బాపు గారు మిమ్మల్ని మర్చిపోలేను ....
ఇలా అంటే రమణ గారిని మర్చిపోయినట్లా ?
ఊహూ కాదు కాదు ఈయన గూర్చి అన్నవన్నీ ఆయన
గూర్చి కూడా అనుకోండి . 31/8/2014 తేది మంచిదే కాదబ్బ .
తలుచుకుంటే ఇంకా దిగులుగా ఉంది . పెద్ద ఈ ''బాపు ''గారు
అదే లెండి సత్తి రాజు లక్ష్మి నారాయణ నాకేమి చిన్నాయనా ?
పెదనాయనా ?లేక అక్షరాలు దిద్దించిన అయ్యోరా ?నేను మనసులో
పెద్ద బండరాయి పడినంత బాధ పడటానికి .... ఏమి నేర్పించాడు .
కాదు కాదు నేర్పించాడు ,జీవితపు రసం ఎంత మధురంగా ఉంటుందో ,
కాపురాన్ని ఎంత అందంగా దిద్దుకోవోచ్చో ,రోటి పచ్చడి
కమ్మదనము , అలకలోని అందము ..... ఒకటేమిటి మా
పెద్దోళ్ళు మాకు చెప్పని కాపురం విషయాలు అన్నీ తెలుసుకున్నాము .
మా కాపురాలు కాసింత నవ్వు కళ తో కళ కళ లాడుతున్నాయంటే
ఆ జంట చూపించిన కళ తోనే అని చెపుతాను .
అదేమిటి ఆయన బొమ్మలు వేసాడు . కార్టూన్లు వేసాడు .
సినిమాలు తీసాడు,బుడుగు సీగాన పసూనంబ ,
సీతా కల్యాణం ,సాక్షి .....
ఇవి కదా చెప్పాలి అంటే .....
ఏమో నాకు తెలీదు .
ఇది నా ప్రపంచం నాకు తెలిసినవే చెపుతాను .
ఆయన అయ్యన్నీ చేసుండొచ్చు .
ఇప్పుడు మీరు ఆ సినిమా ఎప్పుడు తీసారు ?
పద్మశ్రీ ఎప్పుడొచ్చింది ?
ఇయ్యన్నీ అడిగితే నాకు తెలీదు .
అయినా ఆయనంటే ఇష్టం .
ఎంత ఇష్టం అంటే నిన్న మా పాప హేమ మాధురి పెళ్లి శుభలేఖ లో
సప్త పది గురించి ఆయన ఫాంట్స్ లోనే వ్రాయించాను .
చాలా మంది ఆ ఫాంట్స్ అర్ధం కాలేదు అన్నా నా మటుకు నాకు
తృప్తి గా అనిపించింది .
పెళ్లి కాక ముందు పిన్నమ్మలకు చపాతీ లు చేసి
ఇచ్చినపుడో ,వాళ్ళ పిల్లలను ఎత్తుకొని తిప్పినపుడో
వాళ్ళ ఇచ్చే ఆంధ్ర భూమి ,ఆంద్ర జ్యోతి ,విపుల , చతుర
వనితా జ్యోతి కొంచెం పెళ్లి అయ్యే ముందు వచ్చిన స్వాతి
ఇదిగో ఇదే మాకు అందే విశాల ప్రపంచం . అందులో బాపు రమణ
అనే పేర్లు వస్తే ఆగిపోయేవాళ్ళం . జోక్స్ చదివి మురిసిపోయేవాళ్ళం .
ఇక ఆయన సినిమాల్లో చూపించేవి .... ఎన్ని చెపుతారో .
''ఆరు నైదవతనములు ఏ చేతనుండు ,అరుగులలికే వారి అరచేతనుండు ''...
అని ఇల్లు దిద్దుకుంటేనే కళ అని చెపుతూ ఈ కాలం లో కూడా
రావణాసురులు ఉన్నారు పరాకుగా ఉండండి అని చెప్పకనే చెపితిరి .
మగవాళ్ళు కాసింత ఆశలు పెట్టి పొగిడితే పొంగిపోయే ఆడవాళ్ళకు
''రాదే చెలి నమ్మరాదే చెలి మగ వారినెపుడూ నమ్మరాదే చెలి ''
మగవాళ్ళు కాసింత ఎక్కువ సమానం ,
అదే లోకం తీరు సర్దుకుని పోమ్మా ,అని చూపిస్తిరి .
మళ్ళా వ్యక్తిత్వం తో ఉంటూనే కాపురం లో తెగే దాకా జగడాలు
ఉండకూడదు అని ''ఆగడాలు పగడాలు ఆలు మగల జగడాలు ''
అని మురిపిస్తిరి . ఒక్కో సినిమా ఆడవాళ్ళ వ్యక్తిత్వాన్ని పెంచే
ఒక్కో ఆణిముత్యం .
రాధా గోపాళం లో రాధ ను కేస్ వదిలేయమని భర్త గోపాలం
ఆర్డర్ వేస్తూ ''నేను భర్త ని '' అని గర్వంగా అంటాడు .
అప్పుడు రాధ అనే మాటలు నాకు ఎంతలా గుర్తుంటాయో....
''నేను రాధ ని , నేను మనిషిని , నేను లాయర్ ని ''
మనసు పెట్టి వినగలిగిన మగవాళ్ళకు దానిలో ఎంత అర్ధం
కనిపిస్తుంది . కావాల్సిందల్లా మగవాళ్ళం అనే దురహంకారాన్ని
వదిలేసి విషయాన్ని మానవత్వం తో, తన భార్య కూడా మనిషి
అనే జ్ఞానంతో చూడటమే . బాపు రమణ లు పై అందాలనే ఎప్పుడూ
చూపించలేదు .... వాళ్ళ పాత్రలన్నీ మానవత్వం వెలిగిపోయే సగటు
పాత్రలే .
నిజంగా ఆడది మెచ్చినది అందం అంటారు . నిజంగా ఆడవాళ్ళలో
ఇంత అందం ఉందా అని నేను అబ్బురంగా చూస్తుంటాను .
అతిశయోక్తి లాగున్నా వాళ్ళు చూపించిన కోణాలన్నీ నిజమే .
బాపు గారి బొమ్మలు నేను దగ్గర నుండి ఎప్పుడూ చూడలేదు .
కనీసం ఇప్పటికీ నా దగ్గర కాలెండర్ లు కూడా లేవు .
కాని మా పెద్దక్క అత్తగారింట్లో మా పెద్దక్క బావగారు వేసిన
బాపు బొమ్మల నకళ్ళు చూసినపుడు నేను నిజంగా ఎంత
ఆనందపడ్డానో .... ఆ బొమ్మల అందం నాకు అప్పుడే తెలిసింది .
ఒక ఆశ్చర్యం ,ఒక అలక ,ఒక విరహం ,ఒక సరసం , ఒక ఆరాధన ,
ఒక విరుపు ,ఒక కంటి ఎరుపు ,మురళీ గానం లో పడి మైమరుపు ....
ఏమిటివి ఇన్ని భావాలు రంగులను పులుముకొని నా చుట్టూ ....
నకళ్ళే ఇంత బాగుంటే నిజమైన చిత్రాలు ఇంకెలా ఉంటాయో !
ఇంత వరకు చూసిందే లేదు దగ్గర నుండి .
చెప్పకూడదు కాని రమణ గారు చనిపోయినపుడు బాపు గారు
కూడా ఇంకా ఎంతో కాలం బ్రతుకరు అనుకున్నాను .
ఎందుకంటె మాకు మెడిటేషన్ క్లాస్ లో చెపుతారు
ఒకటిగా పుట్టిన జంట ఆత్మలు , లేదా ఆత్మీయంగా
ఉండే భార్యా భర్తలు ,అన్నా చెల్లెళ్ళు ఎవరైనా కానీండి ,
వాళ్ళ హృదయాల మధ్య ఒక శక్తి ప్రసారం ఎల్లప్పుడూ జరుగుతూ
ఉంటుంది . అందుకే ఒకళ్ళ దగ్గరుంటే మరొకరికి బలం
వచ్చినట్లు ఉంటుంది . వాళ్ళలో ఒకరు చనిపోయినపుడు
ఈ ప్రసారపు తీగ తెగిపోతుంది . ఆ దిగులు లోపలి పాకి
వాళ్ళు కూడా చనిపోతారు .... ఒక వేళ వాళ్ళు కూడా
ధ్యానులై ఈ విషయపు ఎరుకతో ఉంటె తప్ప .....
పోయిన వాళ్ళతో త్వరగానే వెళ్ళిపోతారు .
ఒక కంటితో అయినా మనం చూడగలం .
కాని పరిపూర్ణత్వం కోసం దేవుడు రెండు కళ్ళు
సృష్టించాడు .
అదే దేవుడు కళ కు పరిపూర్ణత్వం కోసం వాళ్ళను
ఇద్దరుగా సృష్టించాడు . కళ్ళు వేరైనా వారి
చూపు ఒక్కటే . రూపాలు వేరైనా వారి ఆత్మ ఒక్కటే .
వారి కళా రూపాలు కలకాలం చూసి మనం ఆనందించడమే
మనం వారికి ఇవ్వగల నివాళి .
******************

2 comments:
పరమపదించె నయ్యొ మన 'బాపు ' - మహోన్నత కార్టునిస్టు; చి
త్తరువుల సృష్టిలో యశము దాల్చు మహాద్భుత శిల్పి; అక్షరాల్
పరువపు కన్నె సోయగపు వంపుల రీతి లిఖించు స్రష్టయున్;
తెర పయి తెల్గు సంస్కృతికి దృశ్య మనోజ్ఞత గూర్చు దర్శకుం
డరయ - తెలుంగు లోకమున అంద మికెట్టుల బట్ట గట్టురో!
avunu phaneendra garu...mallaa aayane pudatharo yemo !chala baga chepparu
Post a Comment