రైలు కిటికీల నుండి బయట కనపడే చీకటి చూస్తున్నాను .
మనసులో ఏదో ఆనందం ఎప్పటి కల ..... అసలు నిజం అవుతుందా అని
ఊహించని కల ..... నిజంగా మనసు చాలా హుషారుగా ఉంది .
ఎనిమిది మంది హై స్కూల్ఆడ పిల్లలు వాళ్లకు ఎస్కార్ట్ గా నేను నెల్లూరు జిల్లా
నుండి . వాళ్లకు ఎస్కార్ట్ కి ఎఫిషియెంట్ టీచర్ కావాలి ,నాకు కలాం గారిని
చూడాలనే కల నిజం కావాలి . పలితం ఇదిగో ఈ పిల్లలతో హైదరాబాద్ కు
ప్రయాణం . పిల్లలకు చాలా హుషారుగా ఉంది రైల్ ప్రయాణం . ఒక్కరు నా స్కూల్
మిగిలిన వాళ్ళు వేరే స్కూల్స్ . వీళ్ళకు కలాం గారి గొప్పదనం పరిచయం చేస్తే
ఎంత గొప్ప వ్యక్తిని కలుసుకొనే అవకాశం వచ్చిందో తెలుస్తుంది ,ఈ రోజు ఆంధ్ర జ్యోతి
నవ్య లో ఆయన గూర్చి బాగా వ్రాసారు . పిల్లలలో చిన్నపాటి ఆలోచన వేసే
అవకాశం వచ్చినా వదులుకోవడం నా టీచర్ వృత్తికి చేసే ద్రోహమే . చెప్పి
వాళ్లకు ఇచ్చాను .చదువుతూ చర్చించుకుంటూ ఉన్నారు . ఈయన అన్నం
తిన్నాడా ?ఫోన్ చేసాను .నా సంగతి నీకు ఎందుకు ?నీ కల నెరవేరుతుంది
కదా ... టకామని ఫోన్ పెట్టేసారు . ఏమి చేద్దాము .కొన్ని సార్లు మన మనసు
తెలుసుకోవాలి అంటే అవతలి వాళ్ళు అచ్చంగా పిల్లలు అయిపోవాలి . ఆ కుతూహలం ,
పెదాలపై విరిసే నవ్వు ,సంతోషం తో మోగే చప్పట్లు ..... కావాలి పిల్లలుగా .
పాపా కలాం గారిని చూసే అవకాశం వచ్చింది అనగానే మా పాప
''సూపర్ మా వదులుకోవాకు . అసలు నువ్వు ఎస్కార్ట్ వెళ్ళడం ఆ పిల్లలు చేసుకున్న
అదృష్టం '' అనింది . బాబుకు చేసాను '' మా అది నా డ్రీం మా .నువ్వు నిజం చేసుకుంటున్నావు .
నిజంగా నువ్వు గ్రేట్ మా ''అన్నాడు .
ఇంకా మా తమ్ముడు కూతురు అయితే ''అత్తమ్మా ముందు చెప్తే నేను వచ్చేదాన్ని ''
అని బాధపడింది . పిల్లలకు బాగానే అర్ధం అవుతుంది .... పెద్దలకే .ఎందుకు ఫీలింగ్స్ ని
చంపుకుంటారు . పిల్లలవి బలహీనమైన వోట్లు .ఇంట్లో చెల్లవు . అందుకే ఇరవై రెండేళ్ళు
కాపురం లో ఎప్పుడూ ఉపయోగించని భార్య అనే వీటో పవర్ ఉపయోగించి .... కొంచెం
మనసు కష్టం గానే బయలుదేరాను . నా లైఫ్ స్పాన్ లో నాతో జీవించి ఈ దేశం కోసం
ఉన్న ఒక విజన్ ని చూడటానికి .... ఆ లైటనింగ్ కాండిల్ నుండి కొంత అయిన వెలుగు పొందటానికి .
@@@@@
సెక్రటరీ గారు ఎక్కడా రాజీ పడకుండా రెండు లక్షలు ఖర్చు పెట్టి మరీ గౌలి దొడ్డి స్కూల్
లో మంచి స్టేజ్ ,భోజనాలు అన్నీ సూపర్ గా అరేంజ్ చేయించారు. ''వేదిక మీద పెద్ద అక్షరాలతో
''Infinite sermon to swaroes'' మెరిసిపోతూ స్వరోస్ అంటే ఎత్తుకు ఎగరాలి అని ...
మా సెక్రెటరీ ప్రవీణ్ కుమార్ గారు మా పిల్లలకు ఆ పేరు పెట్టారు . మూడో జోన్ కి సరిగ్గా
వేదిక ఎదురుగానే సీట్స్ ఇచ్చారు. మా ముందు ఉండే సోఫా వెనుక గా నిలబడి
దూరంగా మోగుతున్న స్వాగత బాజాలు వింటూన్న అందరిలో ఏదో ఉత్సాహం ,
చాలా చాలా .... అదిగో ''స్వారోస్ టవర్ ''ఫౌండేషన్ స్టోన్ వేసి కలాం గారు వస్తూ ఉన్నారు .
నేను మొదటి వరుసలో సోఫా వెనుక నిల్చొని కమెరా తీసి ఆయన రెడ్ కార్పెట్ మీదకు
వస్తూనే తీద్దాము అని నిలోచొని ఉన్నాను . పిల్లలు ,పెద్దలు అందరిలో ఏదో ఉత్సాహం
చప్పట్లే చప్పట్లు . న పక్కనే మొత్తం మీడియా కెమరాలు షూట్ చేస్తూ కలకలం .
అదిగో వచ్చేసారు . చూస్తూ ఉన్నాను కలా ,నిజమా ?ఎనబై చిల్లర వయసు .
నేరుగా వచ్చి నా ముందు సోఫాలో కూర్చున్నారు . పక్కన సెక్రెటరీ గారు .
నా ముందు ఆయన .యెవరిని చూడాలి అని ఇన్ని కష్టాలు ఓర్చుకొని వచ్చానో
అయన . నా చేతిలో కెమరా చూసి ప్రెస్ అనుకున్నారో ఏమో అక్కడ సెక్యురిటీ కూడా
ఏమి అనలేదు . అలాగే నిల్చొని చూస్తూ ఉన్నాను . మనసు లో నుండి
ఎక్కడో '' హీ ఈస్ దేర్'' హెచ్చరిస్తుంది చూడమని . చూస్తున్నాను .కాని
తెలీడం లేదు .ఉన్నట్లుండి నేను రెండుగా విడిపోయిన ఫీలింగ్.... ఏమిటో అది
ఆయన స్టేజ్ మీదకు వెళ్లి ఆంకరింగ్ చేసిన పిల్లలను అభినందించారు . మెల్లిగా
మొదలైన ఆయన మెసేజ్ ''బాగున్నారా?'' అడిగారు . తెలుగు అనగానే అందరికి
సంతోషాల వెల్లువ . ఆపకుండా చప్పట్లు . చిన్నగా మొదలైన వాక్ప్రవాహం మెల్లిగా
చిన్న పద్యాలుగా పలికిస్తూ ,మురిపిస్తూ ,నవ్విస్తూ వ్యక్తిత్వ మార్పుకు
మాకు తెలీకుండానే శ్రీకారం చుట్టిస్తూ హృదయం కదిలిపోతుంది అందరికి .
పెద్దలు , పిల్లలు అందరు ఆయన ఏమి పలకమంటే అది హుషారుగా పలుకుతూ ...
''Iam born with potential
Iam born with goodness
Iam born with confidence
so Iam not ment for crawling
bcoz I have wings
I will fly .... I will fly ....I will fly ''
''I enjoy my neighbours victory also ''
what a man .... man of misson ....man of vision
......which I felt a great opportunity that god gave for me.
thank you god .
అగ్ని లో ఏదైతే ఎనెర్జీ పొందానో అదే ఎనెర్జీ నిరంతరంగా అందరి హృదయాలలో
ప్రవహిస్తూ . నేను గర్వంగా చెప్పగలను నేను చూసాను ''తన కోసం
మాత్రమె కాక ఒక దేశం కోసం తపిస్తూ కొట్టుకునే గుండెని ''
తరువాత అంతా మౌనంగా ఉండటమే నేను చేసింది . ఎందుకో నాకే తెలీదో
ఒక్కో సారి అనంతమైన సైలన్స్ లోకి వెళ్లి పోతాను . నాకే తెలీకుండా .
@@@@@@@@@
పక్క రోజు ఖాళీ . రాత్రికి ట్రైన్ .ఫ్రెండ్ కి చేసాను . నేను దారి చెపుతాను రండి
అంది . ఒక్క దాన్ని వెల్లడమా ... చూద్దాము . ఇప్పటికైనా ప్రపంచం తెలుసుకోక పోతే
ఎలా . ఆఫీస్ కి వెళ్లి మేడం కోసం చూస్తూ రిసిప్షన్ లో కూర్చున్నాను . నేను వచ్చాను
అనేది నాకే కల లాగే ఉంది . లేకుంటే ఇంతకు ముందు కలలో వచ్చానో ?
మేడం వచ్చారు . ఆప్యాయంగా రిసీవ్ చేసుకొని ఆఫీస్ అంతా చూపించారు ,
తన కొలీగ్స్ ని పరిచయం చేసారు . కాలం తో పరుగులు పెడుతూ సెకన్ల కు
కూడా విలువ ఇవ్వాల్సిన ఉద్యోగాలు అర్ధం అయింది . అందరు సిస్టం ల ముందు కూర్చొని
బుర్రను కొద్దిగా దానికి కలిపి కుస్తీ పడుతున్నారు . మేడం నన్ను పరిచయం చేయగానే
కొని సెకన్లు త్యాగం చేసి నన్ను పలకరించడం ,చిరు నవ్వు ,కొంచెం కాఫీ ,టీ
అంత పని వత్తిడిలో నా కిచ్చిన మనస్పూర్తి గౌరవంగా నేను ఫీల్ అయ్యాను .
వాళ్ళ హెడ్ గారు కూడా నన్ను ఆప్యాయంగా పలకరించి అతిధి మర్యాదలు
చేయడమే కాక గబుక్కున నా కప్ కూడా పక్కన పెట్టేసారు . తాగిన కప్పులు
పక్కన పెట్టేంత సంస్కారం తనది . కాని ఇల్లాలిగా తన చేత చేయించినందుకు
నాకు కష్టం అనిపించింది . కాని అది తన మీద వంద రెట్లు గౌరవాన్ని పెంచింది .
అయితే ఇదంతా మా ఫ్రెండ్ తన చుట్టూ తన చిరు నవ్వుని ,చక్కని మనసు ని
ఉపయోగించి చేసుకున్న స్నేహ పరిమళపు తోట . లేకుంటే చూడని నన్నే
నా ఆకలి చూసి అన్నం తెచ్చింది . మాట వరసకు చెప్పాను మూడు రోజుల నుండి అన్నం సరిగా
తినలేదు అని .... అంతే ఇంటి నుండి ఆకు పప్పు ,చిక్కుడు తాలింపు ,గుంత పొంగాలాలు
పెరుగు అన్నం కొసరి కొసరి వడ్డిస్తూ ..... నా కైతే అవి తింటూ ఉంటె
ఇంటి మీద బెంగ తన్నుకోచ్చేస్తూ ఉంది .బెంగ వచ్చేస్తే ఇక కోటి రూపాయలు
ఇచ్చినా ఉండను . మా పుట్టింట్లో అయినా సరే . ఎమివ్వగలం అ ప్రేమకు బదులుగా
''అన్న దాత సుఖీభవ ''అంతే .
ఆ లిఫ్ట్ లో అన్ని అంతస్తులు ఎక్కడం దిగటం చూడటం ,ఎక్కడా ఆకాశమే కనపడదే .
ఏమో గుహలో ఉన్నట్లే ఉంది . అంత కలగానే ఉంది కాని నా మోచేయికి
రోడ్ మీద దాటే టపుడు ఆటో తగిలిన గాయానికి ఆ మేడం దగ్గర ఉంది
ఫర్స్ట్ ఎయిడ్ చేయిస్తూ టించర్ వేయించారు చూడండి .... అప్పుడు చురుక్కుమని
''అబ్బ '' మంట . హమ్మయ్య కల కాదు .
బయటకు వచ్చినాక వాళ్ళ ఆఫీస్ చూసాను .... కింద నుండి పైకి .
నాకు ఎలా ఉంది అంటే ''హనీ ఫాబ్ ''అవును తేనే పట్టు .యెవరికి వాళ్ళు
పని చేసుకుంటూ .... పరుగులు పెడుతూ . వీళ్ళు అందరిని సమన్వయం చేస్తూ
హెడ్స్ ఉన్నట్లే తేనే పట్టు లో కూడా ఆ ఈగల మధ్య సమన్వయము చేయడానికి ఎవరు ఉంటారో ?
నోటీస్ బోర్డ్ లో చూసాను .యెవరికొ ''RIP'' .తప్పదు అలా క్షణాల్లో పరుగులు
పెడుతుంటే .... పని వాళ్ళు కంపనీ ను గుర్తుంచుకుంటే .... పై వాళ్ళు
కింది వాళ్ళ ఆరోగ్యాన్ని ఆహారాన్ని గుర్తుంచుకోవాలి . లేకుంటే స్కిల్డ్ హాండ్స్ ని
వాళ్ళు కోల్పోతారు . ఎందుకంటె సిస్టం లను కొనగలం కాని వాటిని పని చేయించే
స్కిల్ ని కొనలేము ఎన్ని కోట్లు పోసినా . ఒక సంస్థకు వాళ్ళ నమ్మకమైన
ఉద్యోగుల కంటే ఆస్థి ఇంకేమి ఉంటుంది .
@@@@@@@@@@
తిరుగు ప్రయాణం లో నాలుగు రోజుల కోసం నా వొడిలోకి చేరిన ఎనిమిది
చిన్ని గువ్వలు నన్ను విడి పోలేక ఏడుస్తుంటే ఏమి చేసేది ?జీవితం
లో ఇవన్నీ మామూలే .... ఈ జ్ఞాపకాలతో ముందుకెళ్లాలి అని చెప్పి
వాళ్ళలో నేను వేసిన విత్తనాలు మొలకెత్తి దేశానికి సౌభాగ్యాన్ని
చేకూర్చాలి అని దేవుడిని వేడుకోవడం తప్ప .
11 comments:
ఆ కల నాకు కూడా తీరింది. కాబట్టి మీ ఆనందం అర్ధం చేసుకోగలను:) అభినందనలండి.
Wonderful. Congratulations on your dream come true.
-S
మీ కల నెరవేరినందుకు అభినందనలు. కొన్ని కొన్ని క్షణాలు అంతే, జీవితాంతం గుర్తు ఉండిపోతాయి.
టపా చాలా బాగా వ్రాసారు. మరోమారు అభినందనలు.
మీ కల ,కోరిక తీరినందుకు (తిర్చుకునందుకు)అబినందనలండి .బాగుంది బాగారాసారు .
అభినందనలు శశిగారు .. కలాం గారే చెప్తూ ఉంటారు కలలు కనండి ఆ కలలను సాకారం చేసుకోడానికి కష్టపడండి అని అలాంటి మహోన్నత వ్యక్తిని కలవడం మీరు చేసుకున్న అదృష్టం.
కలని నెరవేర్చుకున్న ఆ శైలి కళ్ళని కప్యూటర్కి కట్టిపడేసింది. బార్య భాద్యత, స్నేహ పరిమళం, ఉద్యోగ బాధలు, బహుళ అంతస్థుల తేనేపట్టు ఉపమానాలంకారం.. వాహ్ ఆ శైలి గ్రేట్.
పిల్లలలో చిన్నపాటి ఆలోచన వేసే
అవకాశం వచ్చినా వదులుకోవడం నా టీచర్ వృత్తికి చేసే ద్రోహమే.<<<
చప్పట్లు!!! మీరు నిజంగానే ఒక ఎఫిషియెంట్ టీచర్ మేడమ్.
చాలా బాగా రాశారు. మీ కల నెరవేరినందుకు అభినందనలు.
congratulations sasi garu :)
jaya garu meeku kooda alage anipinchindha ?thank you
anonymous garu me peru?thank you
bulusu garu chala rojulu taruvatha kanipincharu .thank you
raadhika garu.thank you.mee pic bhale undhi
ramani garu ,trushna garu thank you
shishira garu meeru manchi lecturer
naku ardham ayindhi.thank you
congs sasi garu...........chala baga rasaru
Post a Comment