Monday, 3 December 2012

ఏమండోయ్ శ్రీవారు :))

''అక్కా''యెగిరి గంతులు వేసింది చెల్లెలు.
ఇప్పుడే తలస్నానం చేసి వస్తూ ఉందేమో 
తల తుడుచుకుంటూ తలుపు తీసింది.
మెడ చూద్దును కదా బోసిగా....వార్నీ ఏదో 
కొత్తగా పెళ్లి అయింది ఎలా ఉన్నారో చూసి 
పోదాము అని వస్తే ఏమిటే ఇది?లాభం లేదు 
మాంగల్య విశేషాలు ''జాజి పూలు''బ్లాగ్ స్పాట్ 
లో చూపాల్సిందే మనసులోనే గట్టిగా అనుకున్నాను.

ఇంతలోనే ''రామ్స్...మా అక్క వచ్చింది''
లోపలి చూస్తూ పిలిచింది ..కాదు ఇంట్లోకి 
రైల్ వచ్చి కూత వేసినట్లు అరిచింది.దీనికి 
ఇంకా చిన్నతనం పోలేదు నవ్వుకున్నాను.
పాపం అతను ఆఫీస్ కి వెళుతున్నట్లు ఉన్నాడు.
వచ్చి నవ్వుతూ ''బాగున్నారా''
అడుగుతూనే షూస్ వేసుకుంటూ ఉన్నాడు.అర్ధం అయింది.
పాపం అతనికి టైం అవుతూ ఉంది.
''పర్లేదులెండి ....మీరు వెళ్ళండి.దీనితో మాట్లాడుతాను.
ఇంకో సారి వస్తాను''చెప్పాను .అతను థాంక్స్ చెప్పి 
వెళ్ళిపోయాడు.
''చెప్పక్కా ఏమిటి విశేషాలు?''అడిగింది.
''నా విశేషాలు సరే నీ సంగతి ఏమిటి?
ఏమిటి పెద్ద పేరు పెట్టి పిలిచేస్తున్నావు బొత్తిగా 
భయం లేకుండా?''
''ఏమిటి భయమా?నాకా?''సంతూర్ ఆడ్ లాగా 
అడిగేసింది.
''పోక్కా ఏమండీ ఏమిటి పాట చింతకాయ పచ్చడి లాగా''
అని కూడా అనేసింది.

లాభం లేదు దీనికి క్లాస్స్ పీకాల్సిందే ....
గొంతు సవరించుకున్నాను.

కొత్తగా కాపురానికి వచ్చి కాఫీ ఇచ్చే భార్య ''ఏమండీ''అని ఒకలా అంటుంది ....

పనిమనిషి రానపుడు సింక్ లో గిన్నెలు చూసి ''ఏమండీ''అని ఒకలా అంటుంది...

షాప్ లో తగిలించిన ఛీరలు చూసినపుడు ఒకలా అంటుంది....

సినిమా పోస్టర్లు చూసినపుడు ఒకలా అంటుంది.....

పిలుపు పిలుపుకు ఒక నాదం ఉంది ,శృతి ఉంది,బ్యాక్ గ్రౌండ్ ఉంది 

దానిని వదిలేసి పిచ్చి పేర్లతో పిలిచి దానిలోని అర్ర్ధ్రత చెడగొట్టవాకు ,

మహోన్నతమైన బారతీయ సంస్కృతిని,చెడగొట్టవాకు .......

గబా గబా తిట్టేసి గ్లాసుడు హార్లిక్స్ తాగేశాను .

అర్ధం అయినట్లు తల ఊపింది.
''అక్కా' అనింది..''చెప్పు''అన్నాను.

''మరి పేరుతొ పిలవాలి అనే ముచ్చట తీరేది ఎలా?''
హ్మ్ ...నిట్టూర్చాను.,
''హేమిటో  ఈ కాలం పిల్లలు అన్నీ చెప్పాలి,అందరి ముందు ''ఏమండీ''అని 
గద్దించితే తప్పు కాని శృంగారం లో కాలు తగిలినా తప్పు లేదంట.
కర్రీస్ అంటే కరస్పాండెన్స్ కోర్స్ లో చెపుతాము కాని కాపురాలు 
ఏమి చెపుతాము....ఇలాగ చెపితే అలాగా అల్లుకొని ఇంటిని పొదరిల్లుగా అందంగా 
మార్చుకోవాలి కాని''......నవ్వి వచ్చేసాను....

(పాత్రలు,సన్నివేశాలు నూటికీ నూరు పైసలా కల్పితం) .

11 comments:

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీరు ఎంత కల్పితం అని నొక్కి వక్కాణించినా అనుమానం తీరలేదు.
శశికళలుడు గారి దగ్గర ఏదైనా సంగీతం మీటర్ ఉందా? 'ఏమండీ' అని మీరు అంటే అందులో ఎన్ని గమకాలు ఉన్నాయి, శృతి ఎంత, తాళం ఏమిటి? అన్నీ కొలుచుకోవడానికి........దహా.

శశి కళ said...

bulusugaru meterlu avee levandi babu...just kalpitam anthe

సుభ/subha said...

అక్కాయ్ ఇది టూ మచ్ ;).. మీరిలాంటి క్లాసులు కూడా పీకుతారా? హు హు హు.. నేను కూడా అదే కేటగిరీ మరి ;) నన్నైతే కొడతారేమో.. నేను జంప్

కావ్యాంజలి said...

Baagundhandi :)

జలతారు వెన్నెల said...

శశి గారు, ఏమండి అన్న పిలుపు నాకు కూడా నచ్చదండి..నీ చెల్లెలికే నా వోటు

శశి కళ said...

shubha ilaa raamma :))

kaavyaanjali garu thankyou

శశి కళ said...

vennelagaru nenu oorike vrasanu.mee ishtam :))

రాజ్ కుమార్ said...

కొత్తగా కాపురానికి వచ్చి కాఫీ ఇచ్చే భార్య ''ఏమండీ''అని ఒకలా అంటుంది ....

పనిమనిషి రానపుడు సింక్ లో గిన్నెలు చూసి ''ఏమండీ''అని ఒకలా అంటుంది...

షాప్ లో తగిలించిన ఛీరలు చూసినపుడు ఒకలా అంటుంది....

సినిమా పోస్టర్లు చూసినపుడు ఒకలా అంటుంది.....

పిలుపు పిలుపుకు ఒక నాదం ఉంది ,శృతి ఉంది,బ్యాక్ గ్రౌండ్ ఉంది
>>>

kevvvvvvvvvvv superrrrr...
ఆ పిలుపు వెనక ఇన్ని కుట్రలున్నాయాఆఆఆఆ

David said...

శశికళ గారు బాగుంది మీ పోస్ట్...

శశి కళ said...

రాజ్ :)))

డేవిడ్ గారు థాంక్యు

Unknown said...

కొత్తగా కాపురానికి వచ్చి కాఫీ ఇచ్చే భార్య ''ఏమండీ''అని ఒకలా అంటుంది ....

పనిమనిషి రానపుడు సింక్ లో గిన్నెలు చూసి ''ఏమండీ''అని ఒకలా అంటుంది...

షాప్ లో తగిలించిన ఛీరలు చూసినపుడు ఒకలా అంటుంది....

సినిమా పోస్టర్లు చూసినపుడు ఒకలా అంటుంది.....

పిలుపు పిలుపుకు ఒక నాదం ఉంది ,శృతి ఉంది,బ్యాక్ గ్రౌండ్ ఉంది
అక్క! పోస్ట్ బావుంది.