Thursday, 12 April 2012

పిలక పట్టుకొని లాక్కుని రండి....ఎవరో ఆనందం అంట...

ఏమిటి మీరు ఉన్నారా?ఆనందం కావాల్సిన లిస్టులో.....
ఎవురికి వద్దంటారు లెండి.....మరి అది ఎక్కడ ఉందొ....

ప్రస్తుతానికి ముందు ఈ వేణు గారు పంచుకున్న ఫోటో చూడండి....
తరువాత మాట్లాడుదాము...

చదివారా?ఏమి అర్ధం అయింది?
ఓహో ఆనందం గా జీవించటమే పరమార్ధం అని...

మరి అది ఎలా వస్తుంది....
అది చెప్పటానికే ఈ పోస్ట్....



ఇది ఇప్పుడే వ్రాయటానికి రెండు  కారణాలు ఉన్నాయి...
ఒకటి భూకంపం వచ్చింది......
రెండు యువి......

భూకంపం వలన ఏమి తెలుసుకున్నాము ఈ రోజు ఉంటె రేపు 
ఉంటాము అని గ్యారెంటీ లేదు అని......

మరి యువి .....ఏమి చెప్పాడో మీరే చూడండి...


ఇంకా ఏమి చెప్పాడు అంటే.....

''నా ఆలోచనలు మారిపోయాయి.ఆట వలన పేరు ,ప్రఖ్యాతులు 
డబ్బు అన్నీ వచ్చాయి.కాని ఇప్పుడు కుటుంభం 
స్నేహితులు తోడుగా ఉండటమే ముఖ్యం అనిపిస్తుంది.
డబ్బు ముఖ్యమే కాని అంతకంటే ఆరోగ్యం గా 
సంతోషం గా ఉండటమే ముఖ్యం అనిపిస్తుంది....ఇప్పుడు''

చూసారా మనం కష్టాలలో ఉన్నాప్పుడు డబ్బు కంటే మనుషులు 
కావాలి.కాబట్టి మీరు ఒక్క మనిషిని దూరం చేసుకున్నా....
మీరు ఎంతో కోల్పోయినట్లే.........

ఇంకా పూర్ణాత్మ పుస్తకం చెపుతుంది(link ఇక్కడ)

''మీరు ఇతరులకు ఏమిస్తారో అది ఎన్నో రెట్లు పెరిగి 
మరలా మీ దగ్గరికి వస్తుంది.కాబట్టి అహాలు పక్కన 
పెట్టేసి అందరికి ప్రేమ,ఆనందం పంచండి ...అవి 
ఎన్నో రెట్లు పెరిగి మీ దగ్గరకు వస్తాయి''

''మిమ్మల్ని మీ బలహీనతలతో సహా ప్రేమించుకోవాలి .
అదే మీరు మీకు ఇచ్చుకోగల బహుమతి.వర్తమానం లో 
ఎరుకుతో ఉంది ధ్యానం తో మీలోని మంచి లక్షణాలు 
గమనిస్తూ ఉండండి.పూర్ణాత్మ తో ఎదిగినందు వలన 
మనం తృప్తితో సంతోషంగా ఎదగగలం.ప్రశాంతం గా 
ఉండగలం.డబ్బే ఆనందాన్ని ఎప్పటికి   కొనలేదు""

ఎవరినైనా ఆనందాన్ని ఎలా పొందాలి అని అడగండి....ఒక్కోరు 
ఓక్కోటి చెపుతారు.....అంతెందుకు మీకు ఒక సారి ఆనందం కలిగించింది 
ఇంకో సారి కలిగించక  పోవచ్చు...ఇప్పుడు రెండు పాటలు చూద్దాము...

''ఉరికే చిలుకా....ఒక కంటి గీతం జల పాతం అయితే మరో కన్ను 
నవ్వదమ్మా...'' ఈ పాట ఎన్ని సార్లో వినుంటాను....ఏదో తెలీని 
బాధ మనసుని కమ్మేస్తుంటుంది.....

ఇంకో పాటుంది....అసలు అమ్మాయి పెళ్లి ఆగిపోవటమే ఎంతో బాధాకరమైన 
విషయం.....ఇక ఆ పెళ్లి ఆ అమ్మాయి వలెనే ఆగిపోతే యెంత విషాదం....
కాని ఈ పాట చూడండి  విషాదం అంతా....మబ్బులాగా యెగిరి పోతుంది....

''వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా.....వీచే వీచే పిల్ల గాలుల్లారా.....
కళ్ళ లోనా పొంగుతున్నా బాధలు ఎన్నో మాకున్నాయి''

అసలు ఈ పాటలలో దాగుండేది విషాదం...కాని ఇవి వింటే నాకు 
ఆనందం....ఇదెలా సాధ్యం?నేను లెక్కల స్టూడెంట్ ని కదా....
ఏదో ఒక జవాబే కదా రావాలి ...మరి రెండు ఎలా వీలు అవుతాయి....
కాబట్టి ఈ ఆనందం ఏ లెక్కలకు అందనిది....మరి ఎందుకు కొన్ని 
ఆనందం కలిగిస్తాయి అంటే.....

ఓషో అంటారు''ఎప్పుడైతే నువ్వు నీ జీవితంలో ఇమిడి ఉంటావో 
ఎప్పుడైతే ఆ పొందిక సామరస్యంగా ఉంటుందో 
అప్పుడు నువ్వు ఏమి చేస్తున్నా నీకు ఆనందమే''

కాబట్టి నిజం గా నీకు ఆనందం ఎక్కడ కలుగుతుందంటే ...
అది నీలోనే నీ చేతుల్లోనే ఉంది.....అది నీ జీవితం లో చక్కగా 
ఇమడటం....ఎప్పుడూ మనం మన చేతలకి భవిషత్తులో 
తల దించుకొనే పరిస్తితి తెచ్చు కోకూడదు....పక్క వాళ్ళని 
కలుపుకు పోతేనే అందరికి సంతోషం......

10 comments:

హరే కృష్ణ said...

WoW! 100% true!
Really great
thanks for sharing

durgeswara said...

ఇంత చక్కని పోస్ట్ వ్రాయగలిగిన మీరు
శీర్షిక పెట్టేప్పుడు కొద్ది గా ఆలోచిస్తే బాగుండేది అది తప్పో ఒప్పో మీ అంతరాత్మనడగండి

జలతారు వెన్నెల said...

Loved your post! good one.

శశి కళ said...

అండి,జలతారు వెన్నెల గారు థాంక్యు.



@దుర్గేశ్వర రావు గారు ....మామూలుగా అది ఒక సామెత లాగా వాడటం అలవాటు అయిపొయింది...తప్పు ఉంటె మన్నించండి.

వెంకట రాజారావు . లక్కాకుల said...

స్పందనానంద హృదికె " ఆనంద తత్త్వ "
మలవడును సత్యము దెలిసి మెలగు నపుడు ,
తెలియు సత్య మహంకృతి తొలగినపుడు ,
ఙ్ఞానముననే తొలగు నహంకార మెపుడు.

durgeswara said...

అమ్మా !
ఇక్కడ ఒకరికొకరం మన్నించుకోవటం కాదమ్మా
మన ఆచారాలను మనమే ఎంతగా అవహేలన చేసుకుంటూన్నామో గమనించుకోవాలని మనవి అంతే.

జైభారత్ said...

శశి గారు మీరు భలే హుషారుగా చెప్తారండి ఏ విషయాన్ని ఐనా . అన్నం తిననని మారం చేసే పిల్లలకి అలా... అలా ... తిప్పుతూ కథలు చెప్పి తినిపించేసి నట్టే...ఉంటుందండి.

జీవన పయనం - అనికేత్ said...

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమంటే ఇదేనండీ..యువీ దీనికి అతీతుడేం కాదు..అలాగే ఆనందం అనేది ఎవరికి వారి రీతిలో వుంటుంది..అలా అని పరిస్థితులకన్నింటికీ సర్దుకుపోమ్మనే చివరి వాక్యాలతో ఇంక ఆనందమేముంటుంది..:-)

Anonymous said...

madam salahaa ivvandi,,,

శశి కళ said...

లోక్నాద్ గారు,అనికేత్ గారు,అంతర్ముకం గారు థాంక్యు