పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఏమి ఇంజినీరింగ్ చదువులో ఏమిటో !
బిడ్డలు కనీసం పుట్టిన రోజుకు కూడా ఇంటికి రాలేక పోతున్నారు .
''నివాస్ పుట్టిన రోజు శుభాకాంక్షలు కన్నయ్య ''
''శతమానం భవతి ''
ఇంకా నీ లాబ్ ఎక్సామ్ కి ఆల్ ది బెస్ట్ .
ఇవన్నీ రెండో తేది చదువుకో రేపు నాకు తీరదు అని ఈ రోజే
ముందస్తుగా చెపుతున్నాను :)
ఇంకా ఫేస్బుక్ గ్రూప్ ''కవి సంగమం ''లో నీ కోసం వ్రాసిన
కవిత :))
వట్టి కవితేనా ...... అంటే ఇదిగో ఇవన్నీ నీ కోసమే :)
అప్పుడు నీవక్కడ ఉన్నావా ?
ఏమి ఇంజినీరింగ్ చదువులో ఏమిటో !
బిడ్డలు కనీసం పుట్టిన రోజుకు కూడా ఇంటికి రాలేక పోతున్నారు .
''నివాస్ పుట్టిన రోజు శుభాకాంక్షలు కన్నయ్య ''
''శతమానం భవతి ''
ఇంకా నీ లాబ్ ఎక్సామ్ కి ఆల్ ది బెస్ట్ .
ఇవన్నీ రెండో తేది చదువుకో రేపు నాకు తీరదు అని ఈ రోజే
ముందస్తుగా చెపుతున్నాను :)
ఇంకా ఫేస్బుక్ గ్రూప్ ''కవి సంగమం ''లో నీ కోసం వ్రాసిన
కవిత :))
వట్టి కవితేనా ...... అంటే ఇదిగో ఇవన్నీ నీ కోసమే :)
అప్పుడు నీవక్కడ ఉన్నావా ?
01/12/2013
జ్ఞాపకాల సద్ది మూటను
ఒక్క సారి విప్పి చూడరాదా !
అప్పుడు నీవు అక్కడ ఉన్నావో లేదో ......
ఊపిరి పోసుకున్న నీ ప్రతిబింబం
అమ్మా అనే రాగాన్ని తొలిసారి ఆలపించినపుడు
చిట్టి అడుగుల వామనుడు ఎంతో ఎదిగి
నీ హృదయ సీమనే మూసేసినపుడు
వీపు సింహాసనం పై చుట్టుకున్న చిన్ని చేతులు
మురిపంగా నీపై జంపాల ఊగినప్పుడు
బడికి వెళ్ళలేక చిన్నారి
బెంగ నీ కాళ్ళకు చుట్టి కదలనీయనప్పుడు
నీ చేయి దిండు స్పర్శ తగిలి
బుజ్జి ఊహలు కధలుగా మారినపుడు
ఊ కొడుతూ చిన్ని ఊసులు
చిరు నిద్రలోకి జారినపుడు
పాలభాగాన్ని చుంబిస్తూ పిల్ల తెమ్మెర
ముంగురులను సర్దినపుడు
కాళ్ళు చేతుల సంకెళ్ళతో
నిన్ను కట్టిన బరోసాతో రెక్కల గుర్రాల పై
బుజ్జి పాపలు ఎగిరినపుడు .....
ఒక్క సారి చూసుకో నీవు అక్కడే ఉన్నావా ?
గాలి ని మూటలు కడుతూ
ఆశల ఎండమావుల వెంట పరిగెడుతున్నావా
లేక అక్కడే ఉన్నావా ?
చిగురించిన జ్ఞాపకాల తడి మనసుకు అద్దుతూ
నిజం చెప్పు నీవు అక్కడే ఉన్నావా ?
*******************
7 comments:
నివాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు.
నివాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు :-)
అయ్యొ ఇదియేమి చదువులు
జన్మదినము నాడైనను బిడ్డ
నింటికి రాలేదనుచు
నేల ఖేదించు చున్నావు
ఓ తల్లీ...
బిడ్డడు వచ్చినను
నాతనికి ఇష్టమగు
విందు భోజనమ్ము
సమకూర్చు సమయము గలదె
యదార్ధముగన్
2 వ తేదీ నాడు నా ఈ శుభాకాంక్షలు చదువుకో..నాకు రేపు వీలుపడదు అని మీరు రాసినదానికి చమత్కారంగా రాసాను..చి.శ్రీనివాసుకి జన్మదిన శుభకాంక్షలు
నివాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
వోలేటి గారు థాంక్యు :) అందరి కంటే ముందు చెప్పాలి అని
అలా పెట్టాను . పన్నెండుకు వేద్దాము అంటే కొంచెం మేలుకోను
హెల్త్ సహకరించడం లేదు . ఉదయం పనుల్లో పోస్ట్ వేయను కుదరదు
కదా ....... అయితే ఒకటి పిల్లలు ఇంట్లో ఉంటె వాళ్ళ పుట్టిన రోజుకి
నేను సెలవు పెట్టేస్తాను . ఆ రోజు వాళ్ళదే .సంతోషం వాళ్ళది నాది :)
తలంటి స్నానం చేయించి పూజ చేసి ,తీపి తినిపించి ,సాయంత్రం పార్టీ లేకుంటే సినిమా మొత్తం వాళ్ళతోనే గడుపుతాను .
వాడిక్కడ లేదు కదా అని సెలవు పెట్టలేదు . అవసరం లేదు అన్నప్పుడు
సెలవు పెట్టాలి అంటే ఇష్టం ఉండదు నాకు .
cheppalante garu,venu thank you
cheppalante garu,venu thank you
Post a Comment