Sunday 8 May 2011

అమ్మ.....మధురిమ.....తన కంటి చెమ్మ...


 అమ్మ అంటే జీవిత మధురిమ.ఎంత మంది ఎన్ని వ్రాసిన అమ్మ తో అనుభూతులు వారికి గొప్పవే.(నిన్న తనతో గడపటానికి వెళ్ళాను.అందుకే ఇది ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను.మరి అమ్మ కేమి ఇచ్చాను?మధురంగా నా ప్రేమతో నిండిన నా పెదాల స్పర్శ తన బుగ్గపై )
                     ఆడపిల్లలంటే తల కొట్టుకొనే రోజుల్లో ముగ్గురు ఆడ పిల్లలు ఒక బాబుని కన్నా ఎప్పుడు మాపై వివక్ష నీడ పడకుండా చదువు లోనే  కాక అన్ని రంగాలలో
ప్రోత్చహించింది.ఏమి సాదించినా వెరీగుడ్ ఇంకా సాదించాలి అని మెచ్చుకునేది.ఏదైనా సాదించాలనే తపన 
సాదించ గలము అనే స్ఫూర్తి ఆ అమృత మూర్తి నుండే అందుకొన్నాము.
                         చివరికి నేను పురిటి నెప్పులు పడుతూ "అమ్మ "అని అరిస్తే 

నలుగురు బిడ్డలను కన్న తాను నా కష్టానికి కంటి చెమ్మతో చూస్తూ 

"అమ్మ అంటావేమిటి ?అమ్మ కేమి శక్తి ఉంది ?అమ్మ ఏమి చేయలేదు నాయనా......నారాయణా అని అరువు ఆయనే చూసుకొంటాడు" అని విలవిల 
లాడింది.
తన కేమి తెలుసు అమ్మ అనే పిలుపు బాధ లను తగ్గించే మంత్రం అని
ప్రతి బిడ్డ ఉహ తెలీక ముందే కనుగొంటాడని ,తలపులలో ఉంచుకుంటాడని.
   మరి ఈ అమృత స్పర్శ ఒక తరానికే పరిమితమా? 
కాదు.అమ్మ......అమ్మకు అమ్మ........అమ్మమ్మ ..........
ఈ జీవ స్పర్శ నిర్జీవ జీవితాన్ని పునరిజ్జీవింప చేస్తూ అమృతవాహిని అయి 
తరాలను పులకింప చేస్తూ సరస్వతి నదిలా అంతర్వాహినిగా మన జీవితాలలో సాగిపోతూ ఉంటుంది."అమ్మ కు జిందాబాద్"
"ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు నివసిస్తారు"
పెద్దల మాట పెరుగన్నం మూట.వారు అనుబవంతో చెప్పిన సంస్కృతి కి 
వారసులైన మనం "ఎందుకు చేయాలి?"అని మూర్కంగా ప్రశ్నించుకుంటూ కూర్చోకుండా అనుభవం తో చెప్పిన 
దానిని ఆచరిస్తూ మన జీవాన్ని కాపాడుకుందాము.

3 comments:

రాజ్యలక్ష్మి.N said...

mother's day roju amma daggariki velli,

ammaku manchi kaanuka icchaarandi.

meeku mother's day subhaakaankshalu...

రాజ్ కుమార్ said...

మీకు మదర్స్ డే శుభాకాంక్షలండీ..కొంచేం ఆలస్యంగా. .;)
(చిన్న రెక్వెస్ట్.. వర్డ్ వెరిఫికేషన్ తీసెయ్యండీ..)

శశి కళ said...

raji gaaru ,rar gaaru mee suchanalaku abhimaananiki thank u very much.sasi