ఆ రోజు ఒక దివ్యమైన రోజు.ఎందుకో మీకే ముందు ముందు తెలుస్తుంది.
తొందర పడితే ఎలాగందీ?
మొన్న శుక్రవారం ఈయన ఒక మంచి కళ లో .....శశి ఏమి కావాలి
నీ పుట్టినరోజుకి?అని అడిగారు.
కనిపించింది.
(హమ్మయ్య దొరికారు అనుకొన్నా మనసులో)
గమ్ముగా చూసాను.పాపం తుఫాన్ ముందటి ప్రశాంతత అని
ఊహించక....మేక పిల్ల లాగ అమాయకంగా ,నేనేదో మొహమాట పడుతున్నాను
అనుకొని .....పర్లేదు చెప్పు అని భరోసా ఇచ్చారు.
(అసలు భార్య కోరిక తీరిస్తే భర్తకు చాల గర్వంగా ఉంటుంది అనుకుంటాను)
నేను మెల్లిగా నవ్వుతూ....చల్లగా చెప్పేసాను.మరు నిముషం .....
కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ ...కేక.....ఎలా వీలవుతుంది?రెండో రోజు టికట్స్ ఎలా
దొరుకుతాయి అందులో నెల్లూరులో .......అనేసారు.
కావాలంటే ఇంకేదైనా కోరుకో....అదియున్ దక్క ....అనేసారు.
అలాగా మనసు మార్చుకుంటే శశి ఎలా అవుతుంది.నాకు
కావాల్సింది ఇదే అని మొండికి పడిపోయ్యాను.
"అయినా నీకో తిక్క ఉంది ....కాని దానికి ఒక లెక్కుంది
మరి ఈ పవన్ పిచ్చి ఎప్పటి నుండి "అని దీనంగా అడిగారు.
ప్లస్ లో పోస్ట్లు వేసి...వేసి...ఈ పిచ్చి రప్పించిన మహా మహులు
గూర్చి చెప్పెద్డాము అని నోటి దాక వచ్చింది....
కాని తరువాత ప్లస్ మూసివేస్తారు అనే ....లైట్ వెలిగి చెప్పలేదు.
గూర్చి చెప్పెద్డాము అని నోటి దాక వచ్చింది....
కాని తరువాత ప్లస్ మూసివేస్తారు అనే ....లైట్ వెలిగి చెప్పలేదు.
''ఊహు ఈ పిచ్చి నా సొంతమే కాని ఎవరు ఇవ్వలేదు ''
అని ఖచ్చితంగా చెప్పేసాను...
సరే ఇంకేమి చేస్తారు.నెల్లూరు లో వాళ్ళ ఒక్కగాని ఒక్క చెల్లికి విషయం
చాలా సీరిఎస్ అని చెప్పేసారు.పుట్టింటి వాళ్ళ పని చెయ్యటమే ప్రధమ
కర్తవ్యమ్ కల ఆడపిల్ల కాబట్టి....వాళ్ళ భర్తకు ఆర్డర్ వేసేసింది.
వాళ్లకు అక్కడ రైస్ మిల్.ఆయన పలుకు బడి అంతా ఉపయోగించి
నాలుగు టి కట్స్ ఫస్ట్ షో కి,నాలుగు సెకండ్ షో కి సంపాదించారు.
సరే ఏమి చేద్దాము.పిల్లలు నలుగురిని ఫస్ట్ షో కి పంపించి ,మేము
సెకండ్ షో కి వెళ్ళేటట్లు నిర్ణయం చేసుకున్నాము .
ఇక్కడ ఆడబిడ్డ గూర్చి చెప్పాలి.యెంత అత్తగారింట్లో ఉన్న వాళ్లకి
పుట్టింటి మీద ప్రేమ ఉంటుంది.నా పుట్టిన రోజని ,నేను ఎక్కువగా రాను
అని చిన్న హడావడి చెయ్యలేదు.సేమ్య పులిహోర,గ్రాస్స్ హల్వా,వడలు,
కేక్స్,ఐస్ క్రీం ఇలాగా హడావడే హడావడి.
ఇక సెకండ్ షో దాక ఖాళీయే కాబట్టి వాళ్ళ ఆయన ,ఆ అమ్మాయి దగ్గర ఉండి
కార్ లో ఇస్కాన్ టెంపుల్ కి తీసుకు వెళ్లారు.పొయ్యే సరికి హారతి.
ఇక్కడ కృష్ణుడు పూరి జగన్నాదుడు లాగా ఉంటాడు.ఇక నన్ను కృష్ణుని
దగ్గర నుండి లాక్కొని రావటం చాల కష్టం.
ఎలాగో కష్టపడి అక్కడ నుండి 15 కి.మీ దూరం లో గల ''వెంకయ్య స్వామీ''
గుడికి వెళ్ళాము.ఈయన సాయి బాబా లాగా అవదూత.శనివారం చాలా
రష్ గా ఉంది.అయిన దర్శనం చేసుకొని హోటల్ కి వెళ్లి సినిమాకు వెళ్ళాము.
ఇప్పుడు కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్...కేక
అదిగో పేర్లు పడుతుంటేనే కేకలు,ఈలలు...చాలా రోజులు తరువాత భలే
హుషారు వచ్చేసింది.అలాగా కేకలు ఉంటె నేను ఎలా ఉన్నా మా వారు
ఏమి అనరు.గుంపులో గోవిందా.(అయినా సినిమాకి వెళ్ళేది ఎందుకు
ఎంజాయ్ చెయ్యటానికి)....సిడ్ని లో అలాగే అంట,ఢిల్లీ లో అలాగే అంట.
ముందు గా దేవిశ్రీ కి....ఒక కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్......హు హా...తరువాత
ఒక ఊపు అందించాడు.
ఇక కధ ఏమి పెద్దగ లేక పోయినా ,స్క్రీన్ ప్లే తో నవ్వులు పండించి
దర్శకులు ప్రేక్షకులను కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ అనిపించారు.
జనాలు బండ్ల గణేశా .....బండ్ల నిండా డబ్బులు తీసుకొని పో
అని ఉద్దారంగా తమ ప్రేమనంత ఇచ్చేసారు.
పాపం పవన్ చిక్కిపోయ్యి ఉన్నాడు.శ్రుతి చిక్కి పోయి ఉంది.
పవన్ తనదైన స్టైల్ లో నవ్వులే నవ్వులు.
తన పోలిస్ స్టేషన్ పేరు మార్చటం,ఆలి ని అరె ఓ సాంబ అని పిలవటం...
అసలు జనాలు సీట్లలో కూర్చోలేక ఎగురుతున్నారు నవ్వులతో.
అందరు పనులు,భాద్యతలు,కెరీర్ ,టెన్షన్ లు అనే షెల్ల్స్ బద్దలు
కొట్టేసుకొని సీతా కొక చిలుకల్లాగా నవ్వుతుంటే నాకు భలే
సంతోషం ఎసింది.ఇంకా బ్రహ్మా నందం అయితే తన పని తను
చక్కగా చేసాడు.మరీ పవన్ కట్ అవుట్ తెచ్చే సీన్ అయితే కేకో...
మరీ ముఖ్యంగా అంత్యాక్షరి సీన్,కబడ్డీ సీన్ భలే ఎంజాయ్ చేసాము.
అయితే అర్ధం కాని విషయం ఏమిటంటే హీరో బుల్లెట్స్ ని టపా ,టపా
కాల్చేస్తుంటాడు.నాకు తెలిసి ఒక్క బుల్లెట్ కాల్చిన వాళ్ళు లెక్క చూపాల్సి
ఉంటుంది.
అయినా ఇలా తప్పులు చూస్తె నన్ను తెలుగు ప్రేక్షకురాలు కాదు
అనుకునే అవకాశం ఉంది.తెలుగు సినిమాలో ఏదైనా పాజిబుల్...
కేకో...కేక అంతే.
ముఖ్యంగా తెలుగు సినిమాని అలా తెల్ల పంచలు కటుకొని కొడవళ్ళు
తీసుకొని,సుమో లు వేసుకొని.....టపా...టపా...పొడిచేసే సీన్ లు నుండి
బయటకు లాక్కొచ్చి పడేసి....కొంచం ఊపిరి తీసుకోనిచ్చారు.
ఇదేదో దబాంగ్ సిఇమా రీమేక్ అంట.నాకేమి పోల్చుకొనే ప్రాబ్లెం
లేదు.ఎందుకంటె నేను హిందీ సినిమాలు చూడను.
అన్నీ బాగున్నాయి శశి కధ ఏది అంటే.....
భలే వాళ్ళే రాక రాక తెలుగు సినిమాల్లో సకుటుంబంగా
నవ్వులే నవ్వులతో చూసే సినిమా వచ్చింది.
పొయ్యి దియేటర్ లో చూడండి.ఎంజాయ్ చెయ్యండి.
సరే కొస మెరుపు ఏమిటంటే ....పక్క రోజు ఆదివారం నెల్లూర్ లో
ఈనాడు వాళ్ళు ''అమేజింగ్ అమ్మ ''పోటీలు నిర్వహిస్తే
దానిలో పాల్గొని ఆరు రౌండ్లు కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వు కేక
అనిపించి ఫస్ట్ ప్రైజ్ తెచ్చేసుకున్నాను.
ఈ కింద పిక్స్ చూడండి
నాకు పిక్స్ పంపించి సహాయం చేసిన శేఖర్ గారికి థాంక్స్ .
(శేఖర్ గారి బ్లాగ్ లింక్ ..... http://sekhargunturu.blogspot.in/)
ఇంకా నా పుట్టిన రోజుని తమ ఆత్మీయురాలిగా నన్ను భావించి
నేను బాగుండాలని ప్లస్ లో పోస్ట్లు వేసిన వాళ్ళు,విషస్ పెట్టిన వాళ్ళు
ఫోన్స్ చేసిన వాళ్ళు,మెయిల్స్ పెట్టిన వాళ్ళు.....అందరికి బోల్డన్ని
థాంక్స్.ఇంతకూ ముందు ఎవరికి ఎవరమో....ఇప్పుడు తెలీకుండానే
ఆత్మీయులం అయిపోయ్యము.అందరికి....ఒక కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్...కేక.
ఇంకా నా పుట్టిన రోజుని తమ ఆత్మీయురాలిగా నన్ను భావించి
నేను బాగుండాలని ప్లస్ లో పోస్ట్లు వేసిన వాళ్ళు,విషస్ పెట్టిన వాళ్ళు
ఫోన్స్ చేసిన వాళ్ళు,మెయిల్స్ పెట్టిన వాళ్ళు.....అందరికి బోల్డన్ని
థాంక్స్.ఇంతకూ ముందు ఎవరికి ఎవరమో....ఇప్పుడు తెలీకుండానే
ఆత్మీయులం అయిపోయ్యము.అందరికి....ఒక కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్...కేక.
24 comments:
@శశి గారు
చేతులో టికెటేట్టుకొని మొహం లో నవెట్టుకొని మీరలా టపాలేస్తే
కేవ్వ్వ్ కేక నా సామిరంగా కేవ్వ్వ్వ్ కేకా
ఫస్ట్ ప్రైజ్ కొట్టేసి మంచి పేరు తెచ్చుకొని పేపర్ లో మీ బొమ్మేస్తే
కేవ్వ్వ్ కేక నా సామిరంగా కేవ్వ్వ్వ్ కేకా
కెవ్వు మంటూ పుట్టేసి కేకులంత తినేసి నవ్వులతో నిను చూస్తుంటే
కేవ్వ్వ్ కేక నా సామిరంగా కేవ్వ్వ్వ్ కేకా !!!! :)
amazing Sasi kala..
congratulations &
once again happy b'day to you ;)
శశికళ గారూ కొంచెం ఆలశ్యంగా...పుట్టినరోజు శుభాకాంక్షలు...మొదటి బహుమతి తెచ్చుకున్నందుకు అభిననదనలు. ఈ టపాలో మీ ఆనందం కెవ్వు కేక...
శశి కళ గారు, ప్రధమ బహుమతి పొందిన మీకు అభినందనలు.
గ్రాస్స్ హల్వా?????
"అసలు భార్య కోరిక తీరిస్తే భర్తకు చాల గర్వంగా ఉంటుంది అనుకుంటాను"
కికికి...కొసరు భార్య కూడా ఉంటుందాండీ? :)))
(నేను జంప్)
అసలు అమేజింగ్ అమ్మ ఏంటండీ? అమ్మంటేనే అమేజింగ్. అయినా మా శశిమిస్ అమేజింగ్ అని వాడెవడో రామోజీరావు ఇప్పుడు చెప్పడం ఏంటి? మేమంతా ఎప్పట్నుంచో చెప్తున్నాం కదా. కుసింత పార్టీ ఎప్పుడో చెప్తే రెండు రోజుల ముందునుంచీ భోజనం మానేసి రెడీగా ఉంటాం.
శశి మిస్ గారికి కాస్త ఆలస్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. అమేజింగ్ అమ్మ కి అభినందనలు.
మొత్తానికి మీరు కెవ్వు కేకండీ టీచరమ్మ గారూ.. :)))
" రాక రాక తెలుగు సినిమాల్లో సకుటుంబంగా
నవ్వులే నవ్వులతో చూసే సినిమా వచ్చింది"
మీరు చెప్పింది నిజమేనండీ సినిమా బాగుంది..
మాకు కూడా నచ్చింది..
మీ పుట్టినరోజు సందర్భంగా సినిమా చూసినందుకు,
మీరు "అమేజింగ్ అమ్మగా" బహుమతి అందుకున్నందుకు,
మీరింత సంతోషంగా వున్నందుకు అభినందనలండీ..
Congrats,,Shashi gaaru.
ee kevvulu,keka lu naa valla kaadu. :(
ప్రపంచంలో ఏమూలన్నా సిన్నిమా చూడడం వేరు, మన నెల్లూరులో సినిమా చూడడం వేరు! అమేజింగ్ అమ్మలో బహుమతి కొట్టేసి మీరు కెవ్వు కేక అనిపించారు.
ముందుగా మీకు ఆలస్యంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
మీరు అమేజింగ్ అమ్మ అయినందుకు మరో శుభాకాంక్షలు!
ఇన్ని శుభాకాంక్షలు చెప్పినందుకు స్వీట్లు తినిపిస్తానంటేనే తీసుకోండి ;)
@sasi: kevvvv keka :) mee bday aa ?? naku teleedu sasi. belated bday wishes :) photo bagundi..... congratsssssssssss!!
కెవ్వ్ కెవ్వ్ కేక
అసలు రచ్చ రచ్చ అంటే ఇదే
మైక్ తీసుకొని అమేజింగ్ అమ్మ స్పీచ్ కేకో కేక
ఆభినందనలు మరియు పుట్టిన రోజు శుభాకాంక్షలు :)
శశి అక్క ! మీ పుట్టిన రోజు ఏం చేయల అని తెగ ఆలోచించాను. నాకు అవకాసం లేకపోయింది గాని ఆ రోజు నేను మీకోసం ఏం చేయలనుకున్ననో తెలుసా ?
ఒక పెద్ద థియేటర్లో మీ కోసం ఒక స్పెషల్ షో...మీరు , మీకు ఇష్టం అయిన వాళ్ల కోసమే...మీరు సినిమా చూస్తుంటే వీడియొ తీయిన్చేయాలని అనిపించింది.
నిజ్జంగా సినిమాలు మీరు ఎంజాయ్ చేసే విధానం నాకు బాగా నచ్చుతుంది.
నెల్లూరు వస్తే నన్ను ఒక సినిమాకి తీసుకుని వెళ్ళాల్సిందే...
అమేజింగ్ అమ్మ గారికి అభినందనలు.
మీరు కెవ్వూ కేకా నూ.
Sasi garu....
Nice and congrats :))
You always rock..
కళ్యాణ్ కేవ్వ్వ్వ్వ్వ్వ్ కేక...నువిలాగే కామెంట్స్ వ్రాస్తే కెవ్వు కేక..))
రాజ్,జ్యోతిగారు,జలతారువెన్నెల గారు థాంక్యు.
రెహ్మాన్ గారు గ్రాస్ హల్వా అంటే ...గడ్డితో చెయ్యరు
బాబోయ్ మీరు అలా అనుకుంటే ఎలా?చైనీస్ గ్రాస్
అని సేమ్య లాగా ఉంటుంది అమ్ముతారు.దానిని చిన్న ముక్కలు చేసి హల్వా చేస్తారు.థాంక్యు
శంకర్ గారు అసలు కొసలు ఏమిటి...ఉండండి స్వాతికి చెపుతాను.నిజమే ఆ తాత ఏమిటి మనకు ఇచ్చేది.అందరం అమేజింగ్ అమ్మలమే
శంకర్ గారు అసలు కొసలు ఏమిటి...ఉండండి స్వాతికి చెపుతాను.నిజమే ఆ తాత ఏమిటి మనకు ఇచ్చేది.అందరం అమేజింగ్ అమ్మలమే
మధుర,రాజి,వనజ గారు,శ్రీ ,రసజ్న,ఇందు అందరికి థాంక్యు లు
అండి,బులుసు గారు,శేఖర్ థాంక్యు లు
శైలు ఒక షో మొత్తం నాకేనా...నీలాంటి చెల్లెళ్ళు ఉండ బట్టే భూమి మీద వానలు పడుతున్నాయి...థాంక్యు చెల్లెమ్మ
sasi... gaaru... ika neane unna..
ee chinnavaadi SUBHAKANKSHALU mariyoo abhinandhanalu....
meeru... allways keaka....
nenu tirupati vella... sasi gaaru..
anduke choosukoledu...
chaala nacchindi............
Post a Comment