''అమ్మా నీకు థాంక్యు ఇంకా సారీ '' చెప్పింది మా అమ్మాయి ఫోన్లో .
ఎందుకు అంటారా ?చెప్తాను .....
అదిగో హీరోయిన్ ని విలన్ కత్తి పెట్టి చంపుతూ ఉంటాడు . అప్పుడు
ధడేల్ అని సౌండ్ ..... ముందు ఉండే టీపాయ్ గాలిలో ఆరు సార్లు
తిరుగుతుంది . దాని పై ఉండే కత్తి వెళ్లి షాండ్లియార్ తాడు కోస్తుంది .
భళ్ళుమని అంత పెద్ద బల్బులు కింద పడి చిట్లిన శబ్దం . పగులుతూ
ఉన్న గాజు ముక్కల్లోంచి ఒక్క ముక్క స్లో మోషన్ లో పైకి లేచి
నేరుగా విలన్ చేతి పై గుచ్చుకొని వాడి చేతిలో కత్తి కింద పడి పోతుంది .
అప్పుడు మెల్లిగా పై నుండి జారుతూ హీరో .... ''ఎవడ్రా నువ్వు ?''
ఎవరు పగల గోడితే గాజుముక్కలూ కూడా మాట వింటాయో వాడే
పండుగాడు .... ఎనీ డౌట్స్ ?''అంటాడు .
''పోబే .... నువ్విప్పుడు సీన్ లోకి వచ్చావు . నేను సినిమా మొదటి నుండి
ఉన్నాను అంటాడు విలన్ .
''ఎవరు ముందు వచ్చారు అని కాదన్నాయ్ .... దేన్నీ కొట్టాడు అనేది కాదు
పాయింట్ ... కత్తి కింద పడిందా లేదా ?అనేది పండుగాడి ఇస్టైల్ ''
అబ్బా ఈ సినిమాటిక్స్ మన తెలుగు సినిమాల్లో చూసేవే కదా కొత్త ఏముంది ?
ఇయ్యెమైనా నిజ జీవితం లో జరుగుతాయా ఏమన్నానా ?అంటారు కదా .
నేను అదే అనుకునేదాన్ని మొన్న శనివారం వరకు .... సినిమాటిక్ అంటే
సినిమాల్లో జరుగుతాయి అని .
అన్నం తిందామని కారియర్ తెరుస్తూ ఉన్నాను , పాప ఫోన్ .
ఇదేమిటి ఈయన ,హేమ ఇప్పుడు బాంక్ టెస్ట్ వ్రాయడానికి నెల్లూరు దాటిన
తరువాత వచ్చే ఎక్జామ్ సెంటర్ కి వెళ్ళారు కదా !ఇప్పుడు ఫోన్ ఏమిటి ?
''అమ్మా ఏదో ఒక ఐ . డి లేనిదే ఎక్సాం లోకి రానివ్వరంట ''చెప్పింది .
''అంత దూరం నేను ఎలా తీసుకెళ్ళాలి . ఇంకా అరగంట టైం కదా ఉంది.
ఇది జరిగే పనా ?ఇన్విజిలేట ర్స్ ఆలో చేయము అనేసరికి నలుగురు
పిల్లలు పరీక్ష దాకా ఉండకుండా వాళ్ళను తిట్టుకుంటూ వెళ్ళిపోయారు
అంట .
''ఏమి చేస్తారు అండి '' ఈయనను అడిగాను . అదే అర్ధం కావడం లేదు .
కాని ఎక్సామ్ రెండున్నరకు వీళ్ళు ఏది తెచ్చినా ఆలో చేస్తాము అంటున్నారు .
ఇంకో గంట లో ఏమి చెయ్యగలం ?అన్నాడు .
మనసులో ఇక వ్రాయలేము అని డిసైడ్ అయిపోయినట్లున్నాడు .
పాప మాత్రం కొంచెం ఆశతో ఉంది .
''అక్కడి వాళ్ళను అడగండి '' అన్నాను .
అందరు ఇన్విజిలేటర్స్ కటినం అంటారు కాని నేను కూడా చేసి ఉన్నాను కాబట్టి
నాకు తెలుసు .... పిల్లలకు సాధ్యమైనంత సహాయం చేయాలని
ఉంటుంది రూల్స్ కి లోబడి .
వెంటనే ఫోన్ చేసాను .
''ఏమండీ మనం aadhaar కార్డ్స్ డౌన్లోడ్ చేసుకో లేదు .
అవి అక్కడ చేసుకోండి ''అన్నాను .
''కాని దానికి నంబర్ ,డేట్ కావాలి కదా . ఇంటికి పోయి చెపుతావా ?''అన్నాడు .
కేరియర్ మూసేసి పరుగున స్కూటీ తీసుకొని ఎదురుగా వచ్చే మేడంస్ కి
పరిస్థితి చెపుతూ ఇంటికి వెళ్ళిపోయాను . అప్పటికే ఇక అరగంట టైం ఉంది .
ఎండలో అంత దూరం ఇంటికి వచ్చేసరికి తాళం కూడా తీయలేక పోయాను .
ఎందుకో ఎక్సామ్ పోతే పోనీలే అనుకోను .
ఇంతా చేస్తే ఇంటి రెవెన్యు నా డిపార్ట్మెంట్ కాదు .
ఎన్ని కార్డ్స్ ,డిపాజిట్ బుక .పాలసీ బిల్స్ ..... ఇన్నింటి మధ్య ఈయన
ఎక్కడ పెట్టాడో . నేను ఏ రోజు రూపాయి రాక పోక పట్టించుకోను . వెతికి
వెతికి పదిహేను నిముషాల తరువాత దొరికింది ,ఫోన్ చేస్తే సరిగా పోవడం లేదు .
మిస్స్డ్ కాల్ చూసి ఆయనే చేసారు . నంబర్ చెప్పాను .
అక్కడి వాళ్ళు అందరు పాప మీద జాలితో నిమిషాలు లెక్క పెడుతున్నారు .
లేట్ అయితే ఆన్లైన్ ఎక్జామ్ ఓపన్ చేయలేరు అంట .
పేరెంట్స్ కూడా పాపం ఆగిపోయి ఈ అమ్మాయికి
సహాయం చేయమని అందరిని అడుగుతున్నారు అంట .
స్టాఫ్ కూడా ఈ అమ్మాయి కోసమే హడావడి .
మళ్ళా ఫోన్ చేసాను . ఇంకా పది నిముషాలే . వచ్చిందా ?అడిగాను .
ఊహు సర్వర్ స్లో ..... కొంచెం నిరాశగా అన్నాడు .
ఈయన ఫోన్ కట్ చేయక ముందే పక్కన స్టాఫ్ అంటున్నారు .
మీ వైఫ్ ని పాప కాలేజ్ ఐ . డి స్కాన్ చేసి పెట్టమనండి అని .
''సరే మీరు మెయిల్ ఐ . డి ని ఎస్ ,ఎం .ఎస్ లో పంపండి ''
అని చూద్దును కదా మొబైల్ లో' లో బేటరీ' కాషన్ .
చచ్చాము . సాయిబాబా నువ్వే చూడు
అనుకొని గబా గబా కాలేజ్ ఐ . డి వెతికి (నయం పారెయ్య లేదు )
స్కూటీ మీద నెట్ కి పరుగు .
ఆపి స్కాన్ చేసే లోపే ఫోన్ .... మళ్ళీ ఇంకో మెయిల్ ఐ . డి చెప్పారు .
అది ఓపన్ చేసి ఉన్నాము అని . పంపారా అని అడుగుతూ నే ఉన్నారు ,
రెండు నిమిషాలే ఉంది . అందరు వాళ్ళ పాపే అయినట్లు టెన్షన్ పడిపోతూ ఉన్నారు .
నాకు టెన్షన్ అనిపించింది . పాపం నెట్ అబ్బాయి గబా గబా చేసాడు .
''వచ్చింది ''అటు వైపు నుండి ఈయన అరుపు .
హమ్మయ్య పాపకి ఇవ్వు ఫోన్ ''అన్నాను .
''లేదు నీ మెయిల్ చూడగానే లోపలి పంపేసారు . లాస్ట్ మినిట్ ''
పాప ఎలా ఉందో ఊహించగలను . చేతులు వణుకుతూ ఉంటాయి .
పరీక్ష ఎలా వ్రాస్తుంది ?సరే నా కూతురు అయితే మేనేజ్ చేస్తుంది నెగటివ్
థింకింగ్ చేయదు అనుకున్నాను .
అందరు పేరంట్స్ ఊపిరి పీల్చుకున్నారు అక్కడ స్తాఫ్ఫ్ తో సహా ....
వాళ్ళే ఓపన్ చేసి ఇచ్చారంట పాపకు టెన్షన్ పడొద్దు అని ధైర్యం చెప్పి .
అందరం పిల్లలు గల వాళ్ళమే . ఇలాటి టెన్షన్ లు పడిన వాళ్ళమే .
మళ్ళా ఫోన్ చేయాలి అని చూస్తే ''నో టాక్ టైం ''చెపుతూ ఉంది .
మొబైల్ కూడా ఆఫ్ అయిపోయింది . నా పవర్ అయిపోయింది అని .
అప్పుడు ఆకలి దెబ్బకి కళ్ళు తిరుగుతున్నాయి . ఇంటికి వచ్చి తిన్నాను .
సాయంత్రం ఇంటికి వచ్చి ''అమ్మా థాంక్యు మళ్ళా సారీ '' అంది .
''ఎందుకమ్మా ''అడిగాను .
''నీ వలెనే నేను వ్రాయగలిగాను . ఇంక ఒక్క నిమిషం దాటి నువ్వు మెయిల్
పంపినా వృధా అయ్యేది . చాలా మంది తిరిగి వెళ్లి పోయారు అమ్మ .
మేము చివరి దాకా ఆశతో ఎదురు చూసాము కాబట్టి వ్రాయగలిగాను ''
అంది .
''అవును ఏ పనైనా చివరి దాకా ప్రయత్నం చేయాలి . మన ప్రయత్నం సిన్సియర్
గా ఉంటె దేవుడు సహాయం చేస్తాడు '' అన్నాను .
నిజంగా సినిమాటిక్ గా ఉందా లేదా ?
పరీక్ష ఎలా వ్రాసింది అంటారా ..... ఎవరికి తెలుసు ?
లాస్ట్ దాకా ప్రయత్నం చేయండి . ఓర్పు ఉంటె సాదించగలరు
అని చెప్పటానికి పోస్ట్ వేసాను .....
ఇంతకీ మీకు ఎపుడైనా ఇలా జరిగిందా ?
4 comments:
wow!
చదువుతుంటే నాకే టెన్షన్ వచ్చింది!
అబ్బా! ఎంత టెన్షన్ పడ్డారండి:( అంతా మంచే జరిగినందుకు, మీకు మీ అమ్మాయికీ నా అభినందనలు.
krishna garu shymaleeyam garu thank you .
jaya gaaru net connection sariga leka mee comment choodaledhu . ippudu choosaanu.thanks for your consern.
Post a Comment