అందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు .
శ్వాస మీద ధ్యాస ఉంచండి . ఆలోచనలు కట్ చేయండి .
ఒక్కొక్కరు ప్రశాంతంగా ఒక చేతి వేళ్ళలో ఇంకో చేతి వేళ్ళు
ఉంచి కూర్చోండి . ఏమి మంత్రం అనుకోవద్దు . గమనిస్తూ ఉండండి
మీలో ఏమి జరుగుతుందో . మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు
కూర్చొని ధ్యానం చేయండి .... చెపుతూ ఉన్నారు రాఘవేంద్ర సార్ .
మెడిటేషన్ క్లాస్ కు వెళ్లి వాళ్ళు చెప్పేవన్నీ వింటున్నాను .
ఇంతకు ముందు గూడూరు లో మా అక్క, నేను రేవతి మేడం
దగ్గర నేర్చుకున్నాము . ఇక ఇక్కడ నాయుడుపేట లో ఇక్కడ
సెంటర్ ఉంది తెలిసి వచ్చాను . అందరు ఫామిలీస్ తోనే వచ్చారు .
కొందరు చిన్న పిల్లలు కూడా ఎంత ముచ్చటగా చేస్తున్నారో !
ఇంకా చెపుతూ ఉన్నారు . ధ్యానం వలన ఆరోగ్యం బాగు అవుతుంది .
మనసు ప్రశాంతం అవుతుంది . ఏకాగ్రత పెరుగుతుంది .
''ఏమిటి ఇవన్నీ నిజామా ?''అడిగాను .
''మేము చెప్పేది మేము చెప్పాము . నిజమో కాదో మీరు
పరిశీలించి తెలుసుకోండి . ఎవరో ఏదో చెప్పారు అని నమ్మొద్దు .
చెప్పిన వాళ్ళను దేవుళ్ళు చేయొద్దు . బియ్యం ఉడికిస్తే అన్నం
వస్తుంది అని చెపుతాము . కాని మీరు చేసుకోవడం నేర్చుకుంటే నే
కదా మీకు అన్నం వస్తుంది .
అప్పో దీపో భవ
ఎవరి కర్మ ను వాళ్ళే తొలగించుకోవాలి . ఉద్దరించుకోవాలి .
ఎవరూ ఎవరి కోసం ఏమి చేయరు . దారి చెపుతారు అంతే .
నడవ వలసిన వాళ్ళు మీరే '' అని చెప్పారు సార్ .
సరే చూద్దాము . ఏదైనా చేసి చూడాలి ,సాదించాలి అనే పట్టుదల నాకు .
మెల్లిగా అందరు కళ్ళు మూసుకొని ధ్యానం లోకి వెళ్ళిపోయారు .
ఏవో ఆలోచనలు.... ఇప్పుడు కాదు అని వాటికి చెప్పేసి నా శ్వాస నే
గమనిస్తూ ఉన్నాను . కళ్ళు మాత్రం తెరవాలి అనిపించడం లేదు .
మెల్లిగా తల మీద ఏదో కొంచెం బరువుగా .... భయ పడాల్సినది
ఏమి లేదు అని తెలుసు కాబట్టి చూస్తూ ఉన్నాను . మెల్లిగా ఏవో
వైబ్రేషన్స్ శరీరం లోకి వస్తూ ,నడుము భుజాలు భలే నొప్పిగా అనిపిస్తూ
ఉన్నాయి . రాఘవేంద్ర గారు ముందే చెప్పి ఉన్నారు ,అలా నొప్పిగా
అనిపించినా ఓర్చుకొని అలాగే గమనిస్తూ ఉండండి .
ముందు రాబోయే జబ్బులని విశ్వశక్తి శుబ్రం చేసి తొలగిస్తుంది అని .
అందుకే గమనిస్తూ ఉన్నాను ,ఓర్చుకోలేనంత నొప్పిగా కూడా ఉంది
కాసేపు . కళ్ళు మాత్రం తెరవలేదు . మెల్లిగా నొప్పి తగ్గిపోయి ఎప్పుడు
మౌనంగా ఉన్నానో నాకే తెలీదు . ఏ ఆలోచన అనిపించదు .
చేతులు ,శరీరం తేలిక అయిపోయినట్లు . చాలా హాయిగా ఉంది .
అలాగే కూర్చోవాలి అనిపించేటట్లు .
ఇంటి దగ్గర ఒక్కరమే చేసుకోవచ్చు కాని ,ఇలా
అందరితో సామూహిక ధ్యానం చేస్తే మనం కళ్ళు తెరవము ,ఇంకా
ధ్యాన స్థితి తొందరగా వస్తుంది . ఇంకా మనకు ఏవైనా కనపడినా ,
అనుభూతి చెందినా అలా ఎందుకు వచ్చిందో వివరిస్తారు .
మెల్లిగా మౌనం లోకి జారిపోయిన అనుభూతి . చూస్తూనే ఉన్నాను .
ఏదో ఒక స్తంభం బంగారు రంగులో కనపడింది . అందరు కళ్ళు
తెరిచేసరికి నేను తెరిచాను .
నాకు కనపడింది చెప్పి దీని అర్ధం ఏమిటి అని అడిగాను .
''అమ్మ మీరు ఇంటికి వెళ్లి దీని అర్ధం ఏమిటి అని మనసులో
అనుకోని దానికి సమాధానం వచ్చేవరకు ధ్యానం చేయండి ''అన్నారు .
వదిలే రకం కాదు నేను . అలాగే ఇంటికి వెళ్లి ధ్యానం చేసాను .
చాలా సేపటికి మళ్ళా ఆ బంగారు స్థంభం కనపడింది .
మెల్లిగా దాని పై భాగం ,దాని పై ఒక పద్మం దానిలో శివ లింగం .
అర్ధం కాలేదు కాని ఇంకా గమనిస్తూనే ఉన్నాను . మెల్లిగా నాలోకే
ఏవో అక్షరాలు
''అన్ని సత్యాలు మీకే ... అన్ని లోకాలు మీకే '' అని .
అదే నా ఫస్ట్ మెసేజ్ . అలా వస్తుందని కూడా నాకు తెలీదు .
కాని నాకు ఇప్పుడు తెలిసింది ఏమిటంటే మనసు తో మౌనాన్ని ఆశ్రయిస్తే
ఎంతో జ్ఞానాన్ని ,ప్రశాంతతను పొందవచ్చు అని .
ఇదంతా నమ్మొచ్చా ?అని మీరు అడిగితే ఒకటే చెపుతాను .
నమ్మమని ఎవరు చెప్పారు . గుడ్డిగా ఏదీ నమ్మొద్దు .
నిజమో కాదో కాసింత సేపు కళ్ళు మూసుకొని చూడండి .
మీ జ్ఞానాన్ని మీరే పొందండి .
ఎప్పుడైనా మా మేనమామ గారు ఫోన్ చేస్తే నీ ఆరా బుక్ ఎప్పుడు
వ్రాస్తావు శశి ?నీ ధ్యాన అనుభవాలు తెలుసుకోవాలి అని ఉంది అంటారు .
వాటి వలన ఎవరికైన ప్రయోజనం ఉంది అనుకున్నప్పుడు
వ్రాస్తాను . ... లేకుంటే లేదు .

4 comments:
అలాగ 3/4/5 గంటలు కూర్చునే ఉంటే అప్పులు తీరిపొతయ్యా మేడం!
prasad garu thnx for reading.yedho jaruguthundani,baduluga yedho vasthundane manam prathi pani chesthuntaamu .
kaani dhyanam oka
pani kaadhu . chesi choodandi ,mee aalochana vidhanam loni maarpu mee jeevithaanni yentha prabhavitham chesthundo telusthundhi .
శశి గారు కొంతకాలం క్రితం వరకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రక్రియ చేసేదాన్ని. కాని మెల్లగా అది మరుగున పడిపోయింది. ఇప్పుడు మీరు వ్రాసింది చదివాక మళ్ళీ మొదలు పెట్టాలనిపిస్తోంది. నిజంగానే, పదిమందిలో అయితేనే ఎక్కువ ప్రయోజనం అనిపిస్తుంది. మీకు కూడా బుద్ధ పూర్నిమ శుభాకాంక్షలు.
avuna jaya garu .modalu pettandi.vachchina daanni yenduku vadhalaali .thnx
Post a Comment