పుట్టిన రోజు ముచ్చట (1)
''వరంగల్ కి రిటర్న్ టికెట్స్ పంతొమ్మిది రాత్రికి బుక్
చేసాను '' శ్రీవారి మాటల్లో రిజర్వేషన్ దొరికిన ఆనందం .
వళ్ళో కూర్చున్న పదకుండు నెలల మాధురికి అన్నం పెడుతూ
ఆలోచనలో పడిపోయాను ..... మళ్ళా దీన్ని వదిలి ఉద్యోగానికి
వెళ్ళాలి . కనీసం కొంచెం పెద్దది అయినా తీసుకెళ్ళి
స్కూల్ లో చేర్చుకునేదాన్ని . ఎక్కడ హనుమకొండ ,ఎక్కడ
నెల్లూరు జిల్లా లోని చెన్నూరు . ఊరకనే ఇలా వచ్చి పాపను
చూసి అలా ఏమి పోతాము . అత్తగారింట్లో పాపకు ఏమి లోటు లేదు .
పెళ్లి కాని ఆడపడుచు ఇంకా అత్తగారు మామగారు ఈయన అమ్మమ్మ ,
పిన్నమ్మ , మరుదులు పాపను అపురూపంగా చూసుకుంటారు .
దానిని వదిలి వెళ్ళలేక నాకే బాధ . ఇవేమీ తెలీని పాప
హాయిగా నవ్వుకుంటూ వళ్ళో ఊగుతూ నవ్వుతూ ఉంది .
సరేలే వారం తరువాత వెళ్ళే దానికి ఇప్పటి నుండి ఎందుకు
దిగులు పడటం . బుజ్జి పిల్లతో ఆడుకోకుండా !
మొన్న పదకుండో నెలలో చేయించిన గుండు మీద చిన్నగా
వచ్చిన జుట్టు . అరె మొదటి పుట్టిన రోజుకు పూలు
కూడా పెట్టలేమే !...
''అవును మర్చే పోయాను, దీని పుట్టిన రోజు
ఇరవై తేది కదా! ఆ రోజు ఉండలేము కదా .
అయ్యో వరంగల్ లో ఉంటాము ఎలా ?
సంక్రాంతి సెలవలు తరువాత మొదటి పని దినం కాబట్టి
సెలవు పెట్టుకో కూడదు . ఇక పుట్టిన రోజు నేనేమి చేస్తాను ''
దిగులుగా అత్తమ్మ తో అన్నాను .
ఇంట్లో అందరు నిజమే కదా అన్నట్లు జాలిగా చూసారు .
''ఏముందిలే బోగి పండుగ రోజు అందరిని , బంధువులు ను
పిలిచి బోగిపళ్ళు పోద్దాము . పుట్టిన రోజు లాగే చేద్దాము ''
ఒక చిన్నసలహా చెప్పారు . కొంత వరకు తృప్తి . ఇక
ప్రతి పుట్టిన రోజుకు ఇంతే .
''సరే అలాగే అలాగే అరిసెలు మీద అడుగులు వేయిద్దాము .
చిలకలు పంచుదాము '' ఓక్కొక్క సలహా హుషారుగా కలిపారు .
పుట్టిన రోజున అడుగులు వేసారని అరిసెలు , పలుకులు
వస్తున్నాయని చిలకలు పంచేది సాంప్రదాయం .
అనుకోవడం ఎంత సేపు ,పిలుపులు ఎంత సేపు
.... బోగి పండుగ రోజు మా అమ్మావాళ్ళు , చెల్లి వాళ్ళు
చుట్టూ పక్కల వాళ్ళు సాయంత్రం హడావడి తో ఇల్లంతా
సందడి .
చిన్న ఉయ్యాల వేసి డెకరేషన్ చేసాము పాపకి
బోగిపళ్ళు పోయడానికి . చుట్టు పక్కల వారి సలహాలు ,
మాటలు ,పలకరింపులు .... ప్రతి ఒక్కరికి చేసినంత పని .
బుజ్జి పిల్ల మాత్రం ఇంత బుగ్గలు వేసుకొని ఉయ్యాల్లొ
ఊగుతూ నవ్వుతూ , వచ్చేవారికి చేయి తిప్పి టాటా
చెపుతూ .... నవ్వుల్ని పంచుతూ ఉంది . అమ్మ , అత్తమ్మ
రేగుపండ్లు తెచ్చి అక్షంతలు కూడా కలుపుతూ ఉన్నారు .
నేను చెల్లి కింద దుప్పటి పరిచి అరిసెలు సర్దుతూ ఉన్నాము .
ఇంతలో డుబుక్కున చిన్న శబ్దం . ఉలిక్కిపడి ఊయల వైపు
పరిగెత్తి చేతులు కింద పెట్టాను .
అందరిలో భయం . కింద పడుతున్న పాపని గబుక్కున
పట్టుకొని బుజానికి హత్తుకున్నాను . ఒక్క క్షణం
ఆలస్యం అయి ఉంటె పాప తల నేలకి ... ఊహు
ఊహించలేకపోయాను . ఇదేమిటి ఏడవటం లేదు .
కొంపదీసి భయపడిందా ?వళ్ళో వేసుకొని చూస్తే ...
దొంగ మొహం ఏమి జరగనట్లు పక పక నవ్వుతుంది .
అప్పుడే వచ్చిన రెండు పళ్ళు కనపడేటట్లు .
రాక్షసి దీనికి భయం లేదా !నేను నవ్వేసాను .
అందరు ఊపిరి పీల్చుకున్నారు .
మెల్లిగా అరిసెలు దగ్గర నిలబెట్టాము .
''అడుగులు వెయ్యి మాధురి '' అని అందరు
ఉత్సాహపరుస్తున్నారు .
దొంగమొహం రోజు గబ గబ వేసేది ఈ రోజు వేయనంటే
వేయదు . పై పెచ్చు అందరి వైపు చూసి బోసి నవ్వులు .
ఇక ఏమిటి చేసేది ?సరే నువ్వు సునీత పట్టుకొని
నడిపించండి ... అమ్మ సలహా . చేసేదేముంది అలాగే
చేసాము . ఫ్రాక్ బుట్ట లాగా ఎగురుతుంటే ఆవిడ
గారు మా వేళ్ళు తన చిన్న పిడికిళ్ళతో పట్టుకొని
బోడి గుండు గిర గిర తిప్పుతూ యువరాణి లాగా
అరిసెలు మీద అడుగులు వేసింది .
అమ్మమ్మ కి ,తాతయ్యకి , నాన్నమ్మ కి జేజి నాయనకు ,
మామ ,బాబాయిలు నాన్న ఒకరేమిటి అందరికి
వాళ్ళు మొదటి అడుగు వేసినంత సంబరం .
''నా తల్లే నా బంగారే .... అంటూ ముద్దులు కురిపించారు .
చక్కగా పీట వేసి కట్టిన ఉయ్యాలలో
కూర్చోపెట్టి ఒక్కొక్కరే వచ్చి
రేగుపళ్ళు అక్షింతలు వేసి
ఇచ్చిన స్వీట్స్, చాక్లెట్స్ ,
తాంబూలాలు తీసుకొని
అందరు వెళ్ళిపోయే వరకు ఇంట్లో బోలెడు అల్లరి ,
సందడి . బుజ్జి పిల్ల అంత గలభా లోనూ మెల్లిగా
తూగుతుంది .
''శశీ ఎర్ర నీళ్ళు దిష్టి తియ్యి . పాపకి నిద్ర వచ్చేస్తుంది ''
అలాగే అని చెప్పి తీసేసి బువ్వ పెట్టి నిద్రపుచ్చాను .
చాలా తృప్తిగా అనిపించింది . కాని ఏదో ఒక
మూల చిన్న అసంతృప్తి , దీని పుట్టిన రోజు ఇక ఎప్పుడు చెయ్యాలి ?
ఇక ఎప్పుడూ ఇలాగే సెలవలు అయిపోతాయి కదా అని .
(ఇంకా ఉంది )

3 comments:
adbutaha repu naku kuturu pudite techi mi dagara vadilestanu sister anni chuskondi mire
ha...ha...alage kitte. naku hema velli pothe bore koduthundhi, intlo pillalu leka...ichcheyyi mee papa ni :)
బలే ఉన్నాయే ఈ ముచ్చట్లు,ఈ పోస్ట్ నేను ఎలా మిస్ అయ్యానో ఇన్ని రోజులు.
Post a Comment