Saturday 10 March 2012

మళ్ళీ ...ఎందుకన్నా....నెల్లూరని అభిమానం అన్నా...

మిత్రులు ఒకరిని ఈ పోస్ట్ వేయటం లో హెల్ప్ అడిగాను.
ఇది చాలా మంది చూసారు మళ్ళి ఎందుకు అన్నారు.
నిజమే ఎందుకు ?ఏమో మరి నా హృదయాన్ని కదిలించేవి ,
నాకు సంతోషం కలిగించినవి ......ఒక దగ్గర ఉండాలన్న 
స్వార్ధం కావొచ్చు.......


నెల్లూరంటే అభిమానమెందుకన్న.......
కధలు అంటే ప్రియ మెందుకన్న......
ఈ నీళ్ళు తీపెందుకన్న.........
మొలగోలుకులు రుచి ఎందుకన్నా.....
తిక్కన కలాన్ని .....మదిలో నిలుపుకున్నందుకే నన్నా.....
ఈ నేలపై ఊపిరి పిలుపు అందుకున్న.....
ఆత్మీయతా నెలవుల నీడన మసిలి నందుకన్న........


ఖదీర్ బాబు గారు అభినందనలు.
మీ కలం నుండి ఎన్నో కాలాన్ని ఎదిరించి నిలబడే 
శిలాక్షరాలు....సువర్ణాక్షరాలుగా వెలువడాలని ఆశిస్తున్నాను.


hmtv lo vandella kadhaa lo khadeer babu gaari program link ikkada


12 comments:

రాజ్ కుమార్ said...

good one :)
మొలగోలుకులు అంటే ఏమిటండీ?

శశి కళ said...

రాజ్....మొలగొలుకులు అంటే ఇక్కడ పండె బియ్యం.
నెల్లూరు అంటే నెల్లి+ఊరు....వడ్లు పండే ఊరు అన్న మాట.నెల్లూరు మొలగొలుకులు అంటే ప్రసిద్ది...వాటిని
తొమ్మిది నెలలు పండించాలి.అంటే ఒక్క పంటే వస్తుంది
యెడాదికి....మెము వరంగల్ లొ ఉన్నా బియ్యం
ఇక్కడ నుండె తెప్పించుకునె వాళ్ళం....ఆంత ఇష్టం నాకు.

Anonymous said...

దర్గామిట్ట కథలు చాలావరకు చదివాను. బాగుంటాయి.

ఆ మొలగొలుకులు బియ్యం ఇప్పుడు కూడా వస్తున్నాయా?
ఎవరినో అడిగితే ఇప్పుడు పండించటంలేదని చెప్పారు.

వెంకట రాజారావు . లక్కాకుల said...

తిక్కననూ , మొలగొలుకుల ,
నిక్కపు నెల్లూరి పెన్న నీళ్ళను బొగిడెన్
మక్కువ పడి శశి కళ తా
నక్కజ మనిపించె రంగ నాయకు మరువన్

బ్లాగు: సుజన-సృజన

శశి కళ said...

బొనగిరి గారు..పండిస్తున్నారు...కాని తక్కువ...మెము ఇప్పటికి అవె తింటాము.థాంక్యు

శశి కళ said...

రాజారావు గారు...పెద్ద వారు గుర్తు చెసారు....
ఆ రంగనాధుడె కాదు....జొన్నవాడ కామాక్షమ్మ కూడా
నన్ను కాపాడుతూ ఉంటారు...థాంక్యు

జైభారత్ said...

మాది నెల్లూరు జిల్లా....నాయుడుపేటండి ..శశి గారు...

అంతర్ముఖం said...

good to see this blog
sasi gaaru...

శశి కళ said...

antarmukam gaaru..thanku

Geeta said...

ఇన్నేళ్ళ నుండి నెల్లూరు లో వున్నా నాకు ఆ పేరు ఎలా వచ్చింది అని తెలియదు .. అసలు ఆ ఆలోచన కూడా రాలేదు .. ఒక కొత్త విషయం తెలుసుకున్నాను .. కృతజ్ఞతలు :)

రాజ్ కుమార్ said...

ఈ పోస్ట్ రాసే టైం కి నాకు ఖాదిర్ బాబు ఎవరో తెలీదు..

దర్గామిట్టకధలు.. మొన్నే చదివాను,
ఇప్పుడు పోలేరమ్మబండ్ కతలు చదూతున్నా...

ఆహా... ఖాదిర్ బాబు గారూ.. అద్బుతం..

శశి కళ said...

అందుకె రాజ్...పరిచయమ్ చెసింది...నువ్వు మాత్రం ప్లస్ లొ పొస్ట్ కెక....