Monday, 1 October 2012

ఈ రోజు ఫిక్షన్ ...రేపటి వాస్తవం

ఒక్క సారి బ్రాడ్ బ్యురీ గురించి తెలిసింది  ఈ రోజు సాక్షి చదివితే.
తెలీటం ఏమిటి అంటే మరి ఆయన ఇంతకూ ముందు తెలీదు.
కాని విచిత్రం ''భూమి ఉరిమితే ''థీం నాకు తెలుసు...
ఎక్కడో చదివాను అలాగే గుర్తుకు ఉండిపోయింది.
చదవటం మొదలు పెట్టగానే... అరె ఇది అదే కదా అని 
ఆశ్చర్య పోయాను.ఇది ఇంత ఫేమస్ అని ...ఇన్ని ముద్రణలకు 
నోచుకుందని నాకు అప్పుడు తెలీదు.

సింపుల్ గా చెప్పాలంటే ఒక కంపెనీ డబ్బులు తీసుకొని 
మనలను గతానికి కాని వర్తమానానికి కాని పంపిస్తుంది.
(ఆదిత్యా 369 లాగే .... కాని ఇక్కడ జీవ వైవిద్యం యెంత ముఖ్యమో 
చూపిస్తాడు మనకు రచయిత)
ఒక వేటగాడు రాక్షస బల్లుల కాలానికి వెళ్లి దానిని వేటాడాలి అని 
కోరుకుంటాడు.అప్పుడు గైడ్ నిచ్చి పంపిస్తారు.వాళ్ళు చెప్పిన దానినే
 చంపాలి.ఇక ఒక్క గరికను కాని తుమ్మేదను కాని చంపకూడదు అంటారు.
ఎందుకు అంటాడు వేటగాడు.అప్పుడు చెపుతారు నువ్వు ఒక్క తుమ్మేదను 
చంపినా దాని ద్వారా ఇప్పటి కాలం వరకు పుట్టగల లక్షల తుమ్మెదలు 
లేకుండా పోవటానికి కారణం అవుతావు అని.ఆతను అంటాడు 
''చచ్చిపోతాయి అంతే  కదా''అని.
వాళ్ళు చెపుతారు వాటి మీద ఆధారపడే ప్రాణులు అన్నీ 
ఆహారం లేక చచ్చి పోతాయి.అప్పుడు నువ్వు చూసే ప్రపంచం ఇలాగ ఉండదు.
అంటే జీవ గొలుసులో ఒక్క తీగను పీకేసినా గొలుసు ఏర్పడే రూపమే 
మారిపోతుంది అని.
వేటగాడు అంటాడు మరి నేను రాక్షస బల్లిని వేటాడితే అపుడు 
గొలుసు తెగిపోదా?
గైడ్ చెపుతాడు ఆల్రెడి ప్రకృతిలో చెట్టు పడి  చనిపోయే దానినే నువ్వు 
వేటాడుతున్నావు కాబట్టి ఏమి మార్పు రాదు.
సరే ఆతను రాక్షస బల్లి రాగానే బయపడుతూ కాలుస్తాడు.
మళ్ళా దాన్ని శరీరం లోని బుల్లెట్స్ తెమ్మంటారు.
వాళ్ళు తిరిగి ఈ లోకం లోకి వచ్చి చూస్తె వాళ్ళు పోయినపుడు 
ఉన్న జీవ లోకం అలాగే ఉండకుండా మారి ఉంటుంది.
కారణం ఏమిటంటే వేటగాడు తెలీక ఒక సీతాకోక చిలుకను 
అక్కడ తొక్కి చంపేస్తాడు.తరువాత సంగతి సరే....

అసలు ఈ ఫిక్షన్లు వీళ్ళకు ఎలా వస్తాయో గాని భలే ఉంటాయి.
అవి నిజం కావటం కూడా మనం చూస్తుంటాము.

''మిషన్ టు ది మార్స్''అని ఒక సినిమా చూసాను.
దానిలో శుక్ర గ్రహం పైకి వెళ్ళిన రాకెట్ నుండి దానిలోని మనుషులు 
 ఒక రోవర్ ని పంపితే అది తిరుగుతూ మనిషి మొహం లాగా ఉండే 
రాయి దగ్గరకు వస్తుంది.
అప్పుడు వాళ్ళు వెళ్లి దాని లోపలి వెళ్ళే మార్గం కనుక్కొని...
ఇక అంతా భలే ఉంటుంది చెప్పలేము.
చిత్రం ఏమంటే నిన్న నాసా వాళ్ళు పంపిన రోవర్ పిరమిడ్ లాంటి 
రాయి కనుక్కుంది.మరి దాని కింద ఏముంటుందో అని అప్పుడప్పుడు 
ఆ సినిమా గుర్తు చేసుకొని సస్పెన్స్ గా ఎదురు చూస్తూ ఉంటాను.

ఇంకోటి ''మెన్ ఇన్ ది బ్లాక్''ఈ రచయితా ఇంకా గొప్పోడు ...
గ్రహాలూ ఏమి ఖర్మ ..ఏకంగా గెలాక్సీ నే ఒక గ్లోబ్ గా చేసి 
ఈ సినిమాలో పిల్లి మెడలో కట్టేస్తాడు.మనిషి విజ్ఞానం అందుకునే 
లోపలే ఇంకా పైకి  నిచ్చెనలు వేస్తాయి ఫిక్షన్లు...ఒక రకంగా 
మనం రాజి పడకుండా కదిలేటట్లు అవే స్పూర్తిని ఇస్తున్నాయో ఏమో.

ఎలాగో ''జీవ వైవిధ్య సదస్సు''అక్టోబర్ ఒకటి నుండి  పంతొమ్మిది వరకు 
మన హైదరాబాద్ లో జరుగుతున్న సందర్భం లో మనం 
జీవ వైవిద్యం లో వేలు పెట్టకుండా వాటినే వదిలేస్తే ప్రక్రుతి 
చూసుకుంటుంది సమ తౌల్యత గూర్చి అనేది గుర్తు చేసుకుంటాము.
ఎందుకంటె వేలు పెడితే ఏమి అవుతుందో ''జురాసిక్ పార్క్''
లో చూసాము కాదా.మనకు ఏదైనా కనిపెట్టడమే తెలుసు.
కాని ప్రకృతికి ఆ కనిపెట్టినది వికృతి కాకుండా విరుగుడు ఇవ్వటమూ 
తెలుసు.

ఈ సందర్భం లో మన తెలుగు రచయితా మల్లాది గారి 
''నత్తలు వస్తున్నాయి''జ్ఞాపకం చేసుకుందాము.
స్తూలంగా కధ ఏమిటి అంటే ఒక ఆతను ఆఫ్రికా లో 
పనిచేసేటపుడు అక్కడ దొరికే రాక్షస నత్తలు చాలా 
ఇష్టంగా తినే వాడు.కాని అవి అక్కడ నుండి తీసుకు రావాలి అంటే 
ప్రభుత్వం నిషేధం.ఎందుకంటె అవి చాలా తొందరగా సంతాన ఉత్పత్తి చేసుకుంటాయి.
రోజుల్లోనే వేలుగా మారి యే వస్తువునైనా తినేస్తాయి.
కాని మన హీరో గారు ఎలాగో భారత దేశానికి తీసుకు వచ్చి 
గుడ్లు పెరగకుండా వేడి నీళ్ళ లో చంపి కావాల్సిన వరకే 
పెంచుకుంటూ ఉంటాడు.ఒక సారి పొరపాటున ఒక్క గుడ్డు 
మిస్ అయిపోతుంది.
ఇక చూడండి ఎక్కడ చూసినా నత్తలే ...మిల్లులు,ఇల్లు,బజార్లు 
దేనిని వదలకుండా తినేస్తూ...దానికి విరుగుడు లేదు .
మన హీరో గారే చివరికి ఆఫ్రికా అడివికి వెళితే అక్కడ ఆటవిక 
జాతుల వాళ్ళకి 
''రాక్షస నత్తల''వలన అనర్ధాలు ఎందుకు లేవు అని చూస్తె 
దీన్ని చంపగల ఒక నత్త వేరేది  దొరుకుతుంది.అంటే దీనికి  
విరుగుడు ప్రక్రుతి అక్కడ పెట్టి  ఉంది.అది తెచ్చి ఇండియా ని 
కాపాడుతాడు ఇంక జీవుల విషయం  లో వేలు పెట్టకూడదు 
అని లెంపలు వేసుకొని....మనం కూడా కొత్త ప్రయోగాలు 
చెయ్యకుండా లెంపలు వేసుకుంటే బాగుండును అనిపిస్తూ 
ఉంటుంది నాకు .8 comments:

Green Star said...

చాల బాగుంది, చక్కగా రాసారు. ఈ ఫిక్షన్ లు రాసేవాళ్ళకు ఎంత క్రియటివిటి ఉంటుందో.

శశి కళ said...

థాంక్యు గ్రీన్ స్టార్ గారు

Bindu said...

నిజమే. మానవుడికి ప్రకృతికీ మధ్య జరిగే నిరంతర జీవన పోరాటం మీద చాలా పుస్తకాలే ఉన్నాయి. చిన్నప్పుడు నేను కూడా నత్తలొస్తున్నాయ్ జాగ్రత్త చదివాను. మీరు చెప్పినట్టుగానే, "నిన్నటి కల్పన, రేపటి వాస్తవం." అమెరికాలో killer bees అలాగే అయ్యింది. ఎక్కడినించో ఎవరో కొన్ని పట్టుకు వచ్చారు. వాటికి సహజ శత్రువులు లేక అవి బాగా పెరిగిపోయి ఎన్నో పంటలు నష్టం చేసారు. "భూమి ఉరిమింది" చదవలేదు నేను. బావుండేట్టు ఉంది. చదవాలి.

srinivasarao vundavalli said...

డెంగీ జ్వరాన్ని ఎదుర్కోవడానికి జన్యుమార్పిడి ద్వారా దోమలు సృష్టించి ఆ వ్యాధిని అరికట్టేందుకు బ్రిటన్ పరిశోధకులు ప్రయోగాలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న జీవ వైవిధ్య సదస్సులో ఈ అంశంపై కూడా చర్చిస్తున్నట్టున్నారు. ఈ ప్రయోగం ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.

హరే కృష్ణ said...

బాగుంది శశి గారు!

శశి కళ said...

బిందు గారు నేను ఇంకా నత్తలోస్తున్నాయి జాగ్రత్త
వ్రాయాలి అనుకున్నాను.ఎందుకంటె ఒక నత్తను తెచ్చేస్తే పరిస్తితి బాగు అయినట్లు మల్లాది గారు వ్రాసారు.ముగింపు తప్పదు కాబట్టి....కాని నిజం కాదు చచ్చిపోయిన నత్తలు వాటి చుట్టూ ఏర్పడే బ్యాక్టీరియా సంగతి ఏమిటి?
విరుస్ లు వాటి వలన జబ్బులు...ఆఫ్రికాలో వాళ్లకు దాని అంటి బాడీస్ ఏర్పడి ఉంటాయి ...మరి మనకు
ముందు పరిస్తితి రావాలంటే కొన్ని ప్రాణాలు బలి ఇచ్చుకోవాల్సిందే.
కానీ ఆయన తప్పదు కాబట్టి ముగింపు అలాగ ఇచ్చారు.
మీలాంటి మంచి వారు పరిచయం కావటం సంతోషం గా ఉంది

శశి కళ said...

ఆండి థాంక్యు

శ్రీనివాస్ గారు నిజమే చూద్దాము ఏమి కొత్త ప్రయోగాలు వస్తాయో.కాని కొత్తవి చెయ్యక ప్పోవటమే మేలు.ఉన్నవాటికి మందులు కనిపెట్టేసి.
అసలే ఒక కామెట్ త్వరలో వస్తుందంట భూమికి దగ్గరగా...అసలే మన దేశం వాళ్లకు తోక చుక్క వస్తే
దాని ప్రభావం వలన కీడు జరుగుతుందని నమ్మకం...ఏమి జరుగుతుందో చూద్దాము.
థాంక్యు

సుభ/subha said...

Same pinch అండీ.. నాక్కూడా అలాంటి ఫిక్షన్స్ అంటే భలే ఇష్టం. ఇంకా చాలా సినిమాలున్నాయ్ కదా అలా.. మీరు వ్రాసిన విధానం బాగుందండీ..