పుట్టిన రోజు ముచ్చట (3)
మొదటి రెండు భాగాల లింక్ ఇక్కడ
(two parts link puttina roju muchchata )
హేమ మాధురికి బోగి పండుగ రోజు భోగి పళ్ళు పోయాలి అని
తాతయ్య వెంకటేశ్వర్లుగారికి అమ్మమ్మ నాగరత్నమ్మ లకు బోలెడు
ముచ్చట . అక్కడేమో రేగు పండ్లు దొరకలేదు . ఇంకేమి చెయ్యాలి .
నాకు ఏమి తోచలేదు . ఇంతలో మా నాన్నే అందరు గుమస్తాల్ని
పంపేసారు . ఎక్కడైనా వెతుక్కొని రమ్మని . చెట్లు కూడా ఎక్కడా
లేవు . పొలం లో ఏమైనా ఉన్నాయో ఏమో . ఇప్పుడు ఎక్కడ
వెతికేది ?చివరికి ఒకరు సంపాదించి తెచ్చారు . తీరా చూస్తే ఎన్ని !
రెండు దోసిళ్ళు . వాటితో ఎంత మంది పోయాలి ?చుట్టూ చుట్టాలే .
పెదనాన్న , బాబాయిలు ఇంకా చాలా మంది . ఏమి చేద్దాము ?
అమ్మ వైపు చూసాను . అమ్మ కూడా ఆలోచిస్తుంది .
చివరికి ఒక సర్దుబాటు చేసేసాము . ఆ రేగు పండ్లలోనే బోలెడు
పూల రెక్కలు ,అక్షింతలు కలిపింది అమ్మ . భలే ఉపాయం .
ఏదో ఆడవాళ్ళు ఇలా కనిపెట్ట బట్టి ఇన్ని పేరంటాలు , ఇన్ని
సందడులు ... వెరసి సంస్కృతులు . నిజానికి ఒక తరం నుండి
ఇంకో తరానికి ఇవన్నీ మోసుకెళ్లి భద్రంగా ఇచ్చేది వాళ్ళే .
సాయంత్రం అందరిని పిలిచి కూర్చో పెట్టి మాధురి ని చిన్ని కుర్చీ లో
కూర్చో పెట్టాము . ఏమి జరుగుతుందో దానికి తెలీదు కాని
ఏదో జరుగుతుందని దానికి అర్ధం అయింది . పలకరిస్తే చాలు
వాళ్ళ వైపు చేయి ఊపి నవ్వేస్తుంది . కాసేపు కూర్చుంటుంది .
కాసేపు పరిగెత్తుతుంది . అందరు మాధురి మా దగ్గరికి రా
అని పిలుపులు . ఇక స్కూల్ లో చదివే బాబాయి వాళ్ళ పిల్లలు ,
సువర్ణ , కాము , ప్రవీణ్ ,శిల్ప ,సిందు ..... అందరి కంటే చిన్నది
శ్రుతి రేఖ . ఎత్తుకోలేదు కాని ఆడిస్తుంది పాపని . వాళ్ళందరికీ
అక్క కూతురు అంటే ఒక ఆడుకొనే బొమ్మ లాగే ఉంది .
తాము పెద్ద అయిపోయిన ఫీలింగ్ . ఇక చెల్లెలు సునీత కు
హేమ అంటే బోలెడు ఇష్టం . అన్నీ దగ్గర ఉంది చూసుకుంటూ
ఉంది . పండుగ అన్నా పేరంటం అన్నా డబ్బు వెదజల్లడం కాదు
నవ్వులు వెదజల్లాలి . మనుషులతో , మమతలతో ఇల్లు
వెలిగిపోవాలి . పల్లెటూళ్ళలో అప్పుడు వాటికి ఏమి కొదవ లేని కాలం .
ఇరవై ఏళ్ళు దాటి వచ్చేసాము కదా . ఇప్పుడు పిలిస్తే అంత మంది రారు .
ఒకొక్కరు వచ్చి దోసిళ్ళతో బోగి పళ్ళు
తీసుకొని హేమ పైన పోస్తూ ఉంటె
జారుతున్నవి చూసి చప్పట్లు కొడుతూ ఉంది
పెళ్ళికి జారే తలంబ్రాలు చూస్తే ఇలాగే కొడుతుందా ?
ఏమో అప్పుడు కాసింత సిగ్గు వచ్చేస్తుందేమో .... చూడాలి .
పోసిన వాళ్ళు చిన్న చిన్న బహుమతులు ఇస్తూ ఉన్నారు .
పుట్టిన రోజు కాదు కదా ఎందుకు అన్నా వినడం లేదు .
చిన్న పిల్ల దగ్గరికి ఖాళీ చేతులతో ఏమి వస్తాము అని ఏదో
ఒకటి తీసుకొని వచ్చారు .
అమ్మా నాన్న వచ్చారు . అక్షింతలు వేసిన తరువాత బయటకు
చిన్న బహుమతి తీసింది అమ్మ . ఏమిస్తుంది ?చాలా కుతూహలంగా
ఉంది . మెల్లిగా హేమా చేయి తీసుకొని వేలికి తొడిగింది .
అరె !నీలం రంగు రాళ్ళతో చిన్నవంకీ ఉంగరం . నవ్వేసాను .
అది నాదే . చిన్నప్పటిది . ఎంతో భద్రంగా దాచి పెట్టి మీ అమ్మది
... మీ అమ్మ కూడా చిన్నప్పుడు ఇలాగే ఉండేది అని
గుర్తు చేసినట్లు ఇచ్చింది .
అమ్మ భలే గ్రేట్ . నా చిన్నప్పటి వన్నీ దాచుతుంది .
ఇంకా పిల్లలకు అవి ఎప్పుడు సంతోషాన్ని ఇస్తాయో
అప్పుడు ఇస్తుంది . నా బాల్యం , నా అల్లరి, కధలు కధలు
గా నవ్విస్తూ .... మీ అమ్మ ఇలాగ ,అలాగ అని మా పిల్లలకు
చెపుతూ ఉంటుంది . నేను కూడా వీళ్ళ పిల్లలకు ఇలాంటి
జ్ఞాపకాలు ఇవ్వాలి . ఎంత బాగుంది ఇలా దాచి పెట్టి మీ అమ్మది
అని చెప్పి అపురూపంగా ఇవ్వడం . అది ఫోటో కావొచ్చు ,
డ్రాయింగ్ కావొచ్చు , బహుమతి కావొచ్చు .... మీ అమ్మది
అంటే పిల్లలు ఎంత ఆనందంగా తీసుకుంటారో !
ఎర్రనీళ్ళు దిష్టి తీసేసి పాపను నిద్ర పుచ్చిన తరువాత మళ్ళా
అదే ఆలోచన . ఇంకేముంది .... ఈ ఏడాది కూడా పుట్టిన రోజు
చేయము . తరువాతి పుట్టినరోజుకు ఇంకొకరు వచ్చేస్తారు .
ఇక చేసేదేమీ లేదు అనుకున్నాను కాని దేవుడు దీని
మూడో పుట్టిన రోజు నిజంగా ఎంతో సంతోషం తో
అదీ వాళ్ళ తమ్ముడితో జరుపుకునేటట్లు ప్లాన్
చేసి ఉన్నాడని అప్పుడు తెలీదు .
(ఇంకా ఉంది )

1 comment:
అప్పుడే పెళ్లి వరకు వచ్చేసారన్న మాట. ఈ పార్ట్ కూడా బాగుందండి. ధన్యవాదములు.
Post a Comment