Monday 28 May 2012

జీవితం జీవించ గలగాలి తృప్తిగా .....ఎలా?

జీవితానికి తృప్తి 
తన కోసమే కాక 
పరుల కోసం 
కూడా జీవించి నపుడే....


ఈ రోజు ఎం.టి.ఆర్ జయంతి.
ముందు ఆయనను తలుచుకుంటాను.






''అసతోమా సద్గమయా''


సత్యము వైపే నడిపించు.
ఇది మన మనసుల్లో ఎప్పుడూ మెదిలే వాక్యం.


ఇప్పుడు అందరి మనస్సులో స్తానం వహించింది 


''సత్యమేవజయతే''


దీని గూర్చి నేను ప్లస్ లో చూసినపుడు ఇది హిందీ 
ప్రోగ్రామ్ కదా నా కెందుకులే అనుకున్నాను.


కాని తెలుగులో ఈ టీవీ లో ఆదివారం 
పదకుండు గంటలకు వస్తుందని తెలుసుకొని చూసాను.


అరె ఇంత వరకు ఎందుకు ఈ ప్రోగ్రాం చూడలేదా అని 
బాధ పడ్డాను.


దీనిని అమీర్ ఖాన్ నిర్వహిస్తున్నారు.


దీని ఉపోద్గాతం లోనే అమీర్ ఖాన్ ''మనం చాలా 
తప్పులు సమాజం లో చూస్తునాము.కాని వాటిని 
ఖండించలేక సర్దుకు పోతున్నాము.ఇవి అందరి 
దృష్టికి తీసుకు రావాలనే చిన్న ప్రయత్నమే ఇది''అన్నారు .


ఒక్కో వారం ఒక్కో సమస్య బుల్లి తేర పైకి తీసుకొని వస్తున్నారు.
వర కట్నం,బ్రూన హత్యలు ఇలాగా.ఈ ఆదివారం 
జీవితం విలుయినది అది పేద వారి దైనా ,గొప్ప వారి దైనా 
అనే అంశం లో వైద్యం గూర్చి చూపించారు.


డాక్టర్స్ అంటే మనం దేవుళ్ళు లాగా చూస్తాము.
కాని అది కూడా ఒక వ్యాపారంగా ఎలా మారి పోయిందో చూపించారు.


ఇంకా రెండో ఒపీనియన్ తీసుకోకుండా వైద్యం చెయ్యించ వద్దు.అని 
బాదితుల ను కూడా చూపించారు.కొన్ని కధలు మన ముందు 
ఉంచారు.


ముఖ్యంగా ఒక ఊరిలో ఆడవాళ్ళు అందరికి హిస్తోరేక్టమి 
ఆపెరేషన్స్ చేసారు అని చూసినపుడు భలే బాధ అనిపించింది.
అసలు ప్రక్రుతి ఆడవాళ్ళు తమ కార్యక్రామాలు చేసుకునేదానికి 
వీలుగా హార్మోన్స్ రావాటానికే వాళ్ళ  జీవితం లో ఒక క్రమం 
ఏర్పరిచింది.అది కోల్పోవటం అంటే వాళ్ళ జీవితం లో 
ఒక ముఖ్య భాగాన్ని కోల్పోవటమే.అది తప్పని సరి అయితే సరే.
కాని ఉత్తినే అలాగా...అంత  మందికి తీసేస్తారా?


''A MOTHER IS BORN .....WHEN THE BABY IS BORN''


అవును....అమ్మ పుడుతుంది....
తన తనువు లోనే ఒక చిన్నారి మొగ్గ ఊపిరి పోసుకున్నప్పుడు 


అవును అమ్మ పుడుతుంది 
చిన్నగా ఒక ప్రాణం తనలోపల లీలగా చక్కిలి గింతలు పెట్టినపుడు 


అవును అమ్మ పుడుతుంది 
చిన్నారి పాదం పొట్టలో మెత్తగా తన్నినపుడు 


అవును అమ్మ పుడుతుంది 
లోపల చిన్నారిని మనసులోనే హత్తుకొని మురిసినపుడు 


అవును అమ్మ పుడుతుంది 
ప్రాణాలు  పోయే కష్టాన్ని పంటి బిగువున దాచినపుడు 


అవును అమ్మ పుడుతుంది 
కష్తపు తీరం దాటి క్యార్ మనే కేక విన్నప్పుడు 


అవును అమ్మ పుడుతుంది 
చిన్నారి యెర్రని పెదాలు అమ్మ తనానికి వెతికినపుడు 


అవును అమ్మ పుడుతుంది 
రక్తాన్ని అమృతంగా మార్చి చిన్ని పొట్టకు శ్రీ రామ రక్షా అయినపుడు ...


యెంత చక్కనిది అమ్మతనం.....తొలగించే హక్కు యెంత రాక్షసతనం 


ఎలాగా ఊరులో అందరికి ఆపరేషన్స్ చేస్తారు....చాలా బాధ వేసింది.


ఇంకా మాత్రలు రేట్స్ విన్నప్పుడు ,పేదలకు వైద్యం యెంత 
భారం అయిందో తెలిసినపుడు,ముఖ్యంగా ఒక రూపాయ పావలా 
చేసే మందు నాలుగు వందలు అని చెప్పితే అది కొనలేక 
ఆ అమ్మ రాత్రంతా తన బిడ్డ నరకాన్ని అనుబవిస్తూ చనిపోయిన 
సంగతి చెప్పేటపుడు ......కళ్ళలో తిరిగే నీటి సుడులు ఆపుకోలేక 
పోయాను.


ముఖ్యంగా ఇదంతా చుట్టూ కాబోయే డాక్టర్స్ ముందు చెయ్యటం 
చాలా బాగుంది.కలాం గారు ఎప్పుడూ అందుకే యూత్ కి 
ప్రాధాన్యత ఇవ్వాలంటారు.


కొన్ని దగ్గర్ల అమీర్ ఖాన్ గారు కొంచం అవతల వారిని 
మాట్లాడ నీక పోయినా .....అంత సీరియస్ కార్యక్రమం 
చక్కగా నవ్విస్తూ ...విషయం హృదయం లోకి దూసుకొ 
పోయ్యేలా నిర్వహించారు.


తప్పకుండా అందరు చూసి కొంతైనా తమ హృదయాలను 
తడుము కోవాల్సిన కార్యక్రమం.


(ఈ కార్యక్రమం లింక్ క్రింద ఉంది)


http://www.youtube.com/watch?v=6aoNqDICsak&feature=player_embedded#

4 comments:

Sri Valli said...

Chala bavundandi me post..amma poem chala bavundandi :)

శశి కళ said...

థాంక్యు వల్లి గారు

హరే కృష్ణ said...

విషయం హృదయం లోకి దూసుకొ
పోయ్యేలా నిర్వహించారు.

yes kudos to Aamir :)
and good post :)

శశి కళ said...

థాంక్యు అండి