Sunday 14 October 2012

బ్రదర్స్...వహ్వా అదుర్స్

బ్రదర్స్ కూడా చారులత లాగా దెయ్యం .కాం అనుకొని 
కామ్  గా ఉన్నాను.కాని కాదు అని నిన్న పేపర్ చూస్తె తెలిసింది.
సరే  సూర్యా తొ సెలవలు శుభారంభం చేద్దాము అని 
మా  వారి చెవిలో వేసాను.హమ్మయ్య ఒప్పేసుకున్నారు.
వెళ్లేసరికి  మామూలే మొదలు అయింది.ఏదో ప్రకటన ...
ఏమి  మిస్ కాలేదు లెండి ఏదో ప్రకటన అన్నాను.
కాని  అది కూడా సినిమాలోదే .''ఎనేర్జియాన్''అనే ఫుడ్ 
డ్రింక్  తయారు చేస్తూ ఉంటాడు రామ చంద్ర తన ఫ్యాక్టరీలో.
దాని  వలన అతను కోట్ల డబ్బు,హోదా సంపాదించి ఉంటాడు.
అతనికి  అఖిల్,విమల్ అనే అవిభక్త కవలలు ఉంటారు.
వేరు  చేస్తే ఒకడే మిగులు తాడు అని వేరు చెయ్యరు.


హీరోయిన్  అంజలి వాళ్ళ ఫాక్టరీ లోనే పని చేస్తూ ఉంటుంది.
విమల్  మంచి క్లేవేర్.బుక్ రీడర్.ఇక్కడ తిలక్ కవిత్వం గూర్చి 
హీరోయిన్ తొ మాట్లాడుతూ ''ప్రేమించిన వాళ్ళు కవిత్వం 
వ్రాయకుండా  ఉండలేరు,తిలక్ కవిత్వం చదివిన వాళ్ళు 
ప్రేమించకుండా  ఉండలేరు''....అసలు వీళ్ళు విడిగా లేరే 
పెళ్లి  ఎలా చేసుకుంటారు అనిపించింది.
(అర్జెంట్ గా ఆ తిలక్ గారి పుస్తకం ఒకటి సంపాదించి చదవాలి 
లేకుంటే  ఈ అరవోల్లు ప్రతి సినిమాలో మనం మన బాషని 
గౌరవించం  అని యెగతాళి చేస్తూ ఉంటారు)
రఘు కూడా ఆ ఫ్యాక్టరీ లో పని చేస్తూ ఉంటాడు.కొంచెం అమాయకమే 
కాని  జీనియస్.అంజలిని ప్రేమించాను అని వెంటపడి 
చెపుతూ  ఉంటాడు.
అంజలి  అఖిల్ వాళ్లకు ''ఓల్గా''అనే రష్యా జర్నలిస్ట్ ని 
పరిచయం  చేస్తుంది.ఆ అమ్మాయి రామ చంద్రాఫాక్టరీ 
వివరాలు అనీ కూపీ లాగుతుంటుంది.ఎందుకు అంటే 
అదే సస్పెన్స్.ఆమె రఘుని కూడా వివరాలు ఇవ్వలేదు అని 
చంపేస్తుంది.కాని తరువాత ఆమె కాదు రామ చంద్ర తన ఫాక్టరీ 
బండారం  బయట పడుతుందని చంపేస్తాడు అని  విమల్ కి 
తెలుస్తుంది.ఈ లోపల అంజలి తొ సినిమాకి వెళతారు.
అక్కడ  చక్కని హాస్యం చిన్నగా అరికాలు ని గిలిగింతలు 
పెట్టినట్లు....అన్ని సీట్ల లోని వారు నవ్వులే నవులూ.
ఇక  పాట  ఎందుకులే పాతాళ గంగ మీద పుట్టే  లో 
ఊగుతూ వెళుతున్నంత హాయిగా....అసలు ఫోటోగ్రఫి 
సీనరీస్....రెండు కళ్ళు చాలవు....బ్రెయిన్ లో ఉండే మెమొరీ 
సరిపోతుందా...భలే తీసారు.హ్యరీస్ సంగీతం చాలా 
బాగుంది.
తరువాత ఓల్గా మేటర్ కలెక్ట్ చేసిందని తెలిసి తనని చంపమని 
రామ చంద్ర మనుషులను పంపుతాడు.కాని ఆ అమ్మాయి తనను 
మిద్దె పై నుండి తోసే టపుడు పెం డ్రైవ్ మింగి చని పోతుంది.
దానిని పోస్ట్ మార్తుం తరువాత అంజలి సంపాదించి 
విమల్ కి ఇస్తుంది.అది తెలుసుకున్న రామ చంద్ర 
కొడుకుల మీదకే రౌడీలు పంపుతాడు.ఆ పోరాటం లో 
విమల్ బ్రెయిన్ డెడ్ అయిపోతుంది.అందుకని అతని హార్ట్ 
అఖిల్ కి పెట్టి అతన్ని మాత్రమె బ్రతికిస్తారు.
వేరు అయిన తరువాత పాటలో అఖిల్ తన తమ్ముడ్ని 
గుర్తు చేసుకుంటూ బాధ పడటం మనల్ని కంట తడి 
పెట్టిన్చేస్తుంది.ఇంటర్వెల్.ఈయన ''మంచి సినిమా శశి''
హమ్మయ్య అనుకున్నాను.
తరువాత అఖిల్ వాళ్ళ నాన్న చేసే తప్పుడు పౌడర్ వలన 
నలబై లక్షల మంది పిల్లలు నరాల జబ్బుతో చనిపోతారుకొన్ని  
రోజుల తరువాత అని తెలుస్తుంది.తరువాత ఉక్రెయిన్ కి 
అంజలిని తీసుకుని వెళ్లి ఏమి చేస్తాడు...సస్పెన్స్.

లాస్ట్ లో రామ చంద్రా అఖిల్ పుట్టుక గూర్చి ఒక నిజం 
చెపుతాడు.చెప్పి ''నువ్వు నాకు కుక్క తొ సమానం 
చెత్త నా కొడకా''అంటాడు.సూర్య బాధతో తండ్రిని వదిలేస్తే 
తండ్రి ఏమి అవుతాడు?మారుతాడా?

మరి సినిమాకి వెళ్లి చూడండి.పాపం హాల్స్ అన్నీ 
వెల వెల పోతున్నాయి.మంచి వినోదాన్ని ఇచ్చే సినిమా 
వస్తే అన్నా చూడాలి కదా.మంచి స్క్రీన్ ప్లే.డైరక్షన్.
మంచి సినిమా చూసిన అనుభూతి  ఉంటుంది...
చివరలో కొంచెం తెలుగు సినిమా మసాలా కలపకుండా 
ఉండి ఉంటె.....కాని చూడొచ్చు.బాగుంది .

9 comments:

Harsha said...

మీరిలా కధ అంతా చెప్పెయకూడదు శశి గారు ! ఎనీ వే సెలవల్లో మంచి సినిమా చూడొచ్చు అన్నమాట

శశి కళ said...

మరో ప్రస్తానం గారు అంతా కధ చెప్పలేదండీ :))
తప్పకుండా చూడండి.థాంక్యు

Raj said...

జనాలని ఇలా మాయ చేస్తారు అనుకోలేదు శశి మిస్...

మా roommate ఇక్కడ తమిళ్ version చూసొచ్చి రెండు రోజులు బట్టి ఇంకా కోలుకోలేదు :D

శశి కళ said...

ఏమి రాజేంద్రా బాగా ఉంది.ఎందుకని అలా అన్నారో అతను.పాటలు సీనరీస్ అంతా బాగునాయి.చెప్పాను కదా రెండో భాగం తెలుగు మసాలా అని ))

Srini said...

ఆ అవిభక్త కవలల కాన్సెప్ట్ సినిమాకు అసల అవసరమే లేదు, ఏదో క్యాష్ చేసుకోవటానికి తప్ప :)
అన్నట్టు సినిమా నాకు కూడా నచ్చలేదండోయ్...కొంచెం expectations పెట్టుకోని వెళ్ళాను :)

Anonymous said...

adenti andi first song miss ayyare....

Anonymous said...

Thank you for sharing. Not to many people in your position are so gracious. Your article was very poignant and understandable. It helped me to understand very clearly. Thank you for your help.

Anonymous said...

Thank you for your thoughtful present of having written this article. The message seems to be given to me specifically. Our son also had a lot to learn from this – though he was the individual that found your site first. Most of us can't imagine a more superb present than a gift to encourage that you do more.

శశి కళ said...

అజ్ఞాత గారు అవునా?ఎవరూ చెప్పలేదే :(