హర హర మహాదేవ ... ఆశ్రిత మందారా
నాకు కృష్ణుడు అంటే బోలెడు ఇష్టం .
శివుడు అంటే బోలెడు గౌరవం .
ఎందుకంటె ఇదిగో మా అమ్మమ్మ వాళ్ళ
ఇంట్లో చిన్నప్పటి నుండి ఈ రామేశ్వరం ఫోటో
చూస్తూ పెరిగాను . హాల్ లో వేలాడదీసిన
ఊయల పై పెద్ద ఊపులు ఊగుతూ ఆ ఫోటో
దగ్గర కు వెళ్ళినపుడు ఫోటో ఇంకా పరిశీలనగా
చూసేదాన్ని . ఇప్పుడు ఈ ఫోటోలో సీతా రాములు
ఒక జంట ,శివ పార్వతులు ఒక జంట . కాని నాకెందుకో
శివ పార్వథులనె చూస్తూ ఉండేదాన్ని .
ఆ కధ కూడా తెలుసు .
(my old post odugu yeduguthavu link )
అసలు పెళ్లి మంత్రాలు సంస్కృతం లో ఉండేసరికి
వాటి విలువ చాలా మందికి తెలీడం లేదు .
పెళ్లి కొడుకు చెపుతాడంట
''సఖీ నీ ద్వారా పది మంది సంతానాన్ని ఇవ్వు .
పదకుండో బిడ్డగా నన్నే స్వీకరించు '' అని .
భారత దేశం లో పెళ్లి ముఖ్యంగా ''గృహస్థ ఆశ్రమ ''
నిర్మాణానికి , పిల్లలను కానీ పితృ ఋణం
తీర్చుకోవడానికి ఉద్దేశింప బడినది . దానికి
భార్య చాలా ముఖ్యం . ఏదో లే ఒక ఒక మనిషి
ఉంది అన్నట్లు కాకుండా ... నిజంగా భార్య ను
ఎలా గౌరవించాలో ఇద్దరి సమతుల్యత లోనే
జీవితం తృప్తి గా ఎలా సాగుతుందో ''అర్ధ నారీశ్వరుడి ''
గా శివుడు ఆచరించి చూపాడు .
సమస్య లు వచ్చినపుడు నీదే తప్పు అంటే నీదే తప్పు
అనుకోవడం కాకుండా ... అవతలి ప్రేమతో
వారి కోణం నుండి కూడా ఆలోచిస్తే ,భార్య ను
తగు రీతిలో గౌరవించి ఒకరికి ఒకరు గా మాత్రమె
కాదు .... ఒకరిలో ఒకరుగా జీవిస్తారు .
''బ్రహ్మ కుమారీ '' లో చెపుతారు . శివుడు వేరు ,
శంకరుడు వేరు . శంకరుడు కూడా ''శివ శక్తి ''
కోసం నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటారు అని .
అది నిజం . లింగోద్భవ కధలో నేల నుండి నింగికి
ఎగిసి ఆది అంతాలు లేని ఒక శక్తి స్వరూపాన్ని
ఆ రోజే శివరాత్రి అని ఒక కధనం .
ఏది ఏమైనా పురుషుడు శ్రమ , స్త్రీ ప్రేమ శక్తి .
శక్తి ని తనకు అనుగుణంగా ప్రేమతో మార్చుకొంటే
వారి అనురాగ లయ విన్యాసాలకు పుడమి మొత్తం
పులకరించి పచ్చల అందాలు అద్దుకుంటుంది .
ప్రకృతి పురుషుల సంగమమే సృష్టి కి అస్తిత్వాన్ని
అందిస్తుంది .
దాని గూర్చి పోస్ట్ ఇప్పుడు లింక్ ఇస్తున్నాను .
చదివి ఆ ఆది దంపతుల ఆశీస్సులు పొందండి .
''హర హర మహాదేవ శంబో శంకర ''
@@@@@
(నిజానికి ఏమి పోస్ట్ వేయడానికి ఈ ''రాష్ట్ర విభజన ''
సమయం లో మనస్సు రాలేదు . చెప్పలేను కాని
ఇక్కడ అందరి లో బయటకు రాని ఏదో బాధ తో
ఉన్నారు . కనీసం దుఖం రూపం లోనో లేదా
కోపం రూపం లోనో లేదా నిరసనగా నో అది
బయటకు రాకుండా ఉండి ,ఒక రకమైన నిర్వేదం
అందరిలో ఇక్కడ చూస్తున్నాను .
రాజధాని కోసం పై వాళ్లు ఏదో కొట్టుకుంటున్నారు ,
స్వార్ధ పరులు హడావడి చేసుకుంటున్నారు .
కాని నిజంగా సామాన్యుడి కి తన జీతం గురించి
పిల్లల చదువులు , కొలువుల గురించి చెప్పలేని
దిగులు . దగ్గరకు తీస్తుంది అనుకున్న అమ్మ
వీపు మీద బాది రూం లో పడేస్తే మోకాళ్ళలో
పిల్లవాడు దిగులు . చేసేది లేదు . జీతాలు
ఇబ్బంది మాత్రం దాని పై ఆధార పడిన
వ్యాపారాలు అన్నీ కుదేలే . ఏమీ చేయలేము .
కాలం నడవడం తప్ప )

No comments:
Post a Comment