sacrifice could be!