''శశి నీకే ఫోన్ '' శ్రీవారు వెనుక సీట్ లో నుండి ఇచ్చారు .
టెంపో స్పీడ్ గా వెళుతుంటే లోపల ఎ . సి కి ,అందులో ఉదయం
నుండి హొగనికల్స్ వాటర్ఫాల్స్ ఇంకా అటునుండి అటు ''ఆరుణాచలం''
చూసుకొని తిరిగి తిరిగి అలిసిపొయిఉన్నాము . అందులో రాత్రి పన్నెండు ...
ఈ సమయం లో ఫోన్ ఏమిటి ?
తీసుకున్నాను ,నిద్ర మత్తులోనే ''హలో '' అన్నాను .
అవతల నుండి ఒక గొంతు ఏమి అర్ధం కాకుండా ,
''huttina habbhabha subhashesheyagalu amma nimage....
mundhina janmadhalli ninna aammanagi hutti ninna runavannu terisuthena..''
''ఏమిటీ ''అన్నాను అర్ధం కాక .
''అమ్మా నేనునివాస్ ని , నీకు హ్యాపీ బర్త్ డే ''చెప్పాడు పుత్రరత్నం నివాస్ .
వార్నీ నువ్వా ? అయినా ఇప్పుడు ఇంకా పుట్టిన రోజులు చేసుకొనే
వయసా ? కాని వాళ్ళ ప్రేమకి ముచ్చట వేసింది . టెంపో లో మరిది వాళ్ళు ,
ఆడబిడ్డ వాళ్ళు ఇంకా పిల్లలు అందరు మంచి నిద్ర లో ఉన్నారు .
పాపం అందరికి డిస్ట్ర బెన్స్ అవుతుందేమో ! వాడేమో చెపుతున్నాడు .
''అమ్మా నేను చెప్పింది ఏమిటో తెలుసా ?కన్నడం .
నీకోసం ఫ్రెండ్ దగ్గర నేర్చుకొని గుర్తు పెట్టుకొని చెప్పాను . ''
''సరేలేరా దీని కోసం ఇంత సేపు మేలుకున్నావా ?ఇక నిద్రపో .
మళ్ళా రేపు ఎక్సామ్ కదా ''చెప్పాను నవ్వుతూ .
వాడికేమో ఇంకా మాట్లాడాలి అని .
నేనే ఫోన్ ఆపేసాను ఉంటాను అని చెప్పేసి .
''శశీ మళ్ళీ ఫోన్ '' ఇచ్చాడు ఈయన .
అర్ధం అయిపోయింది . పాప దగ్గర నుండి .
''అమ్మా హ్యాపి బర్త్ డే . ఛా .... మా వాడే ఫర్స్ట్ చెప్పాడు
కదా . నేను నీ ఫోన్ కి చేస్తే నువ్వు తీస్తే కదా .
వాడు ఇప్పుడే ఫేస్బుక్ లో చెప్పాడు . వాడే ఫస్ట్
చెప్పాను అని ''
అబ్బా మళ్ళా వాదులాట మొదలు పెట్టారు .
''వాడు వెక్కిరించాడు నువ్వు వేస్ట్ . నేను ఎలా చేసావురా
అని అడిగితే ... వేర్ థెర్ ఈస్ విల్ థెర్ ఈస్ వే .
నేను అమ్మకి కాకుండా నాన్నకు చేసాను . అమ్మ బాగ్
ఎక్కడో పడేసి ఉంటుంది . నాన్న అయితే ఫోన్ జేబులో
పెట్టుకొని ఉంటాడు . చూసావా నేను ఫస్ట్ చేసాను అని
ఏడిపిస్తూ ఉన్నాడు ''
ఇంకా చెపుతూ ఉంది .
''మా...... నేనేమో మూడు రోజుల నుండి నీకోసం ఒక వీడియో ప్రిపేర్
చేసాను . అదేమో ఫేస్బుక్ లో అప్లోడ్ చేసాను పన్నెండుకు పోస్ట్
వేద్దాము అని . అదేమో గంట అప్లోడ్ అయింది మా . వాడేమో
నీ చిన్నప్పటి ఫోటో పెట్టి పోస్ట్ వేసాడు . నేనే ఫస్ట్ అని ఎడిపిస్తున్నాడు .
నువ్వు నా వీడియో చూడమ్మా '' అంది .
నాకు అర్ధం అయింది అందరు మేలుకొని చాటింగ్ చేస్తూ నా కోసం
విషస్ పెడుతున్నారు ,అయ్యో నా దగ్గర కంప్యుటర్ లేకపోయే .
కొంచెం బాధ వేసింది . ఇదిగో ఇదే వీడియో చూడండి .
డ్రాయింగ్స్ అన్నీ పాప వేసినవే . మరీ బాగా లేవు . కాని
ప్రతి దాని వెనుక అమ్మ ప్రేమ కనిపిస్తుంది చూడండి .
ఇంతలో మళ్ళీ ఫోన్ . ఎవరబ్బా ?ఇద్దరు బుడ్డిగాళ్ళు అయిపోయారు కదా !
''ఆంటీ హ్యాపీ బర్త్ డే .'' హసిత ... మా పెద్ద తోడు కోడలు కూతురు .
నివాస్ చదివే కాలేజ్ లోనే చదువుతుంది .
''నీకెలా తెలుసమ్మా ?'' అడిగాను .
''అన్నయ్య పోస్ట్ వేసాడు '' చెప్పింది .
నాకు అర్ధం అయింది అందరు చాటింగ్ చేస్తూ పన్నెండు వరకు మేలుకొని
నన్ను ఆనందపరచాలి అని ప్లాన్ చేసారు . పాపం పిల్లలు తూగుతూ
కూడా అమ్మ మీద ప్రేమతో మేలుకొని ఉన్నారు .
ప్రేమ తెలపడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా ?
కాని నన్ను ఎంత సంతోషపరిచారు . మన ఆత్మీయత ,నిబద్ధ్ద్హత
ఎవరి హృదయాన్ని అయినా మురిపిస్తాయి .
ఇప్పుడు ఈ పోస్ట్ వేయడం ఎందుకు అనుకున్నాను . కాని ప్లస్ లో
ఈ విషయం షేర్ చేసినపుడు అందరు భలే ఆనందించారు .
ఒక అమ్మగా నా ఫీలింగ్స్ మీతో పంచుకుంటే .... మీలో పెద్ద వాళ్ళు
ఉన్నారు , పిల్లలు ఉన్నారు . మీ అమ్మ వడి గుర్తుకు వచ్చి
మా అమ్మ ఎలా ఉందో అనుకుంటారు కదా !
హృదయం లో పొంగిన ప్రేమ తడి మీ కళ్ళ మీదో ,
మీ పెదాల మీదో కనిపిస్తుంది కదా .
కనిపించిందంటే జీవితపు పోరాటం లో మీరింకా పూర్తిగా
మర మనిషి కానట్లే . ఒక్క సారి కళ్ళు మూసుకొని మీ అమ్మని
గుర్తుకు తెచ్చుకోండి . ఎంత హాయిగా ఉందో చూసుకోండి .
మన బలాలు అందరు ప్రేమిస్తారు . కాని మన బలహీనతలు కూడా
ప్రేమించి మనకు అండగా నిలిచేదే అమ్మ .... కాదంటారా ?

7 comments:
జన్మదిన శుభాకాంక్షలు..ఈ ఫేస్ బుక్ పుణ్యమా అని నాకు కూడా నా పుట్టిన రోజునాడు దగ్గర వాళ్ళు చాలా మంది విషెస్ చెప్పేరు..బై ది బై మీ అమ్మాయి కానుక బావుంది..
thnx voletigaru .
ఒక మంచి బహుమతిని ఇచ్చిన మీ పిల్లలకు నా అభినందనలు. ఇలాంటి రత్నాలను కలిగిన మీరు అదృష్టవంతులు. మీకు నా అభినందనలు.
Nice. mee ammayi drawings kuda bagunnaayi.
kiran garu mee papa kooda chakkaga yeduguthundhi . na blessings.
anonymous thnx.peru vrasunte bagundedhi .
Hello Madam , this is satish , working in Bangalore , I was just bored and very first time tried to search if I can find any telugu blogs where I can get something some interested stuff , your blog is simply awesome cant say in my words, really made me get some tears ,remember what my mom did so far and what she has sacrificed for me in her life. btw the video was really awesome, please convey my words to your very sweet kids, seems you are very attached to your kids even they are. these day its really required between families.
thanks a lot sharing memorable moments with all of us , I am sure going to make a book mark , every weekend I will read all your posts , whenever I feel depressed or need some energy
thank you satish and welcome your best wishes.mother is so sweet for
every son who has attachment with his mother.blessings
Post a Comment