Tuesday 10 April 2012

మా జీవితాలు ....గాలిలో దీపాలు...

హూ.....ఏమిటి ఇంత నిట్టూర్చాను అనుకుంటున్నారా?


ఏమి చేసేది చెప్పండి.....''గురు బ్రహ్మ ...గురు విష్ణు''
అని పూజించిన దేశంలో మా పరిస్తితి ఇలా అవుతుందని 
ఎప్పుడూ అనుకోలేదు.


ఏదోలే మంచి జాబ్ లో చేరాము....కొంచం దేశ సేవ కూడా 
చెయ్యొచ్చు.....పిల్లల మనసులో నిలిచిపోవచ్చు అని 
అనుకున్నాము....కాని ఏమిటి ఇప్పటి పరిస్తితులు....


మొన్నటికి మొన్న రాత్రి సినిమాకి పోతున్నారని నైట్ వాచ్ మాన్ 
పట్టుకుంటే.....అతనిని తంతే....పాపం అతను దవడ ఎముకకి 
స్టీల్ రాడ్ వేయించుకున్నాడు.


సుశీలా మేడం గారు చదవలేదని మందలించారని .....
కత్తితో పిల్లవాడు  దాడి చేస్తే.....చావు దాక వెళ్లి ఎలాగో బ్రతికి వచ్చింది.
పాపం తనని చూస్తె అయ్యో అనిపించింది....అసలు ముసలి వాళ్ళ కంటే 
ఘోరంగా మెట్లు ఎక్కుతూ ఉంది....అయ్యో అంటే....ఏదో లెండి 
మా పిల్లల కోసం బతికాను చాలు అంది.ఏమి తప్పు చేసింది 
చదువు అని మందలించటం కూడా తప్పేనా?


ఈ మళ్ళా న్యూస్ లో ఒక అయ్యవారు ....పాపం మెట్రిక్ లో 
కాపి కొట్టనీలేదని ఇద్దరు పిల్లలు కార్ తో గుద్ది చంపేశారు అంట....


ప్రతి వ్యవస్థ లో అంతో ఇంతో తప్పులు ఉంటాయి....కాదని అనటం 
లేదు....కానీ పిల్లవాడి మదిలో టీచర్ కి ఉన్న స్తానం ఎప్పటికి 
విలువైనది.
తల్లి తండ్రులు ఇంట్లో ఉన్న ఒక్క అడాల్సేన్స్ పిల్లవాన్ని మంచి 
దారిలో పెట్ట లేక పొతే.....కనీసం దండించకుండా అంత మందిని 
ఒక్క టీచర్ ఎలా పెట్టగలడు?
ప్రతీ టీచర్ కి మంచి  టీచర్ గా ఉండాలనే ఉంటుంది.


దండించినపుడు కూడా వృత్తి ధర్మం తో చేస్తాము కాని 
కావాలని కాదు కదా......
చదవండి ఈ న్యూస్......ఆ టీచర్ మృతికి సంతాపం తెలుపండి.
వాళ్ళ కుటుంబ సభ్యులను ఆ దేవుడు చల్లగా కాపాడాలి.....

10 comments:

ఫోటాన్ said...

ఇలాంటి వాటికి పూర్తిగా పిల్లలను తప్పు పట్టలేం, వాళ్లకు ఆ ప్రేరణ కలిగించేలా వస్తున్న సినిమాలు, రేటింగ్స్ కోసం హింసాత్మక ఘటనలు పడే పడే చూపించే మీడియా వీటికి బాధ్యులు.
అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల మనస్తత్వం పై నిఘా వుంచడం మంచిది.

జలతారు వెన్నెల said...

బాధాకరమైన సంఘటన. ఎందుకు అంత vengeance ఉంటుండో అంత చిన్న వయసులో పిల్లలకు అర్దం కాదు నాకు.

రాజ్ కుమార్ said...

హ్మ్మ్... ఏం చెప్పాలో కూడా తెలియటం లేదండీ..

విద్యార్ధిని కొట్టకూడదని ఇప్పుడు గవర్నమెంట్ రూల్ అంట కదా..??
టీచర్స్ ని చంపకూడదని కూడా రూల్ పేట్టాలేమో..ః((((((((

వనజ తాతినేని/VanajaTatineni said...

Ayyorlu,Ayyorammalu.. nirasanalu modalettandi. dunduku vidhyaardhulavalla meekemainaa ayite..mee pillalaki dikku yevaru?

రాజ్యలక్ష్మి.N said...

శశి కళ గారూ.. ఎంత గొప్ప వ్యక్తికైనా ఆ స్థాయి రావటానికి కారణం గురువులే కదండీ..
మనం చదువుకునే రోజుల్లో టీచర్ కొట్టినా మన మంచికే అనే వాళ్ళు మన పెద్దలు..
కానీ ఇప్పుడు ప్రతి చోటా ఇలాంటి విపరీత ధోరణులే కలిపిస్తున్నాయి.

శశి కళ said...

అందరు అనీ తెలిసిన వాళ్ళే నేను ఏమి చెప్పగలను....నా అనుభవం యెంత....
కాని ఒకటి చెప్పగలను ...మా నాయన పండగ రోజు మాతో ధాన్యం దానం చేయించిన
రోజే నాకు అలా పక్క వాళ్లకు ఇవ్వాలి అని తెలిసింది....మా అమ్మ పుట్టిన రోజు పెద్దవాళ్ళకు
మొక్కిన్చినపుడే పెద్ద వాళ్ళను గౌరవించాలని తెలిసింది....అయ్యవారు శశికి బలే తెలివి అన్నప్పుడే
నేను ఇంకా సాధించగలను అని తెలిసింది.....ప్రతి ఒక్కరు నాకు తమ ప్రవర్తనతో ఏదో
ఒకటి నేర్పిస్తున్నప్పుడే నేనింకా నేర్చుకోవాలి అని తెలిసింది....ఒక సైకిల్ కూడా రాని కొలీగ్
ప్రోత్సహం తో నేను స్కూటీ నడిపినపుడే వాళ్ళలోని లోపాలు గ్రహించకుండా ....మంచి గ్రహిస్తే
మేలని తెలిసింది.....వీలయితే మనకు తెలిసిన విషయాలు పక్క వారికి చేపుదాము....
పక్కన ఉండే పిల్లలు ను అయినా మంచి మాటలతో నడిపిద్దాము .

Anonymous said...

good never die

Anonymous said...

ekkada... undi////??
education sasi gaaru

నిరంతరమూ వసంతములే.... said...

యస్! మీరనట్టు మన చుట్టుపక్కల పిల్లలకి మంచి చెబుతాము. మంచి దారిలో నడిపిద్దాం. కానీ ఆ పిల్లల తల్లితండ్రులు మనం చెప్పేదానిని ఎంత పాజిటివ్గా తీసుకుంటారన్నదే! మా పిల్లలకు నువ్వు చెప్పేదేమిటి...మీ పిల్లల సంగతి చూసుకో అంటారేమోనని భయం...వాస్తవం కూడా! ఏదేమైనా ప్రయత్నిచాలి.

శశి కళ said...

అన్తుర్ముఖం గారు అభినందనలకు థాంక్యు.


నిరంతరం వసంతములే గారు ...మనం మంచి మనసుతో చేస్తే ఏమి అనుకోరు...నేను చేసే పని మంచిది అనుకోండి ముందు.