Tuesday 13 November 2012

మీకు అంటే చదువుకున్న అమ్మ ఉంది .....వాళ్లకి ?

ఆహా దసరా  కళకళలాడుతుంది.ఇల్లంతా సండే సందడి.
''అబ్బో మాకైతే ఏమి చేసిపెట్టవు .....కొడుకుకు మాత్రం అన్నీ 
చేసిపెడతావు''ఇంట్లో విసుర్లు ....పాప మాత్రం నవ్వుకుంటూ 
ఉంటుంది.ఇంతా చేసి వాడు మాత్రం ఒక రోజు పులిహోర,
ఒక రోజు టమాటో రైస్.ఒక రోజు పాలక్ రైస్ చేస్తే (నా కొత్త 
ప్రయోగం,పిల్లలు ఏది తినటం లేదు న్యుట్రీషియన్ గా 
లేదు అనిపిస్తే ఒక కొత్త రకం నేనే సృష్టించేస్తాను)
వాడు అది చూసి అంటాడు ''ఇదొకటి కనుక్కుందమ్మా 
మా ప్రాణానికి ...ఎప్పుడు చూసినా ఇదే''
నేను మనసులో అనుకున్నాను.''ఉండరా నీ సంగతి చెప్తాను.
డిసంబర్ లో నీ పుట్టిన రోజుకి వస్తావు కదా ...అప్పుడు చేస్తాను''
ఏమిటంటారా?''బెండకాయ ఫ్రైడ్ రైస్''....యాక్ అంటారా?
వాడికి చెప్పవాకండి ఇప్పుడే.

సరే వాడికి ,మీకు మన అందరికి చదువుకున్న అమ్మలు ఉన్నారు 
కాబట్టి మీకు ఏ ఏ విటమిన్స్ కావాలో చూసుకుని తినిపిస్తారు.

మరి పాపం అమ్మలకు జ్ఞానం లేక ,తినటానికి డబ్బులు లేక 
వాళ్ళ పరిస్తితి ఏమిటి?
పాపం చూడండి క్రింది ఫోటో ........
వాళ్లకు రక్తహీనతతో కాళ్ళు చేతులు పుల్లల్లగా అయిపోయి 
పొట్ట ముందుకు ఉబ్బి ఇంత మంది ఉన్నాము చదువుకున్న వాళ్ళం 
మన చేతిలోది కొంచెం వాళ్లకు పెట్టక పొతే పోయే......
వాళ్లకు ఏదో ఒకటి చేసే వాళ్ళను ఎంకరేజ్ చెయ్యడం 
ముఖ్యంగా వాళ్ళను ఆరోగ్యం పై చైతన్యం తేవడం 
ఏదో ఒకటి చేస్తే బాగుండును.



నేను గోదావరి పై లాంచి లో వెళ్ళినపుడు ''పేరంటాల పల్లి''అనే 
గ్రామం చూసాను .అక్కడ ''బాలానందస్వామీ''అనే యోగి 
ఆశ్రమం చూసాను.అక్కడ చల్లని గాలి,చల్లటి సెలయేరు 
ప్రశాంత వాతావరణం ,అమాయకంగా నవుతూ వెదురుబొమ్మలు 
చేసి అమ్ముతున్న గిరిజనులు......నాకు భలే నచ్చాయి.
(ఇటీవల ఆంధ్రప్రభ లో నా జీవవైవిద్యం పై వచ్చిన ఆర్టికల్ 
పైనే ఈ పేరంటాలపల్లి ఆర్టికల్  నాకు కాకతాళీయం గా అయినా 
ఆ యాత్రను గుర్తు చేసింది)
తరువాత ఆ గిరిజనులు ఏమి తింటారో తెలుసుకున్న తరువాత 
వారి జీవితాలు పెద్దల కింద ఎలా నలుగుతాయో తెలుసుకున్నాక....
అంటే చెట్టు బెరడు తీసుకొని కాచుకొని తాగుతారంట....నా మనసు 
అదోలాగా అయిపొయింది.మరి ఇప్పుడు అన్నీచేస్తూ బాగానే 
కనిపిస్తున్నారు అని అడిగాను.వేరే సంస్తలు ఇలా తయారు 
చేయడం ట్రైనింగ్ ఇచ్చాయి అని ఇప్పుడు బాగున్నాము అని చెప్పారు.

కాని నేను అక్కడ బాలానంద స్వామీ పుస్తకం కొనుక్కొని వచ్చి 
చదివితే తెలిసింది ఆయన యెంత గొప్ప తపస్సు చేసాడో,
అంతే కాక ....యోగిని అని తపస్సు చేసుకుంటూ కూర్చోకుండా 
వాళ్ళ కోసం వాళ్ళలో ఒకడిగా మెలిగి,వేలం పాటలు పాడించి 
పెద్దలను ఎదిరించి ,టీకాలు వేయించి ....నిజం యోగులు 
లోక శ్రేయస్సుకే పాటుపడుతారు.మరి ఆయన గూర్చి 
యెంత మందికి తెలుసుంటుందో నాకు అయితే కొంచెం 
అల్లూరి గుర్తుకువచ్చారు ఆ పుస్తకం చదువుతుంటే.

అక్కడే ఉండి  సేవ చేయాలంటే ఎవరికైనా కష్టమే.
కాని వాళ్లకు తెలివి ఉంది మనం అవగాహన కలిగించగలిగితే.
''పౌష్టిక ఆహారం''అని చెపితే వాళ్లకు డబ్బులు ఉండొద్దా?
చిన్నప్పుడు మాకు పాలపిండి అవీ స్కూల్స్ లో 
పెట్టేవాళ్ళు.అలాటివి ఎవరైనా వంటలుగా కనుక్కొని 
అప్పుడప్పుడు సరపరా చేసినా బాగుంటుంది.ఇంకా 
అక్కడ కొంచెం తెలివి గల వాళ్ళని ఎన్నుకొని వాళ్లకి 
ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ''ఆరోగ్యం''''నీరు''
''ఆహారం''ఉన్న వనరులతో ఎలా జీవించవచ్చో తెలియచేస్తే 
బాగుండును.ఇవన్నీ ఎవరు చేస్తారండి అంటే...అలాగ 
అనుకోవద్దు ,కొన్ని సంస్తలు ఉన్నాయి కనీసం వాటికి 
సహాయం అయినా చేయండి.

     


9 comments:

మాలా కుమార్ said...

పౌష్టికాహారం గురించి బాగా చెప్పారండి . పిల్లలు అన్నీ తినరనే నేను కూడా ఇలా రకరకాల ఆకూరలతో , కూరగాయలతో రైస్ , చపాతీలు చేసి పెడుతూవుంటాను :)

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఈ దీపావళి వారి జీవితాల్లో వెలుగు నింపుతుందని ఆశిద్దాం.

మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

Murthy K v v s said...

శశికళ గారు మీ బ్లాగు బాగుంది.బాలానంద స్వామి వారి పుస్తకాలు నేను చదివాను.కలి యుగం లో కూడా అలాంటి నిజమైన మహా యోగులు వుండడం ఆంధ్ర దేశం చేసుకున్న పుణ్యం.మరెప్పుడైనా పేరంటాలపల్లి వెళ్ళేటప్పుడు మా భద్రాచలానికి స్వాగతం..!

తెలుగు వారి బ్లాగులు said...

హలో అండీ !!

''తెలుగు వారి బ్లాగులు'' తరుఫున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!

వెలుగు జిలుగుల దీపావళి నాడు ఆ లక్ష్మీ మాత కటాక్షం
ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తూ ...
ఒక చిన్న విన్నపము ....!!

రాబోయే నెల డిసెంబర్ 2 వ ఆది వారము (తెలుగు బ్లాగుల దినోత్సవం) లోపల ఒక వెయ్యి తెలుగు బ్లాగులను ఒకదరికి చేర్చాలని సంకల్పించటమైనది

మీరు అనుమతించి నట్లైతే మీ బ్లాగును కూడా తెలుగు వారి బ్లాగుల సముదాయం లో జతపరిచేదము.
మీ అంగీకారము తెలుపగలరు

http://teluguvariblogs.blogspot.in/

శశి కళ said...

అవును మాలాకుమార్ గారు అందరు చదువుకున్న తల్లులు అలాగే ఆలోచిస్తారు.వాళ్లకు ఏదైనా పొడి లాగా చేస్తే బాగుండును .


బులుసు గారు థాంక్యు

శశి కళ said...

మూర్తి గారు నిజమా...ఇంకా కొన్ని విశేషాలు ఆ స్వామీ గూర్చి కామెంట్ లో పెట్టరా చదువుతాను.
మీ స్వాగతానినికి కృతఙ్ఞతలు

శశి కళ said...

సుభ ...నీకు కూడా థాంక్యు :)

శశి కళ said...

http://teluguvariblogs.blogspot.in/

అలాగే అండి నా బ్లాగు కూడా చేర్చండి.

SamosaTimes said...

sasi గారు,
మీ రచనల్ని చూసి నేను బాగా inspire అయ్యాను. మీ రచనా శైలి అద్బుతం . ఈ ఇన్స్పిరేషన్ తోనే నేను కూడా కూడా ఒక blog మొదలుపెట్టాను . మీకు వీలు కుదిరనప్పుడు ఒకసారి సందర్శించండి . మీ అమూల్యమైన సలహాలు ఇస్తారని ఆశిస్తున్నాను . కృతఙ్ఞతలు ......
నా blog link : www.kavvinta.blogspot.com