''శశి ఈ రోజు సినిమాకి వెళదాం . మనం కి '' అయ్యగారి
ఉవాచ .
అబ్బో మామూలుగా సినిమా కి పోవాలంటే నేను ఎంత స్కెచ్
గీస్తే ఈయన బయలుదేరుతారు . ఇప్పుడు మాత్రం చూడు ఆయనకై
ఆయనే పోదాము అంటున్నారు . అంతేలే ఎంతైనా ''ఎ . ఎన్ . ఆర్ ''
సినిమా కదా !ప్రాణం . పోనీలే పాపం లాస్ట్ సినిమా కదా నాగేశ్వరరావ్ ది .
నాకేమి ఎ . ఎన్ . ఆర్ అంటే కోపం లేదబ్బా ...
కాకుంటే మా అన్నగారు అంటే అభిమానం గాని .
అసలు పెళ్లి చూపులు అప్పుడు మీకెవరు ఇష్టం అని అడిగుంటే
ఏమి జరుగుండేదో !పేరుకేలెండి పెళ్లి చూపులు.అమ్మాయి మాటకేమి
పెద్ద విలువ లేదు . ఇక అబ్బాయికి కూడా శాస్త్రానికి చూపించడమే ...
పెద్దలకి ఇష్టమైన వాళ్ళతోనే పెళ్లి . ఒక్క హాబీ అయినా ఇద్దరికీ ఒకటి గా
ఉందా ?నాకేమో బుక్స్ , సినిమాలు .... ఈయనకేమో గేమ్స్ ,సుడోకు ,పజిల్స్ .
ఇద్దరం వేరే అభిమానులం అయినా ఎప్పుడూ ఒకరి కోసం ఒకర్ని
మారమని అడిగిందే లేదు . ఇంకా ఇదిగో నీ ఫేవరేట్ సినిమా వస్తుంది
చూడు అని హెల్ప్ చేసుకుంటూ ఉంటాము . మారటం కాదు అవతలి
వారి స్పేస్ గౌరవించడం కూడా అవతలి వారి నిజమైన సంతోషాన్ని
రెట్టింపు చేస్తుందేమో !
సర్లెండి పాత న్యూస్ రీల్ ఎందుకు గాని ''మనం '' సంగతి కి వద్దాము .
నివాస్ కూడా ఫేస్ బుక్ లో ఇంకోసారి చూడాలని ఉంది అని పెట్టాడు .
వాదికేడైనా ఇష్టం అయితే మన బాష కాకపోయినా ''బర్ఫీ ''
''చెన్నై ఎక్స్ప్రెస్ '' ఇలాంటివి డౌన్ లోడ్ చేసుకొచ్చి బలవంతంగా
నన్ను కూర్చోపెట్టి ,అనువాదం చేసి మరీ చూపిస్తాడు . కాని ఇంత
ఫీల్ అయి పోస్ట్ వేయడం ఎప్పుడూ చూడలేదు .
నిజంగానే హాల్ మొత్తం ఫామిలీస్ తో అప్పటి పెద్ద వాళ్ళతో
కళ కళ లాడుతూ ఉంటె చాలా సంతోషం అనిపించింది .
ట్రైలర్ చూసారు కదా !నాగ చైతన్య తాత లాగా ,నాగేశ్వర రావ్
మనుమడిలాగా ... ముచ్చటగా ఉంది కదా !అది ఎలాగా అంటే
అదే కధ .
కధ చెప్పాలి అంటే మనసు రావడం లేదు .
చూస్తే మీరు ఇంకా థ్రిల్ అవుతారు .
నాగార్జున (బిట్టు ) ఆరేళ్ళ వయసులో వాళ్ళ అమ్మ నాన్న (నాగ చైతన్య ,సమంతా )
కారు ప్రమాదం లో చనిపోతారు . వాళ్ళు మళ్ళా పుడితే నాగార్జున
గుర్తు పట్టి వాళ్ళ పెళ్లి చేయాలి అనుకుంటాడు . సరే నాగేశ్వర రావ్
ఎవరు అంటే బిట్టూ లాగే చిన్నప్పుడు కారు ప్రమాదం లో
అమ్మా నాన్న లను పోగొట్టుకుంటాడు . మరి వీళ్ళతో సంబంధం
ఏమిటి అంటే ... మీరు స్క్రీన్ మీద చూడండి . స్క్రీన్ ప్లే చాలా
చక్కగా ఉంది . కనీసం కర్చీఫ్ మెట్ల మీద జార్చే సీన్ కూడా వదలకుండా
చాలా బాగా వాడుకున్నారు . మ్యూసిక్ అదుర్స్ . కధ లో ఎంత లీనం
అయిపోతాము అంటే మామూలుగా ఆడవాళ్ళు వచ్చే దగ్గర ఈ దరిద్రపు
సీన్స్ ఏమిటి అని మేము విసుక్కునేవి కూడా తెలీకుండానే కధా గమనం లో
హాయిగా దాటేస్తాము .
కుమార్ దర్శకత్వం బాగుంది . అసలు పాత నాగార్జున ,శ్రియ ల
మధ్య జరిగే కదా లో వాళ్ళ మధ్య ఎంత చక్కగా ఉంది అంటే
నిజంగా అలాంటి ఒక జంట మన ముందే ఉంది అన్నట్లు అనిపించింది .
చీర కట్టు లో సమంత ఎంత అందంగా ఉందో అనిపించింది .
మాములుగా పౌడర్ డబ్బా అనుకుంటూ ఉంటాను . ఇప్పుడు నిజంగా
బాగా నచ్చింది ) ఇక శ్రియ అయితే ఇంకా ... చీర కట్టు లో అందం
నీల కంట ,శేఖర్ కమ్ముల తరువాత కుమార్ బాగా చూపించారు .
ఇంకా విశేషాలు చెప్పమంటారా,అఖిల్ ని చివరలో ఎంట్రీ చేయడం ,
అమలను ఒక పాటలో కొంచెం చూపడం ఇలాటివి చాలా బాగున్నాయి ....
అందరికంటే ఎవరు కనిపిస్తే
ఎక్కువ విజిల్స్ వచ్చాయో చెప్పుకోండి ... ఎస్ ... బ్రహ్మానందం .
అమితాబ్ కు కూడా . జోక్స్ కి కూడా బాగా నవ్వుకున్నాము .
ఈ జన్మలేమిటి ,చావు ఏమిటి ?అని అనుకోవాకండి .
మా తమ్ముడికి కొడుకు పుడితే మా నాయనమ్మ బంగారు ఉగ్గిన్నె
తో పాలు పోసింది తను బ్రతికి ఉండగానే నాలుగో తరం చూసింది అని .
మన దేశం లో పెద్ద వాళ్ళు మళ్ళీ పుడతారు అని అంత నమ్మకం .
నిజంగానే పెద్ద వాళ్ళ అలవాట్లతో , పోలికలతో పుట్టే వాళ్ళని
చూస్తూ ఉంటాము కదా . మన పెద్ద వాళ్ళు పిల్లలుగా అయినా మనతో
పుట్టారు అనుకుంటే మనకు ఎంత బాగా ఉందని అనిపిస్తుందో కదా !
ఇంకా ఇక్కడ సోల్ మేట్స్ అనే పదం వాడారు . మామూలుగా మాట్రిమొనీ లో
కూడా చూసాను ... అది మన జంట అనే అర్ధం లోనే వాడుతున్నారు .
కాని మన సోల్ మేట్ మన జంటే కావాల్సిన అవసరం లేదు .
అక్క , ఫ్రెండ్ ,ఇంకా ఎవరైనా కావొచ్చు . వేరే జీవుల్లో కూడా ఉండొచ్చు .
ఎందరో మనతో మన సోల్ నుండి పుట్టొచ్చు . దీని గురించి
చాలా పెద్ద సిలబస్ ఉంది .
మరి ఒకరి మీద ఒకరికి ప్రేమతో ఇలా పుడుతూనే ఉంటారా అంటే
... అవును . ఎప్పటిదాకా అంటే .... ప్రేమ తీరేవరకు .
ప్రేమ తీరుతుందా అంటే .... ఖచ్చితంగా తీరుతుంది .
మన గోలీలు , గాలి పటాలు ,మట్టి బుడ్డీలు , గుజ్జెన గూళ్ళు ,
సినిమాలు సరదాలు ,భార్యతో సరసాలు ,పిల్లలతో ఆటలు
ఎన్నిటిని మనం కొద్ది రోజులకు మార్చిపోవట్లేదు . ఇదీ అంతే .
అసలు జన్మ మీద కూడా ఆశ తీరిపోతుంది . ఆ రోజున ఈ
జనన మరణ వలయం నుండే మనం బయటకు వచ్చేస్తాము .
ఆ ఒడ్డు ఎలా ఉందా అని ఆ చివరికి ఆయాసపడుతూ ఈదుతాము .
మళ్ళీ ఈ ఒడ్డు ఎలా ఉందో అని ఈ వైపుకు ఈదుతాము .
ఎప్పుడో అలిసిపోయి ఇసుకులో పడుకొని ఆకాశం వైపు
చూస్తూ ఎక్కడ చూసినా ఇంతే . ఇలాగే ఉంటుంది . ఈదటం
అనవసరం అని తెలుసుకుంటాము . అంతే ఆట ఆ రోజుతో
ఆగిపోతుంది . లోపలుండే చిలుక ఎగిరి పోతుంది .
'' ఎ . ఎన్ . ఆర్ గారు మిమ్మల్ని తెలుగు వాళ్ళం ఎప్పటికీ మరచిపోము అండి ''

6 comments:
మీరు రాసింది చదివాక ఈ సినిమా చూడాలనే కోరిక ఇంకా ఎక్కువయింది :)
kiran choodandi . kaani kenadalo veelu kaaka poyinaa sare cinima hall ke velli choodandi .
Last statement was awesome, I'm still dumbstruck. So much philosophy in such simple words !!!
-Laxmi
thank you laxmi garu
YES mam, very very nice film in recent times,great tribute for ANR(not ASR :D)garu...
murali positive thinking and good attitude ....you are nice student whom our country is in need.thnx for ur comments
Post a Comment