బ్రతకటానికి సంతోషం గా ఏమి కావాలి.....
డబ్బు.....సరే......
కీర్తి...సరే........
మంచి కుటుంబం ......సరే....
ఫ్రెండ్స్......సరే......
ఆరోగ్యం......సరే.....
ఏమిటి ఇంకా సంతోషం గా లేరా?
మరి ఏమి కావాలి మీకు మనసుకు శాంతి.
ఇదే బుద్దుడు కనుగొన్నది ......
కాని ఆయన ఏమంటారో తెలుసా........
వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని నమ్మొద్దు...
నువ్వు చేసి చూడు .....అప్పుడు నమ్ము....
ఇవి చూడండి .
యెంత ప్రశాంతత.....చూస్తుంటేనే యెంత హాయిగా ఉంది.
జ్ఞానం నువ్వు పొందటమే కాదు...ఇతరులకు కూడా దారి చూపు .....
మరి ఎలాగా దీనిని పొందటం?
చేసి చూడండి.ఇలాగ కూర్చోండి.కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో,మంచం పై
కూర్చోవచ్చు.
ఎలాగా చెయ్యాలి?
కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచి గమనిస్తూ ఉండండి.
ఆలోచనలు వస్తే కట్ చేసి .....శ్వాస నే గమనించండి .
కొంతసేపటికి ఆలోచనలు ఆగిపోయి ప్రశాంతంగా విశ్వ శక్తి ని పొందుతారు.
యెంత సేపు చెయ్యాలి?
మీ వయస్సు ఎంతో కనీసం అన్ని నిముషాలు చెయ్యాలి.
ఎప్పుడు చెయ్యాలి?
మీకు ఎప్పుడు వీలు ఉంటుందో అప్పుడు ......
బస్ లో వెళ్ళే టప్పుడు అయినా చెయ్యొచ్చు సాదన మీద...
కాని ప్రతి రోజు ఒకే సమయానికి చెయ్యగలిగితే మంచిది.
ఎన్ని రోజులు చెయ్యాలి?
మామూలుగా నలబై రోజులు చేసి చూడండి అంటారు.
అలాగే అలవాటు అవుతుందని.....కాని దాని విలువ తెలిస్తే వదులుకోలేము.
ఏమి గుర్తు ఉంచుకోవాలి?
దీనికి మంత్రాలు,గురువులు లేరు...ఎవరికి వారే....
కాకుంటే సాధన,సత్సంగం,సద్గ్రంధ పతనం చెయ్యాలి.అప్పుడే మనసు
మన మాట వింటుంది.
ఎవరు తోడుంటారు ?
మీ పూర్నాత్మే మీకు తోడూ...ఎలా నడిపిస్తుందో మీరే చూడండి.
నేను చెప్పింది ఒక మార్గమే.బోలెడు మార్గాలు ఉన్నాయి.
కాని నాకు ఎందుకో డబ్బు ప్రస్తావన లేక పోవటం,గురువులు లేక పోవటం,
సులభంగా చేసుకోగాలగటం ,నియమాలు లేకపోవటం .....
అదీ కాక ఇది నాకు మంచి పలితాలు ఇవ్వటం వలన నాకు నచ్చింది.
అందరికి బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు
ఎన్నోలక్షల ఏళ్ళ నుండి భారతీయుల మనసులోని మాట....కోరిక....
''అసతోమా సద్గమయా''
సత్యము వైపు నడిపించు.
''బుద్ధం శరణం గచ్చామి
ధర్మం శరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి ''
9 comments:
baagundi. Try chesthaanu.. Teacher gaaru.
మంచి విషయాలు తెలిపిన మీకు, మీ పోస్టుకు అభినందనలు శశి గారు!
మీకు కూడా బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు!
మీకు కూడా బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు శశి కళ గారు.
బుద్దుడు జన్మించే మూడు వేల సంవత్సరాలు కాలేదు... మరి మీరేమిటో "ఎన్నోలక్షల ఏళ్ళ నుండి భారతీయుల మనసులోని మాట....కోరిక....
''అసతోమా సద్గమయా''
సత్యము వైపు నడిపించు.
''బుద్ధం శరణం గచ్చామి
ధర్మం శరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి" అంటూ వ్రాశారు.
@శశికళ గారు నేను ఈ పద్ధతిని అనుసరిస్తుంటా...మనం కళ్ళు మూసుకొని అలా చేసేపుడు ఎక్కువ ఆలోచనలు మనపైనే వుంటాయి...అదిగాక మనం రోజు వాడే శక్తిలో కాళ్ళ ద్వార ఎంతో శక్తి వృధా అవుతుంటుంది ... ఇలా కళ్ళు మూసుకోవడం వాళ్ళ మన శక్తి పెరుగుతుంది ... శ్వాస మీద ధ్యాస వుంచడం వాళ్ళ ఏకాగ్రత పెరుగుతుంది.... మంచి టపా పెట్టారు చాలా బాగుంది :)
శశి గారు మీ యోగా సూచనలు బావున్నయి.. అయితే బావున్నయి కదా అని నేను ప్రయత్నం చేసా... చాలా బాగా వచ్చింది... నేను సరిగ్గా 2 గంటల తరువాత లేచా... అవును మరి... నిద్ర భలే పట్టింది లెండి.. నాకు మీ యోగా సూచనలు చక్కగా ఎక్కయి.. రోజూ నిద్ర పోయే ముందు... కాసిన్ని నీళ్ళు తాగి యోగా చేస్తానండి..
మీ టిప్స్ కి ధన్యవాదాలు..
మీకు కూడా బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు శశి గారు. :))
వనజ గారు మీరు కూడా టీచర్ అంటారా?చిన్న పిల్లలు సరే...చెల్లి అనుంటే సంతోషించేదాన్ని...థాంక్యు
నిరంతరంవసంతములే,జలతారు వెన్నెల గారు,హర్షా థాంక్యు
కళ్యాణ్ నువ్వు చేస్తావు అని నాకు తెలుసు...నీ పాజిటివ్ యాటిట్యూడ్ చూసినపుడే నేను అనుకున్నాను.
థాంక్యు
బుద్ధా జీవి గారు ....వీలయితే నిద్ర పోకుండా మన శరీరం లో ఏమి జరుగుతుంది అని గమనిస్తే మంచిది.
కొంచెం సేపు గమనించిన తరువాత నిద్ర పొండి కావాలంటే ....థాంక్యు
Post a Comment