Saturday 17 December 2011

ఎంతో విలువైనది......

ఎంతో విలువైనది......ఏమిటో తెలుసా?
మనిషి ప్రాణం.....ఎందుకంటె అది ఉన్నప్పుడే 
మిగతా విషయాలు.....ప్రాణం ఉన్నా సంతోషం 
ఎప్పుడో తెలుసా?.....ఆరోగ్యం గా ఉన్నప్పుడు......
అందుకే అన్నారు........
"ఆరోగ్యమే మహా భాగ్యము"

మరి మీరు ఆరోగ్యం గా ఉండి,మంచి మనసుతో 
ఉంటె చాలా ప్రాణాలు కాపాడ వచ్చు అంటే ఇంకా 
మంచి విషయమే కదా...........

మరి రక్త  దానం చేయాలంటే కావాలసినది 
ఆరోగ్యం,మంచి హృదయం మాత్రమే.....
కావాలంటే చూడండి ఒక ఆటో డ్రైవెర్ 50 సార్లు 
రక్త దానం చేసాడంటే అతని దగ్గర ఏముంది....
ఇతరులకు ప్రాణదానం చేయాలనే మంచి హృదయం తప్ప......




ఇంకా కింది విషయం చూడండి...కుటుంబం మొత్తం 
రక్త దానం చేస్తారంట......యెంత గొప్ప విషయం.....




అన్ని దానాలలొకి అన్న దానం ,విద్యా దానం ,రక్త దానం 
ఉత్తమమైనవి.మొదటి రెండు ఎవరైనా చేయగలరు.
కాని రక్త దానం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే చెయ్యగలరు.
ఆ అవకాశం వస్తే రక్త దానం చేసి మనిషి కి ప్రాణం పోసి 
వారి హృదయాలలో "మనీషి"గా నిలిచిపొండి.


ఈ రోజు ప్రపంచం చిన్నది అయిపొయింది ....కాని మనిషి 
ఒంటరి అయిపోయాడు....ఎందుకో తెలుసా?తను నలుగురు 
కోసం నిలబడితేనే,తన కోసం నలుగురు ఉంటారని
 తెలీకపోవటం వలన.......నలుగురితో సర్దుకోవటం 
తెలీకపోవటంవలన........భావోద్వేగాల పై నియంత్రణ 
లేకపోవటం వలన......మరి అవి అదుపులో ఉంటె జీవితం ఎలా ఉంటుంది......లింక్ లోకి వెళ్లి చూడండి......


ఉందా....ఉద్వెగప్రజ్ఞ.......ఉంటె అందరు మీ వెంటె...

11 comments:

సుభ/subha said...

చాలా బాగా చెప్పారండీ.. మంచి విషయాన్ని కూడా అందరి దృష్టికి తీసుకొచ్చారు. ధన్యవాదాలు.

PALERU said...

hmmm....noted with many thanks

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

// తను నలుగురు కోసం నిలబడితేనే,తన కోసం నలుగురు ఉంటారని తెలీకపోవటం వలన //

True!

రాజ్యలక్ష్మి.N said...

"ఈ రోజు ప్రపంచం చిన్నది అయిపొయింది ....కాని మనిషి
ఒంటరి అయిపోయాడు....ఎందుకో తెలుసా?తను నలుగురు
కోసం నిలబడితేనే,తన కోసం నలుగురు ఉంటారని
తెలీకపోవటం వలన"

మంచి విషయాన్ని చెప్పారండీ..

శశి కళ said...

subha gaaru,raafsun gaaru,avineni gaaru,raajigaaru thank u all of u.

Unknown said...

మొత్తం పోస్ట్ అంతా బావుంది.
మంచి విషయాన్ని అంతే మంచిగా చెప్పారు అక్క

మౌనముగా మనసుపాడినా said...

చాలా బాగాచెప్పారు..

రసజ్ఞ said...

సరిగ్గా ఒక నెల రోజుల క్రితం ఒక చిన్న బాబుకి రక్త దానం చేసి వచ్చా! ఆ తృప్తి మాటల్లో చెప్పలేనిది! అతని ప్రాణం నిలపడింది అప్పుడు నాకు కలిగిన ఆనందం మిగతా తాత్కాలిక ఆనందాల ముందు చాలా చిన్నదనిపించింది. నా సొంత అనుభవం ఇక్కడ పంచుకోవాలనిపించింది.

శశి కళ said...

rasagna meeru ilaa mee anubhaavaanni
panchukovatam valana chaalaa mandiki upayogapadutundi.
hats off to ur good heart...

శశి కళ said...

mounamugaane manasu paadina...welcome to my blog...thank u

శేఖర్ (Sekhar) said...

Good words...

Your words are very true.My mama donates blood almost 5-6 times every year...

Appreciated for your article Sasi garu