Friday, 26 October 2012

వ్యాపిస్తున్న తెలుగు రేడియో తరంగం ....

ఈ రోజు శ్రీ లక్ష్మి గారి గురించి చదివిన తరువాత 
చాలా  సంతోషం వేసింది.యెంత అంటే అంత...
దానికి  కొలతలు ఎక్కడ ఉంటాయి ?

ఇక్కడ  ''వైజాగ్ ఆలిండియా రేడియో స్టేషన్''లో 
అనౌన్సర్  గా పని చేసే తను భర్త వృత్తి రీత్యా 
వాషింగ్టన్  వెళ్లి పోయారు.కాని తనకు ఇష్టమైన 
రేడియో  ని వదలలేక తన సొంత డబ్బులతో 
వాషింగ్టన్  లోని మేరీల్యాండ్ కేంద్రంగా ''మన తెలుగు రేడియో''
ప్రారంబించారు.తనకు తెలిసిన టేక్నాలిజీని ఇలా ఉపయోగించుకోవడం 
అందులో  తెలుగు కార్యక్రమాలు ఇరవై నాలుగు గంటలు 
ప్రసారం  చేయడం యెంత అభినందనీయం.
తనతో  మాట్లాడితే యెంత సంతోషంగా ఉన్నారో 
తను  చేసే పని పట్ల.నిజంగా మనం చేసే పనిలో మనం 
అనునాదం  చెందితే అలాగే మాట్లాడుతాము అనుకుంటాను....

మరి  ''కుంచెన పల్లి .శ్రీలక్ష్మి''గారిని మనం కూడా మంచి 
మనసుతో  అభినందిద్దాము.
ఎవరికైనా  ఇంట్రెస్ట్ ఉంటె 
''WWW.MANATELUGURADIO.COM''
లోకి  వెళ్లి ప్రసారాలు వినండి.

(రేడియో లింక్ ఇక్కడ ) 




2 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

Inspire gaa undi. link loki velli choosi vacchaanu. chaalaa baavundi.

Thanks for sharing.. Shashi.

శశి కళ said...

థాంక్యు వనజ గారు