Friday 2 December 2011

గ్లీకు వీలుడు.....నా లాకుమాలుడు....

రండి...రండి...దయ చేయండి...
తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ....


ఏమిటి వెతుకుతున్నారు?గ్లీకు వీలుడి కోసమా?


వాడు ఎవరో కాదండి మా అబ్బాయే...ఈ రోజు వాడి 
పుట్టిన రోజు అందుకని వాడికి చిన్నప్పటి సంగతులు 
గుర్తు చేస్తూ ఈ పోస్ట్.


ముందు క్రింద ఉండే పోటో చూసెయ్యండి.
తరువాత దాని కధ చెపుతాను.




అదుగో...సుమో మీద పడుకొని ఉండే బుజ్జిగాడే 
మా గ్లీకు వీరుడు.


ఇది మూడో సంవత్షరం పుట్టిన రోజు పోటో.
పిల్లల మొదటి పుట్టిన రోజు మన సంతోషానికి.....
మూడో పుట్టిన రోజు వాళ్ళ సంతోషానికి .......
ఎందుకంటె అప్పుడు వాళ్లకి ఉహ తెలిసి ఉంటుంది 
కాబటి ప్రతిది బలే ఎంజాయ్ చేస్తారు.


అప్పుడు వాడు మా అమ్మా వాళ్ళ దగ్గర ఉండే వాడు.
ఈ పుట్టిన రోజుకి మూడు రోజుల ముందు జరిగిన సంగతి.


ఆ రోజు ఉదయం దేవుడి గూడు ముందు కూచొని 
మా అమ్మ ఆరునెలల పిల్ల వాడు మా తమ్ముడి కొడుకుని 
వాళ్ళ కూర్చో పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంది.
వీడు పక్కనే నిలబడి చూస్తూ ,అమ్మ చెప్పే శ్లోకాలు 
ముద్దుగా పలుకుతూ ఉన్నాడు.


ఇంతలో....గూటి తలుపుని మా తమ్ముడి కొడుకు 
కాలితో తన్నాడు.అది కొంచం కదిలింది.దాని పక్కనే 
పాలు కాగపెట్టుకొనే కుంపటి ఉంది.....కుంపటి తెలుసా 
అండి ?దానిలో బొగ్గులు వేసి పైన వంట చేసుకుంటారు.


దానిపై పాలు మరుగుతూ ఉన్నాయి.అవి మా నాన్న 
కోసం కాగ పెడతారు.అలా ఎర్రగా కాగిన పాలు చల్ల 
వేస్తేనే మా నాన్నకు పెరుగు తింటారు(మాకు కూడా 
ఆ మీగడ,పెరుగు దండిగా పెడుతుంటాడు)


ఆ కుంపటి దొర్లి పోయి పాలు నేల అంతా పరుచుకున్నాయి 
పొగలు వస్తూ...మా అమ్మ భయం తో  ఉలిక్కిపడి 
"నివాస్ వెనక్కి వెళ్ళు"అని పెద్దగా అరిచింది.


వీడు భయం గా వెనక్కి వెళ్ళబోయి జారి ముందుకి 
పాలల్లో కుడి వైపుగా పడిపోయాడు,ఈ లోపల మా 
తమ్ముడి కొడుకు మా అమ్మ వళ్ళో నుండి పక్కకి 
దొర్లి పాలల్లో పడిపోయాడు.


ఆమె పెద్దామే.లేసి గబా గబా ఇద్దరినీ తీసుకెళ్ళి పక్కన పెట్టి 
నీళ్ళతో కడిగి చూస్తె ....అబ్బ...ఎందుకులెండి......


మా తమ్ముడి కొడుకుకి నడుము పైన పాలు పది కాలి 
వాడి బంగారు మొల గజ్జెలు అచ్చు లాగా పది పిందెలు 
పడిపోయాయి.
మా బాబు కుడి వైపు కాలు చెయ్యి కాలి బొబ్బలు వచ్చాయి.


నేను ఇక రాత్రి అంతా వాడికి సేవలు చేస్తూ కూర్చున్నాను.
ఇక వాడు పడుకోవాలంటే ఎలా?పొరపాటున కుడి వైపుకి 
తిరిగితే......ఇంకేమి చెయ్యాలి?రాత్రంతా వాడిని నా పొట్టకు 
కరిపించుకొని అలాగే పడుకున్నాను.మధ్యలో లేచి చూస్తూనే 
ఉన్నాను.అలా మూడు రోజుల తరువాత వాడి పుట్టిన రోజు 
వచ్చింది.


(మరి యెంత కష్టపడి పిల్లలను పెంచుకుంటాము.
మీరు అలాగే అమ్మకి,దేశానికి సహాయం చేసి మంచి పేరు 
తేవాలి) 


వాడికి అంతకు ముందే నే పుట్టిన రోజుకి ఫాంట్ వేస్తాను 
అని చూపించాను.పాపం వాడికి ఆశ పెడితిని.ఆ బొబ్బల 
మీద ఫాంట్ ఎలా వేయాలి?డాక్టర్ కి చెప్పి లైట్ గా 
బాందేజ్ వేయించి దానిపై ఫాంట్ వేసాను.


అప్పుడు గ్రీకు వీరుడు పాట ఫేమస్ .మరి అలాగా విమానం పై 
కూర్చో పెట్టి పోటో తీయ లేము కదా..అందుకని సుమో పై 
కూర్చో పెట్టి పోటో తీయించాము.


మరి ఆ అమ్మాయి ఎవరు అంటారా?


నాకు నచ్చింది.ఎక్కడ ఉందొ ఏమో?
ఇంకో ఆరేళ్ళ తరువాత మీరందరూ కలిసి వెతికి 
పట్టుకోచ్చేయ్యండి....


మీ కష్టం ఉంచుకోము......ఎంచక్కా పప్పు భోజనం 
పెట్టిస్తాము....

16 comments:

ఆ.సౌమ్య said...

మీ గ్లీకువీరుడికి యాపీ యాపీ బత్తడే!
అబ్బ చిన్నప్పటి పాలు పడడం చదువుతుంటే బాధగా అనిపించింది :(
మీ అబ్బాయి పేంటు సూపరు..తను ఇలాగే మంచి మంచి పోజులిస్తూ, హాయిగా నవ్వుతూ, తుళ్ళుతూ కలకాలం జీవించాలని ఆశీర్వదిస్తున్నాను :)

రాజేష్ మారం... said...

Birth Day Wished to Nivas . ..

రాజేష్ మారం... said...

Nice Post .. . :)

వనజ తాతినేని/VanajaTatineni said...

శశి గారు.. బాబుకి.. (నివాస్ అనుకుంటాను..పేరు.) పుట్టిన రోజు శుభాకాంక్షలు..నా దీవెనలు అందించండి.
ఆరేళ్ళకు పప్పన్నం పెడతానని అనడం నవ్వు తెప్పించింది ..మీ ఇష్టమేనా ఏమిటీ? బ్లాగ్ లో పోస్ట్ అయితే మీ ఇష్టం ప్రతి పోస్ట్..మీ స్టైల్ లో భలే రాస్తారు. అమ్మాయి అయితే.. ఇంకొకరి ఇష్టమా? మీ అబ్బాయికి వదిలేయండీ!:)))))))))

యశోదకృష్ణ said...

same incident naa life lo kooda, nenu, chelli ilage padipoyamu. nenu chelli meeda padatamtho thanaki ekkuva kaalipoyindi. naaku koncham thakkuva. amma, thathayya chethula meeda mosaru. appudu intha antibiotics kooda levu. papam chaala badha paddaru. idi chadavagaane adi gurthukochhindi.

mee babu ki birthday wishes.

వేణూశ్రీకాంత్ said...

హహహ cute :-) మీ గ్లీకు వీరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు దీవెనలు :-)

శశి కళ said...

సౌమ్య గాలు...చాక్లెత్తులు ఇవిగొండి.
థాంకులు.


thank u rajesh gaaru,vanaja gaaru,


geeta gaaru anduke pillalu unnavaaru
jaagrattagaa undaali.maa naanna gaaru inta varaku intlo kumpati veliginchaneeledu ippativaraku...

హరే కృష్ణ said...

So cute!
Many Happy Returns of the Day :)

మధురవాణి said...

మీ గ్లీకు వీలుడికి హేప్పీ హేప్పీ బర్త్ డే! తనిలాగే మరెన్నో పుట్టిన రోజులు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నా.. :))
పిల్లల చిన్నప్పటి ఫోటోలు భలే అందంగా ఆల్బం చేసారు మీరు.. చాలా బావుంది.. :)

జ్యోతిర్మయి said...

మీ రాకుమారుడికి పుట్టిన రోజు సుభాకాంక్షలండీ..

శశి కళ said...

thanku madhura,andy,jyoti gaaru

శేఖర్ (Sekhar) said...

శశి గారు మీ గ్రీకు వీరుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు .హ్యాపీ గ ఉండాలని కోరుకుంటున్నాను

మాలా కుమార్ said...

మీ గ్లీకు వీరుడి కి పుట్టినరోజు శుభాకాంక్షలు .
( సారీ రెండు లు ఆలశ్యంగా చెపుతున్నందుకు )

శశి కళ said...

venu,sekhar gaaru,maalaa kumar gaaru
thanku

PALERU said...

ఛా..!! నేనెప్పుడూ లేట్ ....చాక్లెట్లు ఉన్నయ్యో ..అయిపోయాయో !! ఒకటో రొండో ఉంటె బాగున్ను..

ఏమండోయ్ శశికళ గారు మీ గ్లీకు , లష్యన్ , జేల్మన్, అమెరికన్ , లండన్ వీరుడికి ఎపి ఎపి బర్తదేలు.. సుభాశిస్సులు ...అభినందనలు....గులాబి మాలలు...

(ఒక చాక్లెట్ అన్నా ఇస్తే బాగుండు...వచ్చినందుకు లాభం......తిడతారో ఏంటో లేట్ గా వచ్చాం అని ......)

హి హి హి ..ఉంటానండి మరి ( ఇప్పుడు కూడా ఇవ్వట్లేదు అయిపోయినట్టున్నై చాక్లెట్లు, ఇక నుండి ముందు గా రావాలి )


శ్రేయోభిలాషి
RAAFSUN

రాజ్యలక్ష్మి.N said...

మీ గ్లీకువీరుడి కి ఆలశ్యంగా
పుట్టినరోజు శుభాకాంక్షలు