Monday, 7 May 2012

షష్టి పూర్తీ.....యెంత తృప్తి?

ఆటో కళ్యాణ మండపం ముందు దిగగానే ఎదురుగా 
జన సమూహం కనిపించింది.
ఈయన ఆటో కి డబ్బులు ఇచ్చి వస్తుంటే 
లోపలి వెళ్లి సమూహం లోకి తొంగి చూసాను.
పక్కన అప్పుడే ఆయుష్ హోమం పూర్తీ చేసినట్లున్నారు.
సమూహం మధ్యలో భార్య భర్త ఇద్దరు కూర్చొని ఉన్నారు.
మంగళ స్నానాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అప్పటికి రెండు రోజుల ముందు నుండి 108 కలిశాలతో పూజలు,హోమాలు చేసి ఉన్నారు.


వాళ్ళ కొడుకులు,కోడళ్ళు,బావమరుదులు,మనుమలు 
మనవరాళ్ళు ఒక్కొక్కరుగా పైన ఉంచిన జల్లెడలో ఉన్న పూలు నెమలీకలు మీదుగా కలిశాలలో ని నీరు పోసి వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేస్తూ ఉన్నారు.


చుట్టూ హడావడి....పిల్లల సందడి చెప్పలేము,తాత అవ్వ పెళ్లి జరుగుతుందని...
నవ్వులు,కేకలు,సందడి..పెద్ద వాళ్ళపై భక్తీ,ప్రేమ ......చాలా చక్కగా ఉంది వాతావరణం 

హమ్మయ్య సమయానికి వచ్చాము.అందరు జంటలుగా వాళ్ళ పై 
నీళ్ళు  పోసి కాళ్ళకు నమస్కారం చేసుకుంటున్నారు.
నేను ,మా వారు కూడా నీళ్ళు పోసి అభిషేకించి నమస్కరించుకున్నాము
(కాని ఒకటి అనిపించింది.ఎండాకాలం కాబట్టి సరిపోయింది.
లేకుంటే అన్ని చల్లటి నీళ్ళు ఆ వయసులో పోయించు 
కోవాలంటే కష్టమే)


తరువాత వెళ్లి కళ్యాణ మండపం లో కూర్చున్నాము.ఇంతకీ విశేషం ఏమిటంటే 
మా వారి పెదనాన్న కూతురి (అంటే నాకు వదిన )గారి షష్టి పూర్తి.
ఇలాంటి భాగ్యం కోసమైనా మనం అక్కడకు వెళ్లి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి.
ఎందుకంటె అందరికి డబ్బులు ఉంటాయి....కాని చేసే వాళ్ళు ఉండరు.
ఇంకా కొందరికి  షుగర్ బీపి లు ఉంటె  కూర్చునే ఓపిక ఉండదు.
ఇంకా విశేషం ఏమిటంటే షష్టి పూర్తి పెళ్లి కొడుకుకి జిలకర బెల్లం పెట్టటానికి 
జుట్టు ఉండటం.


పూజారి చాలా చక్కగా నవ్విస్తూ అన్నీ ఎందుకు చేస్తున్నారో వివరిస్తూ ఉన్నాడు.
(మేము నలుగురు తోడూ కోడల్లం మా షష్టి పూర్తికి ఆ స్వామినే పిలవాలి అని 
ఫిక్స్ అయిపోయ్యాము...అంత బాగా చేసారు)


మామూలుగా తల్లి తండ్రులుగా మారిన దంపతులకు మధురమైన 
ఒక తీపి గుర్తు ఉంటుంది......అదేమిటంటే పిల్లలు  వాళ్లకు కొంచం 
ఉహ తెలిసిన తరువాత అమ్మా నాన్న పెళ్లి ఫోటోలు చూసి 
నేను ఎందుకు లేను ఇక్కడ అని ఏడుస్తారు.


వీళ్ళు ఇంకా ముసి ముసి నవ్వులు నవ్వుకొని ...ఒక్కోరు ఒక్కో కారణం 
చెపుతారు.నువ్వు మమ్మి పొట్టలో ఉన్నావు,లేదా నువ్వు నిద్ర పోతున్నావు ఇలాగా 


కానీ వాళ్ళకి మన పెళ్లి చూడాలి అని ఉంటుంది.ఆ పూజారి చెప్పారు 
వయసులో చేసుకొనే పెళ్లి అమ్మా నాన్నల సంతోషం కోసం......
ఇప్పుడు చేసుకొనే పెళ్లి పిల్లల ఆనందం కోసం (మా నాన్న గారి షష్టి 
పూర్తి  కైతే మేము నలుగురు పిల్లలం,మాకు తొమ్మిది మంది వాళ్ళ 
సంతోషం అమ్మమ్మ,తాతయ్య అని చేసే సందడి చూసి మాకు చిన్న 
ఆనందం కాదు..)


ఇప్పుడు వీళ్ళకు ఒక అమ్మాయి,ఇద్దరు మొగ పిల్లలు....చిన్న పిల్లలు 
రెండు ఏళ్ళ వాళ్ళు ఒక పాపా ,బాబు ట్విన్స్.వాళ్ళు కూడా తాతయ్య,నానమ్మ పక్కనే 
కూర్చున్నారు ఎగురుతూ నవ్వుతూ...


పూజారి ఏమి చెప్పారంటే .......చిన్న వయసులో పెళ్ళిలో పెళ్లి కూతురు 
సిగ్గు పడుతుందంట.ఇప్పటి పెళ్ళిలో పెళ్లి కొడుకు సిగు పడుతాడు అని చెప్పారు .
నిజమే ......


ఎన్ని ఏళ్ళు గడిచాయి నీ సాహచర్యం లో 
తల వంచుకొని సిగ్గుపడుతూ మూడు ముళ్ళు వేయించుకున్న కాలం 
వేవిళ్ళతో మదన పడుతూ వేదన పడిన కాలం 
చిరు నవ్వుల సందళ్ళు,తప్పటడుగుల  ఇల్లు నింపిన కాలం 
అనారోగ్యపు వేళల్లో ధైరంగా ఎదుర్కున్న కాలం 
ఆర్దిక వత్తిడి లో   బుజం తట్టిన కాలం 
మనసు తో వెళ్లి తప్పులు చేస్తే మన్నించిన కాలం 
పిల్లల చదువలతో మదన పడిన కాలం 
అలసిపోయిన తనువును వడిలో అలరించిన కాలం 
పిల్లల పెళ్ళిళ్ళకు పెద్దగా నిలచి గౌరవం నిలబెట్టిన కాలం  
ఎదిగిన భర్తను అనారోగ్యపు వేళలో చిన్న పిల్లాడిగా చాకిన కాలం 


ఎన్ని వత్తిళ్ళు,ఎన్ని సవాళ్లు ......మనసుకు మొండి ధైర్యాన్ని 
ఇస్తూ......
దాంపత్యపు మధురిమ యెంత చెపితే తరుగుతుంది....
అది అనుభవించాలే కాని....


వేసిన అడుగులు తెలీకుండా ఆడవాళ్ళకు భాద్యతను,పెద్ద రికాన్ని 
ఇస్తే భర్తకు భార్యపై ఆధార పడే బలహీనతను కూడా ఇస్తాయేమో.....


ఆవిడ అక్కడ కూడా స్వామికి ఆయన అయ్యి చెయ్యలేరులే స్వామీ 
అని వెనుక వేసుకొస్తుంది.
ఆయన భార్యను గర్వంగా చూసుకుంటూ తాళి కట్టాడు.
చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ  వరకు చప్పట్లే మంగళ వాద్యాలుగా 
తృప్తి గా మోగించారు.


వాళ్ళ పెళ్ళికి వచ్చిన వాళ్ళు,వాళ్ళతో చదివిన వాళ్ళు ,చిన్న వాళ్ళు  
ఇంకా మా వారు అయితే మా అక్క ఇంకా అలాగే ఉంది ...పెళ్లి అప్పటి 
లాగే అని పొంగిపోయారు.యెంత మందికి దక్కుతుంది ఇంతటి 
ఆప్యాయత....భారతీయ గృహస్తు జీవితం లోని ఈ గొప్పదనం 


అందరికి వాళ్ళు ఆశీస్సులు ఇచ్చారు.పూజారి అయితే 
వాళ్ళ కోడళ్లను చాలా పొగిడారు.నిజమే ఈ వయసులో 
మీ కోసం నాలుగు లక్షలు ఖర్చు పెట్టాలా? అని అని వాళ్ళు అనుకోలేదు .


ఇంకా సొంత తల్లి తండ్రులకు చేసినట్లు అన్నీ దగ్గరుండి ప్రేమగా 
చేసి....పక్కనుండి తలంబ్రాలు పోయించారు.


ఇంత చక్కని పిల్లలను కలిగిన ఆ తల్లి తండ్రుల కళ్ళలో ఉబికిన 
ఆనంద తలంబ్రాలు వాళ్ళపై ఆశీస్సులుగా కురిసాయి అనటం లో 
సందేహమే లేదు  .



16 comments:

రాజ్ కుమార్ said...

నైస్.. ;)
మధ్య లో మీరు రాసిన కవిత చాలా బాగుంది.

anrd said...

చక్కటి పోస్ట్ . షష్టి పూర్తి విశేషాలను చక్కగా వ్రాసారండి...

జలతారు వెన్నెల said...

ఇలాంటి వేదుకలు సినిమాలోనే తప్ప, నిజ జీవితంలో కూడా పూర్వం చేసుకునేవారని అనుకునేదాన్ని. కాని ఇంకా ఇలాంటి వేదుకలు చేసుకుంటున్నారన్నమాట!Nice to Know!

Krishna said...

బావుందండి. చక్కగా రాసారు విషయాలన్ని. అక్కడ ఉన్న సందడంతా కూడా మీ టపాలో ఉంది. బైదివే, షష్టి పూర్తి అనగానే పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? దానికి దీనికి సంబంధమే లేదు కద? నాకెందుకో తెలుగు వాళ్ళ అలవాట్లు కొన్ని విపరీతంగా అగుపిస్తాయి.

హరే కృష్ణ said...

beautifully written :)

హరే కృష్ణ said...

ఎన్ని ఏళ్ళు గడిచాయి నీ సాహచర్యం లో
తల వంచుకొని సిగ్గుపడుతూ మూడు ముళ్ళు వేయించుకున్న కాలం
వేవిళ్ళతో మదన పడుతూ వేదన పడిన కాలం
చిరు నవ్వుల సందళ్ళు,తప్పటడుగుల ఇల్లు నింపిన కాలం
అనారోగ్యపు వేళల్లో ధైరంగా ఎదుర్కున్న కాలం
ఆర్దిక వత్తిడి లో బుజం తట్టిన కాలం
మనసు తో వెళ్లి తప్పులు చేస్తే మన్నించిన కాలం
పిల్లల చదువలతో మదన పడిన కాలం
అలసిపోయిన తనువును వడిలో అలరించిన కాలం
పిల్లల పెళ్ళిళ్ళకు పెద్దగా నిలచి గౌరవం నిలబెట్టిన కాలం
ఎదిగిన భర్తను అనారోగ్యపు వేళలో చిన్న పిల్లాడిగా చాకిన కాలం


ఎన్ని వత్తిళ్ళు,ఎన్ని సవాళ్లు ......మనసుకు మొండి ధైర్యాన్ని
ఇస్తూ......
దాంపత్యపు మధురిమ యెంత చెపితే తరుగుతుంది....
అది అనుభవించాలే కాని....


వేసిన అడుగులు తెలీకుండా ఆడవాళ్ళకు భాద్యతను,పెద్ద రికాన్ని
ఇస్తే భర్తకు భార్యపై ఆధార పడే బలహీనతను కూడా ఇస్తాయేమో.....


ఆవిడ అక్కడ కూడా స్వామికి ఆయన అయ్యి చెయ్యలేరులే స్వామీ
అని వెనుక వేసుకొస్తుంది.
ఆయన భార్యను గర్వంగా చూసుకుంటూ తాళి కట్టాడు.
చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు చప్పట్లే మంగళ వాద్యాలుగా
తృప్తి గా మోగించారు.



బాగా రాసారు

రాజ్యలక్ష్మి.N said...

షష్టిపూర్తి విశేషాలు,మీ కవిత బాగున్నాయండీ..

Geeta said...

కళ్ళకు కట్టినట్టు వర్ణించారు ..భార్య భర్తల అనుభందాన్ని చక్కగా పూస గుచ్చినట్టు చెప్పారు .మీకు ధన్యవాదములు .షష్టిపూర్తి జరుపుకోవాలనే మీ ఆలోచనని మనస్పూర్తిగా స్వీకరిస్తున్నాము .

శశి కళ said...

గీతు నువ్వే పెద్ద కూతురివి...నువ్వే చెయ్యాలి అమ్మాయి...థాంక్యు



రాజిగారు...మీరు అయితే ఇంకా చక్కగా వర్నించేవారు
ఏమో...థాంక్యు

వనజ తాతినేని/VanajaTatineni said...

నాకైతే ఈ పోస్ట్ చదువుతుంటే..శశి కళ సురేష్ ల షష్టి పూర్తి మహోత్సవమే కళ్ళ ముందు కదలాడింది.
యెంత చక్కగా వ్రాశారు. పెళ్లి రోజు ..దగ్గరకి వస్తుంటే..మదిలో మనోహరంగా మంగళ వాయిద్యాలు మ్రోగుతాయి కదా!ఆ సూచనలు కొన్నేళ్ళకు ముందే ఈ పోస్ట్ లో కనబడ్డాయి.. చెల్లి. :)
సూపర్.. సూపర్..సూపర్.

Unknown said...

అక్క ! పోస్ట్ ఎంత బావుందో మాటల్లో చెప్పలేను.
మీ పెళ్ళికి రాలేదు కదా నేను సస్టి పూర్తికి మాత్రం తప్పకుండా పిలవండి.
ఎక్కడ ఉన్న వచ్చేస్తాను.
దాంపత్యపు మధురిమ యెంత చెపితే తరుగుతుంది....
అది అనుభవించాలే కాని..
ఇది పూర్తిగా నిజ్జం.

బులుసు సుబ్రహ్మణ్యం said...

బాగున్నాయి షష్టిపూర్తి విశేషాలు. మధ్యలో మీ వ్యాఖ్యానం బాగుంది. వెరి నైస్.

శ్రీ said...

కృష్ణ వంశీ సినిమా లో సన్నివేశం చూసినట్లునదండీ....
చాలా బాగుంది....@శ్రీ

Anonymous said...

మీరు రాసింది నాకు అర్దమైంది..
మీ టపాలో ఓ లోకోద్ధత్తత ఉంది..
ఓ నిజం ఉంది... ఓ వాస్తవం కూడా..
ఓ నిజాన్ని ఇలా కూడా చెప్పొచ్చని,,
ఇంకా.. మన ఆచారాలు,వ్యవహారాలు,
మీరు ఏ ఉద్ధేశ్యంతో వ్రాసారో..
ఏమో ....
కాని, మీరు చెప్పిన వాస్తవం బావుంది..
అందరికి డబ్బులు ఉంటాయి.. అందరూ సంపాదిస్తారు..
కానీ, కొందరే వాటికి ఓ సార్దకత ఉండేలా చేస్తారు..


***
****
**


జీవితంలో కొన్ని తప్పవు
కొన్ని తప్పించుకోలేం..
**
**
ఇక్కడ ఖర్చు కాదు ప్రదానం...
అందరి సంతొషం.... అవును.. మీ టపాలో నాకు.. ప్రస్పుటించింది..... అదే...

శశి కళ said...

vanaja gaaru siggupadatam ante yemi bomma pettali ardham kaledu...so no comment...thanku


శైలు,బులుసు గారు,శ్రీ గారు,బుద్ధా జీవి గారు థాంక్యు

Krishna said...

చాల బాగా రాసారు అక్క, పరమాద్భుతం వారి జన్మ సార్ధకం. ఎంతమందికి అంత అదృష్టం ఉంటుంది చెప్పండి