Wednesday 14 December 2011

నెమలీక......నవ్వు"లీక్"...2

మరేమో ఇప్పుడు చెప్పోచ్చేంది ఏమిటంటే .....
మా బుర్ర తినకమ్మా....పాయింట్ కు వచ్చెయ్యి అంటారా...
సరే....


మా మామ మా సంభందాన్ని కుదిర్చారు అని చెప్పను కదా...
నెమలీక....నవ్వు"లీక్" ౧.....మరి మేము మా వాళ్ళు

ఫిక్స్ అయిపోయారు...తరువాత జరిగిన కధ........


ఒక మంచి రోజు చూసి మా మామ,ఈయన ఇద్దరే పెళ్లి చూపులకు 
కోటకి వచ్చారు.(మరి మేము చదువుకున్న వాళ్ళం కదా .....
అందుకని మాకు చాయిస్ ఇస్తున్నట్లు బిల్డ్ అప్ )


నాకైతే పెద్ద సిగ్గుపడటం ఏమి లేదు కాని ఫస్ట్ సంబంధం కదా 
పెళ్లి చూపులు అంటే ఏమిటి అని కుతూహలం........
(ఈయనకు రెండోది ...వాళ్ళు ఇల్లరికం పంపమన్నారని 
మా అత్తగారు ఆ సంభందం చేసుకోలేదు)
మా చిన్న పిన్ని వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేసారు.మామయ్య
పెద్ద పిన్ని వాళ్ళ తమ్ముడే...ఇంకా నాకేమి భయం ........
(అసలు భయం మన డిక్షనరీ లోనే లేదు)


పాపం ఈయనకే బోల్డెంత టెన్షన్ (ఎక్కడ కుదిరిపోతుందో 
అని...ఉద్యోగం రాకుండా)...వీళ్లేమో ఏదో అడుగు బాబు...
అంటున్నారు....మనమేమో తల దించితే కదా......
ఎలాగో ఒక్క ప్రశ్న అడిగారు.....


"డిగ్రీ రీసెంట్ గా చేసారా?"అని....(మరి ఈయన ఇంజినీరింగ్ 
కోసం చానా ఏళ్ళు వదిలేసారు)


మనం వదిలిన తూటా లాగా...."అవును అండి....అన్నీ 
ఫస్ట్ క్లాస్ లే"ఒక్క నిమిషం లేట్ లేకుండా సమాధానం.


ఇంకేమి అడగకుండా 35 కి.మీ.....పరుగో...పరుగు...
ఎందుకా మరి చెన్నూరు అక్కడే ఉంది మరి........


వాళ్ళ అమ్మ "నచ్చిందిరా అమ్మాయి?" అని అడగగానే.....
ఈయన గారు గుక్క తిప్పుకోకుండా వల్లించేశారు...


"వై దిస్....శశికళ ....శశి కళ......డీ....
పిల్ల చూస్తె వైటు....వైటు......
చదువు బ్రైటు
ఆస్తి దేమిలే లైటు 
కాకపొతే స్టౌటు" 


మా అత్తగారు సరేలే పోనీ అన్నారు  అనుకున్నారా.....అక్కడే 
మీరు బస్తా పప్పు వండి దానిలో జర్రున ఈదినట్లు........


"హు...నీకేమి తెలీదు మేము పోయి చూసి వస్తాము" అనేశారు.


రెండో సారి మా అత్తగారు,బావగారు,తోడుకోడలు,మా మరిది 
వచ్చారు(పాపం ఈయనను తీసుకు రాలేదు ....బలి ఇచ్చే 
మేక అభిప్రాయం ఏంది అడిగేది అన్నట్లు).వచ్చి నన్ను 
చూసారు.పాట పాడమన్నారు.అసలైతే నేను పాటలు 
బాగా పాడేదాన్ని.....కాని నేను చడువుకున దాన్ని అన్న 
మాట మా పిన్నమ్మలకు......"మా అమ్మాయి పాడదు....
కావాలంటే ఒక లెస్సన్ చెపుతుంది"అనేసారు.
(నా మీద యెంత నమ్మకమో....ఎవరి ముందైన చెప్పేస్తాను అని)


సరే ఒక బుక్ చదివించండి అన్నారు(మన గొంతు వినాలి కదా)
చక్కగా చదివాను.


మా అత్తగారు తెచ్చిన పూలు,పండ్లు నాకు ఇవ్వటానికి 
నా దగ్గరకు వచ్చారు....చుక్క పెట్టి పూల పొట్లం తీసుకొని 
అది ఓపెన్ చేయటానికి దారం రాక అవస్తపడుతున్నారు.
నేను ఇటివ్వండి అని తీసుకొని ఓపెన్ చేసి ఇచ్చాను.
తరువాత పూలు జడలో పెట్టటానికి తంటాలు పడుతుంటే 
ఎంచక్కా హెల్ప్ చేసాను(మరి మనకు ఎవరికైనా హెల్ప్ 
చేయటమంటే బలే ఇష్టం)


(మరి అక్కడే నాకు బోల్డు మార్కులు వచ్చాయి వాళ్ళ 
దగ్గర నుండి....అయితే అది నాకు తెలీదు)


అంతే మా అత్తగారు ఇంటికి వెళ్లి మా వారికి క్లాస్స్ తీసుకున్నారు.
"అమ్మాయి చాలా హుషారు,చదువుకుంది,మంచి అమ్మాయి(?)
మీకిద్దరికీ ఉద్యోగాలు వస్తే చాలా సంతోషంగా ఉంటారు అని....."


మళ్ళ మా వారు.....వై...దిస్....శశికళ....శశికళ....డీ.....


వెంటనే మా అత్తగారు "జుయ్"అని అశ్వనినాచప్పలా
పరిగెత్తి వెళ్లి .....తిరిగి వచ్చి ఒక పోటో మావారి చేతిలో 
పెట్టారు.......అది ఆమె భావగారిని చిన్నప్పుడు ఎత్తుకొని 
తీయించుకున్న పోటో...."చూడురా నేను పెళ్ళికి ముందు 
ఎలా ఉన్నాను ....అన్న పుట్టిన తరువాత ఎలా ఉన్నాను...
మేము సంతోషంగా లేమా.....గుణం కావాలి కాని"అన్నారు.





(మావారితిక్కకుదిరింది......లేకుంటే నిండు జాబిలికి నెలవంక లా లేదని వంక పెడతారా?)


అక్కడ మా మామగారు ఆల్రెడీ మా నాన్నను చూసి ఫిక్స్ 
అయిపోయారు.


(అదంతే వాళ్ళు నాన్నలనే చూస్తారు)


ఇక వాళ్ళ తమ్ముడు ..అంటే మా మరిది ,మా వారికంటే 
ఒక సంవత్చారం చిన్న అంతే...ఇద్దరు ఫ్రెండ్స్ లా ఉంటారు.
"అనా చేసుకో,ఇద్దరికీ జాబ్స్ వస్తే నీ లైఫ్ ఎలా ఉంటుందో 
చూడు"అని గట్టిగా చెప్పేశారు.


ఇంకేమి చేస్తారు పాపం.....
కళ్ళలో ప్రాణాలు పెట్టుకొని అందరి వైపు దీనంగా ఒక 
లుక్ ఇచ్చారు.....ఊహు....ఎవ్వరు కరగలేదు.......
అలా ఆయన్ని ఫిక్స్ చేసేసారు వాళ్ళు.
(ఇప్పటికి రెండు అన్కాలే చెప్పాను కదా....ఇంకా మూడో 
అంకం ఉంది...అది ఎప్పుడైనా)


ఏమిటి మీవారు ఇంకా....కొలవారి..డీ ఏనా ...అంటారా?
కాదులెండి.....ఇలా పాడుతుంటారు ఇప్పుడు.........


మల్లెపూలు జడను పెట్టి ,మొగలిరేకులు 
జడకు చుట్టి ,హంసలా నడిచి వచ్చా .....మావయ్యా....
నీకు కట్నం యెంత కావాలో చెప్పయ్యా........అని నేను అంటే.....


అద్దమంటి మనసు ఉందీ ,అందమైనా సొగసు ఉందీ...
ఇంతకన్నా ఉండేదేంది చిట్టెమ్మా
నువ్వే నాకు కట్నమమ్మా చిట్టెమ్మా........అంటారు...


అంటే ఇంత బాగా అనటం ఆయనకు రాదు లెండి....
నేనే మీకోరకు అమందానంద కందళిత హృదయానందనై, 
తదీయ భావార్ద సారమేల్ల మాధుర్యమున తేలించి 
పూసౌరభాముల ముంచి ,శరత్చంద్రికా శీతాంశ కిరణాల 
దొర్లించి,కోయిల  కూజితముల రవళించి,మదీయ కలము 
హృదయాన అక్షరముగా విరియించి,భావశకలాలను
ఈ పోస్ట్ యందు విరాజిల్లచేసితిని.


మరి ఆయన ఏమి వచింపరా?అంటే....కళ్ళతో....నవ్వుతో 
వచియించేదారు.....కొండొకచో హృదయముతో కూడా.....


హా.....మరిచితిని ....వారు ఆవేశం వచ్చినపుడు "కావి" లు 
చెప్పెదరు.అవి ఏమిటి అంటున్నారా?కావి ...లు అంటే 
కాపురం లో చెప్పేవి . ఏమిటి ఒక్కటి చెప్పమంటారా?


శశి నాకు కవిత చెప్పాలనుంది నీ మీద అనగానే .....
నా కళ్ళ లో భయం.....నా వళ్ళంతా వణుకు.......


అప్పుడు గాని కాళిదాసు గారు నన్ను చూస్తె"కవితా భీత 
హరితెక్షణ"అంటారు......శ్రీ.శ్రీ.గారు చూస్తె....."కవితా పీడిత 
తాడిత ,ఓడిత,నారి"...ఇంకా ఎందుకు నిలుచుంటావు?
పొమ్ము  ముందుకు పొమ్ము దూరంగా...పొమ్ము  ముందు ...
అంటారు.....ఇక గిరీశం గారైతే ....ఫుల్లు మూన్ వైటట....
కవితేమో సంకట.....శశి పరిస్తితి వాట్ అట.......అనేస్తారు.


అయినా సరే ఒకటి చెప్పాల్సిందే అంటారా?
సరే మీ విధి మిమ్మల్ని అలా అడిగిస్తుంది........


"చలికాలం లో దుప్పటి నువ్వే 
ఎండాకాలం లో ఏ.సి.నువ్వే 
నా జీవితానికి సిలబస్ నువ్వే 
కొన్ని నవ్వులు ఇచ్చి పాస్ చేయ్యేవే"


"కెవ్వ్ ..వ్వ్...వ్వ్....వ్వ్...."నేను చెప్పానా ఎవరో పడిపోయారు?
వాళ్ళను లేపండి ముందు.......

23 comments:

Anonymous said...

Wonderful! Yours is one of the blogs I regularly read. This is my first comment here :)

~Lalitha TS

రాజేష్ మారం... said...

:) Superb :)

రాజ్యలక్ష్మి.N said...

"(పాపం ఈయనను తీసుకు రాలేదు ....బలి ఇచ్చే
మేక అభిప్రాయం ఏంది అడిగేది అన్నట్లు)"
భలే చెప్పారండీ :)

kiran said...

sooooooooooparoooooooooooooooo sooooooooooooooooooooooooooparuuuuuuuuuuuuuuuuuu :D
నవ్వుతూనే ఉన్నాను ..
(మావారితిక్కకుదిరింది......లేకుంటే నిండు జాబిలికి నెలవంక లా లేదని వంక పెడతారా?) -- ఇక్కడ చాలా ఘట్టిగా నవ్వేసాను :)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

"అక్కడే మీరు బస్తా పప్పు వండి దానిలో జర్రున ఈదినట్లు"
నిజంగానే పప్పులో పడి ఈదుతూ నవ్వుతున్నాను :-))))

రెండవ భాగంకూడా బాగుంది. మూడో భాగంకోసం వేచియుంటము.....

సిరిసిరిమువ్వ said...

:))

Unknown said...

ఈ పోస్ట్ లు ఇంకా ఇంకా చదవాలని అనిపిస్తోంది.
శశి నాకు కవిత చెప్పాలనుంది నీ మీద అనగానే .....
నా కళ్ళ లో భయం.....నా వళ్ళంతా వణుకు.......
ఇది మాత్రం ఖండిస్తున్నాను.
మా బావగారు చెప్పే కవితలు అంత భయపెదతాయా ఏంటి ?
ఇక నుంచి మీరు రోజుకి ఒక కవిత విని మాకు చెప్పండి

శేఖర్ (Sekhar) said...

మీ గురుతులు చాల బాగున్నాయి...ఈ కాలం లో ఇలాంటి వి లేవు రేపటి కాలం లో గుర్తు పెట్టుకోవటానికి....
లక్కీ తరం ...

వేణూశ్రీకాంత్ said...

హహహ బాగుందండీ :-))

హరే కృష్ణ said...

కవితా పీడిత
తాడిత ,ఓడిత,నారి"...ఇంకా ఎందుకు నిలుచుంటావు?
పొమ్ము ముందుకు పొమ్ము దూరంగా...పొమ్ము ముందు ...
అంటారు.....ఇక గిరీశం గారైతే ....ఫుల్లు మూన్ వైటట....
కవితేమో సంకట.....శశి పరిస్తితి వాట్ అట.......అనేస్తారు.

ROFL
As usual your post rocks \m/

వనజ తాతినేని/VanajaTatineni said...

:)))))))
Kya baat hai...!!!!!!!!
Super...

Intakee..Nelavanka ayyyaaraa?
yeppudu..Poorna chandrudenaa?

కొత్తావకాయ said...

మంచి హాస్యరసపోషణ చేసితిరి కవితా భీత హరిణేక్షణా! నిండు జాబిలికి నెలవంకలా లేదని వంక పెడతారా..? :) నాకు బాగా నచ్చేసింది. భలే!

నీహారిక said...

అదంతే వాళ్ళు నాన్నలనే చూస్తారు!!
They are very intelligents you know ?

శశి కళ said...

lalita gaaru thanku and ur welcome.


rajesh gaaru,raaji...thanku)))



kiranoooooooooooooothankuuuuuuuuuuu

శశి కళ said...

అవినెని గారు...తప్పకుండా మూడొ అంకం వ్రాస్తాను.
ఈ కాలం పిల్లలు పెళ్ళి అంటె వాళ్ళ్ళకు మాత్రమె సంభదించింది అనుకుంటున్నారు.అది రెండు కుటుంభాలను
యెలా కలుపుతుందొ వాళ్ళకు తెలియాలి.థాంక్యు.

సిరి సిరి మువ్వ గారు థాంక్యు.

శశి కళ said...

శైలూఊఊఊఊఊఊఊ.....మీ భావ కవితలు నచ్చాయా?అయినా సరె నీకు వినిపించను...
చదువర్లు ఒక మంచి రచయిత ను కొల్పొతారు...
నువ్వు అవి చదివితె...)))))))))


శెఖర్ గారు ఇప్పుడు కూడా పెళ్ళ్ళీ చూపులు ఉన్నాయి.
గుర్తులన్నీ బధ్రపరుచుకొండి.థాంక్యు

శశి కళ said...

వెణు,ఆండి....థాంక్యు.


వనజ గారు ఇలాటివి ఇక్కడ అదగకూడదు....
నిజం నిష్టోరంగా ఉంటుమ్ది....థాంక్యు

శశి కళ said...

కొత్తావకాయ గారు....బలె బలె నచ్చినందుకు థాన్క్యులు


నీహారిక గారు థాంక్యు

జ్యోతిర్మయి said...

"ఇక గిరీశం గారైతే ....ఫుల్లు మూన్ వైటట....
కవితేమో సంకట.....శశి పరిస్తితి వాట్ అట"
హహహ..బాగు బాగు...

PALERU said...

ఆ పడిపోయింది నేనే......నన్నే అందరు కలిసి లేపారు...ఇప్పుడే లేచాను...కొంచెం తేరుకున్నాక ..కామెంట్ పెడతాను లెండి మేడం గారు ..................అస్సలు ....:):(

శశి కళ said...

జ్యొతిర్మయీ గారు,రాఫ్సన్ గారు థాంక్యు

లత said...

మీ పెళ్ళి ముచ్చట్లు బావున్నాయండీ ,సరదాగా రాస్తున్నారు

శశి కళ said...

latha gaaru thanku