Tuesday, 27 December 2011

నెమలీక......నవ్వు"లీక్"3

మా అత్తగారు వాళ్ళు నన్ను చూసి వెళ్ళిన తరువాత 
పెద్ద పండుగ అంటే సంక్రాంతి వచ్చేసింది.వాళ్లకు 
మాకు కూడా కిరాణషాప్స్ ఉన్నాయి కాబట్టి ఆ సీజన్ లో 
అందరం బిజి .తరువాత మా వాళ్ళు వెళ్లి వాళ్ళతో అన్ని 
మాట్లాడుకొని వచ్చారు.
ముచ్చటగా మూడో సారి మా పెద్ద మరిది గారిని తీసుకొని 
మా మామ గారు వచ్చారు నన్ను చూడటానికి.
నేను "నమస్తే"అని చెప్పాను.అయన నన్ను చూసి 
"మా వాళ్ళందరికీ నువ్వు నచ్చావమ్మ......మా అబ్బాయి 
రిజల్ట్స్ వచ్చాయి....సెకండ్ వచ్చాడు "అన్నారు.

బాబోయ్ సెకండ్ అనుకున్నా...తరువాత తెలిసింది 
సెకండ్ క్లాస్స్ అని...(నాకు ఫస్ట్ క్లాస్స్ ...ఇష్ చెప్పకూడదు 
ఆడపిల్లలం కదా)తరువాత పోటీ పరీక్షలకి వారె నాకు 
కోచింగ్ ఇచ్చారు ..అది వేరే సంగతి........
మా నాన్న వాళ్ళు మా మామగారితో మాకు నిశ్చితార్ధం 
అలవాటు లేదు ,లగ్న పత్రికలు మార్చుకుందాము అన్నారు.
సరే అని వాళ్ళు మార్చుకొని పెళ్లి మార్చ్ లో అని నిశ్చయించుకొని 
వెళ్ళిపోయారు........ఇంకా ఏముంది ?తరువాత...పప్పన్నమే....


 ఇక్కడ మా మామగారి గూర్చి చెప్పుకోవాలి.
చనిపోయి ఎక్కడ ఉన్నారో గాని మేము 
శెలవలకువస్తే "మీరు వస్తేనే కళ అమ్మా"అనేవారు.
కోడళ్ళను కూతుర్లు లాగా చూసుకొనే వారు.
ఆయన ఏడేళ్ళ వయసులో వాళ్ళ అక్క పెళ్లి 
చేసుకొని వస్తుంటే వాళ్ళతో వచ్చేసి ,
వాళ్ళ అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు.
మా అత్తగారు వాళ్ళు ఐదుగురు 
అక్క చెల్లెళ్ళు,ఒక్క తమ్ముడు ...అందరికి పెళ్ళిళ్ళు ,పురుళ్ళు 
అన్నీ ఈయనే చేసారు.మా మామగారు వాళ్ళు 
ఐదు గురు అన్నదమ్ములు ,ముగ్గురు అక్క చెల్లెళ్ళు....
ఇంకా చూడండి బందువులు యెంత మం...దో......
ఇంత మందిలో,ఇన్ని బాధ్యతలలో నన్ను మా నాయన 
ఎలా ఇచ్చాడో?


బహుశ ఇన్ని మమతాను బంధాల అల్లికలోనే 
కోహినూర్  శోబిస్తుంది అని కాబోలు.....

అబ్బో.....శశి కళ కోహినూరా......అంటే నా సమాధానం ఒక్కటే....
"తానె ఎరుపు అమ్మాయి తన వారిలోన"


"ముచ్చటైన పాపను చూసి 
మురుసుకుంటూ 
కాలి పట్టీల గల గలలు 
అరికాళ్ళలో పెదాల స్పర్శ నుంచి 
మీసాల గిలిగింతకు 
పాప నవ్వితే ....ముత్యాలు ఏరుకునే 
తండ్రి నడగండి.....కూతురు ఎవరని....లంగా,ఓణి లో మురిసిపోతూ 
పాపటి బిళ్ళ కావాలి నాన్నఅని అడిగితె 
వెచ్చని ఊపిరిని ముచ్చటగా పాపటిలో 
అద్ది పొంగిపోయే తండ్రిని అడగండి ....
కూతురు ఎవరని.... 

పతి పక్కన పత్ని గా మారి 
కాటుక కంటిలో కన్నీళ్లు నింపిన
కన్నకూతురిని చూసి 
ప్రేమతో మనసు చెదిరిన 
తండ్రి నడగండి....కూతురు ఎవరని....


మమతల మాలలు మనసుకు హత్తుకుంటూ 
చెపుతారు ......వరాల మూట....వజ్రాల తునక అని....

అమ్మ నాన్నల ప్రేమ కు ఏ షరతులు ఉండవు.
ఇంకా మనలో లోపాలు పెరిగే కొద్ది మిగతా పిల్లలను 
వదిలి మనకే అండగా నిలబడుతారు.మిగతా వాళ్లకు 
చెపుతారు "మీకేమి రా మీకు అన్నీ ఉన్నాయి....
పాపం వాళ్ళకే...మేము వాళ్ళతోనే ఉంటాము"అని.
నువ్వు ఇలా ఉంటేనే  ప్రేమిస్తాము అనే సంగతి ఆ ప్రేమ 
లో ఉండదు.
మా వారు అంటారు"నేను నిన్ను ఇంత బాగా చూసుకుంటున్నా 
కదా....ఇంకా మీ అమ్మ,నాన్నలనే కలవరిస్తావే?"అని.....
నేను అంటాను"వాళ్ళు ఇరవై ఏళ్ళు సాకారు కదా....
మీరు అన్నేళ్ళు చూడండి ...అప్పుడు చెపుతాను "అని.


సమస్య ఏమిటంటే మొన్న మార్చ్ కి ఇరవై ఏళ్ళు అయిపోయినాయి.
ఇప్పుడేమి చెపుతున్నావు అంటారా?
పెద్దగా ఏమి లేదు......ఏమి కారణం చెప్పాలా అని 
ఆలోచిస్తున్నాను....తల్లి తండ్రి ప్రేమకు విలువ కట్టగలమా?

21 comments:

గీత_యశస్వి said...

20 ante iddaru samanam kabatti ekkuva ayyaka cheputhanu anandi saripothundi. thalli dandrula prema ki viluva kattagalama. idi matram 100% correct.

శశి కళ said...

geeta gaaru...thank u so much for giving idea....

రాజ్ కుమార్ said...

వావ్.. తండ్రీ కూతుళ్ళ మీద రాసిన లైన్స్ మీరు రాసినవేనాండీ అద్భుతం గా ఉన్నాయ్.
సూపరు..

రాజి said...

"పతి పక్కన పత్ని గా మారి
కాటుక కంటిలో కన్నీళ్లు నింపిన
కన్నకూతురిని చూసి
ప్రేమతో మనసు చెదిరిన
తండ్రినడగండి....కూతురు ఎవరని...."

శశి గారూ చాలా బాగా చెప్పారండీ..
నిజమే..తల్లిదండ్రుల ప్రేమకి విలువ కట్టలేమండీ.

శేఖర్ (Sekhar) said...

శసి గారు మీ మాటలు చాల బాగున్నాయి....
ఇలా ఇంత పదపొందిక తో ఎలా రాస్తరండి ....
నాకు భలే నచ్చింది

హరే కృష్ణ said...

ముచ్చటైన పాపను చూసి
మురుసుకుంటూ
కాలి పట్టీల గల గలలు
అరికాళ్ళలో పెదాల స్పర్శ నుంచి
మీసాల గిలిగింతకు
పాప నవ్వితే ....ముత్యాలు ఏరుకునే
తండ్రి నడగండి.....కూతురు ఎవరని....లంగా,ఓణి లో మురిసిపోతూ
పాపటి బిళ్ళ కావాలి నాన్నఅని అడిగితె
[Image]వెచ్చని ఊపిరిని ముచ్చటగా పాపటిలో
అద్ది పొంగిపోయే తండ్రిని అడగండి ....
కూతురు ఎవరని....

పతి పక్కన పత్ని గా మారి
కాటుక కంటిలో కన్నీళ్లు నింపిన
కన్నకూతురిని చూసి
ప్రేమతో మనసు చెదిరిన
తండ్రి నడగండి....కూతురు ఎవరని....


మమతల మాలలు మనసుకు హత్తుకుంటూ
చెపుతారు ......వరాల మూట....వజ్రాల తునక అని....


keka sasi garu

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఇద్దరు పిల్లలని పెంచుతున్నారు కదా ఇప్పుడు మీ వారు ఆ ప్రశ్న అడగరు లెండి.

నాన్నగారి మీద కవిత చాలా బాగుందండీ.

వేణూ శ్రీకాంత్ said...

బాగుందండీ.. నిజమే ఎన్నేళ్ళైనా అమ్మనాన్న ల ప్రేమతో పోల్చలేం.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ said...

పాట బాగుందండి. పాడి రికార్డ్ చేసి పెట్టరూ? విని తరిస్తాము :-)

Anonymous said...

శశి గారు : ఏం చెప్పాలో తేల్చుకున్నాకా నా చెవిన వెయ్యండి . ముందు ముందు పనికొస్తుంది . అప్పుడు నేను తడుముకోనక్కరలేదు .

kallurisailabala said...

ఓ అమ్మాయి...

నీకు ఆకలి వేస్తె అమ్మలా
మా అబ్బాయి గోరు ముద్దలు పెడతాడు

అలక వస్తే
నాన్నై బుజ్జగిస్తాడు

అధికారం చూపిస్తే
అన్నలా తలవంచుతాడు

కోపమొస్తే
తాతయ్యల తల్లడిల్లుతాడు

నువ్వుబుంగ మూతి పెడితే
నిన్ను నవ్వించే నానమ్మ అవుతాడు

నీ మనసు భారమైతే
పంచుకునే నీస్తం అవుతాడు

ఓ అమ్మాయి
నీ అరచేత పండిన ముద్ద మందారం మా అబ్బాయి

నీలో చల్లని మనసు
ఆ మనసులో కొండంత ప్రేమ
బోలెడంత అమాయకత్వం ఉంటె చాలు మాకు
మా అబ్బాయి చెయ్యి పట్టుకోవచ్చు
మల్లెపువ్వు ని చేసి తలలో తురుముకోవచ్చు
మంగళ సూత్రంలా గుండెల్లో దాచుకోవచ్చు
అనక సన్నజాజిని చేసి సిరులు పండించుకోవచ్చు .

శశి అక్క ఇది బావగారికి కూడా వర్తిస్తుంది అని అనుకుంటున్నా ఈ సిరీస్ అప్పుడే ఆపకండి. ఇంకా బోలెడు చదవాలని ఉంది.

శశి కళ said...

నీహారిక గారు...పెదాల స్పర్శ సరి అయినది.
యెన్దుకంటె పసి పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలను
అరి కాళ్ళ లొ ముద్దు పెడతారు.

శశి కళ said...

రాజ్...యెమంటివి?యెమంటివి?....


రాజీ గారు,శెఖర్ గారు థాంక్యు.


ఆండి...మొత్తం కవిత పెట్టావా కామెంట్లొ...థాంక్యు

శశి కళ said...

బులుసు గారు,గుర్తు చెస్తూనె ఉంటాను...మీకు కూడా
అమ్మాయి ఉంది...కొన్ని రొజులలొ అల్లుడు మీకు
వస్తాడు..అని...అబ్బొ మా అల్లుడిని యెలా చూస్తనొ
చూడు అంటారు....మళ్ళా మామూలె...యెన్దుకు
నీకు కొట అంటే ఇష్టం అంటారు.

శశి కళ said...

వెణు...థాంక్యు.


అవినెని గారు,మీరు స్వరపరుస్తాను అంటె మొత్తం
కవిత పంపుతాను.కావాలంటె మా పాపె పాడుతుంది.
థాంక్యు.


శైలూ...థాంక్యు...నీ కవిత బావకు చూపీమంటావా?

శశి కళ said...

లలిత గారు ,తప్పకుండా...థాంక్యు

మాలా కుమార్ said...

మీ కవిత బాగుందండి .

శశి కళ said...

మాలా కుమార్ గారు థాంక్యు

kiran said...

హహ్హహహహహహాహహ్హహ...
నేను మీకు ఒక మంచి ఐడియా చెప్తా ...నా పిల్లలకు 20 వరకు నేనుంటా అని చెప్పండి...
ఆ తరువాత..మనవలకు..మనమరాళ్ళకు...20 ..
అసలు మీరు కేక రాసేస్తున్నారు...కూతురి గురించి రాసిన ప్రతి line కేక :D

మధురవాణి said...

శశి గారూ,
మీ నెమలీక కబుర్లు చాలా బాగున్నాయి. మొత్తం మూడు పోస్టులూ చదివేసాను. మీ పెళ్లినాటి జ్ఞాపకాలు, మీ శ్రీవారి కవితా సూపర్.. :)
అమ్మానాన్నల ప్రేమ గురించి అందంగా చెప్పారు. నిజమే.. ఈ ప్రపంచంలో వాళ్ళ ప్రేమని మించింది మరొకటి ఉండదు. Very well said! :)

శశి కళ said...

మధుర...థాంక్యు