పుట్టిన రోజు ముచ్చట (2)
( part 1 link ikkada )
''ఎప్పుడూ సంక్రాంతి కి మీ అత్తగారిల్లేనా ?
ఈసారి కోటకు రండి '' అమ్మా నాన్న ల ఆహ్వానం .
కాదన లేము, అందులో అసలు కంటే వడ్డీ ముద్దు
అని ''హేమ మాధురి '' ఫస్ట్ మనుమరాలు అయిపోయే .
దాని బుల్లి చేతులతో భోగి మంటల్లో తాటాకు లు
వేయించాలని అమ్మమ్మకు ,తాతయ్యకు ,మేన మామకు
సరదా .... వాళ్ళకే కాదు మాకు కూడా సరదాగా ఉంది .
అందులో కొత్తగా పెళ్లి అయిన మా చెల్లి సునీత, వాళ్ళ ఆయన
మస్తానయ్య మొదటి పండుగ కు వస్తున్నారు . ఏ విధంగా
చూసినా వెళ్లి తీరాల్సిందే .
''సరే వరంగల్ నుండి బయలుదేరి మా అత్తగారింటికి
వెళ్లి వాళ్లకు ఒక మాట చెప్పి పాపను తీసుకొని
మేము ఇద్దరం కోటకు వస్తాము '' చెప్పేసాను .
ఇక కోటలో సందడే సందడి . తాటాకులు తెప్పించి
ఎండలో పరిచేసారు . పండుగ కళ ఇల్లంతా ....
*******
చక్కగా అడుగులు వేస్తూ మాధురి ఇల్లంతా తిరుగుతుంటే
నవ్వులే నవ్వులు . పిన్నమ్మలు పక్కింటి వాళ్ళు
చెల్లెళ్ళు , తమ్ముళ్ళు ..... అబ్బ ఫస్ట్ పుట్టే వాళ్ళను
తిప్పటానికి ఎన్ని గుర్రాలో !
వచ్చే పోయే వాళ్ళ కామెంట్స్ ...
''ఏమి బుగ్గలే పిల్లకి ,మీ వాయుగుండ్ల వాళ్ళ బుగ్గలు
వచ్చేసాయి . మీ అత్తగారి ప్రింట్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి చెన్నూరు లో ''
అనటం . నేను టకామని దిష్టి తీయడం .
అయ్యో పాల బుగ్గలే కదా , ఎవరికైనా అలాగే
ఉంటాయి . స్కూల్ కి వెళితే ఉండవులే అనడం .
మొత్తానికి మామిడి తోరణాలు కట్టిన వాకిట్లోకి
భోగి పండుగ వచ్చేసింది . తెల్లవారకే ముందే
అందరం లేసేసాము . మా చెల్లి వచ్చి పాపను
లేపేసింది . దానికి అర్ధం కాక ముందు వెలుగుతున్న
మనిషంత ఎత్తు మంటను చూస్తూ నిద్ర ఇంకా ఉండేసరికి
కళ్ళు నులుముతూ ఉంది .
అందరు చుట్టూ చేరి మాధురి ... మధురి అని
నవ్విస్తూ ఉండేసరికి మెల్లిగా నిద్ర మత్తు పోయి
తాతయ్య దగ్గరకు పోయి చూస్తూ ఉంది .
మా మరిది గారు , ఈయన ''దామ్మా ... ఆకులు మంటలో
వేద్దాము ''అని పిలిచి ఎత్తుకోపోయారు .
భయంతో చేయి లాక్కొని వాళ్ళ తాతయ్య కు
చుట్టుకుంది .
''భయం లేదు చూడు మేము వేస్తున్నాము . ''
అని నేను చెల్లి తాటాకులు మంటలో వేసాము .
అయినా రావడం లేదు .
మెల్లిగా వాళ్ళ తాతయ్య ఎత్తుకొని చిన్న తాటాకు
దాని పిడికిలి సరిపోయేంత గా చూసి చేతిలో పెట్టాడు .
అటూ ఇటూ ఊపింది . నచ్చిందేమో ఊపుతూ
నవ్వుతూ ఉంది . మెల్లిగా తాతయ్య మంట దగ్గరకు
తీసుకేల్లి విసురు అన్నాడు . వేసేసింది .
నెలల పిల్ల గా ఉన్నప్పటి నుండి అంతే !
మా నాన్న మాట భలే వింటుంది .
చక చకా వాకిలి ఊడ్చి నేను , చెల్లి రంగులతో
ముగ్గు వైకుంట వాకిళ్ళు గీస్తూ ఉంటె చూస్తూ
మా చుట్టూ తిరుగుతూ ఉంది .
తరువాత అందరం తలంటు కొని కొత్త బట్టలు
వేసుకున్నాము . పాప గౌను అందరికి చూపించాలి
అని పిన్ని కూతుళ్ళు శిల్ప , సింధు , రేఖ
వచ్చి తీసుకొని వెళ్ళారు పాపని .
బిచ్చగాళ్ళకి బియ్యం , దోసలు అవీ వేస్తూ వంట
చేస్తూ అందరం బిజీ .
ఎప్పుడో ఖాళీ గా ఉన్నప్పుడు దీని పుట్టిన రోజు
సంగతి గుర్తుకు వచ్చింది . ఈ సారి కూడా
ఇరవయ్యో తేది స్కూల్ కి వెళ్ళాల్సిందే :(
మరి దీని పుట్టినా రోజు కోరిక ఎలా ?
దుఖానికి కారణం కోరికే అంటారు . కాని ఈ
చిన్ని ముచ్చట్లు కోరిక అవుతాయా ?
లేకుంటే దీనిని తీర్చుకోవాలి అని అంత
ఆలోచన ఎందుకు ?ఏమో పిల్లల మధ్య మూడేళ్ళు
గాప్ ఉండాలి అని ప్లాన్ చేసుకున్నాము కాబట్టి
పైసారికి రెండో వాళ్ళు వచ్చేస్తారు .
ఇక దీని ముచ్చట్లకు టైం ఎక్కడ ?
అమ్మ వినగానే
''సరే కానీ ఈ సారి కూడా
అందరిని పిలిచి భోగి పళ్ళు పోద్దాము ''చెప్పింది .
నాన్న వెంటనే గుమస్తాలను పంపి రేగు పళ్ళు
తెమ్మని పంపాడు .
వాళ్ళు మొత్తం తిరిగి
లేవంటూ వచ్చారు .
''ఇప్పుడెలా ?'' అందరం ఆలోచనలో పడిపోయాము .
(ఇంకా ఉంది )

3 comments:
very good narration.. we could see the sankranti sobha in your post. congrats. waiting for the next episode.
thanks hanumantha rao garu
ఈ పార్ట్ కూడా చాలా బాగుంది. మీ పండగ కళ్ళకు చూపించినట్లు రాసారు/
Post a Comment