Sunday 15 May 2011

నేను--violin-----violence

నా పెళ్ళైన కొత్తల్లో సంగతి.పెళ్లి అయిన తరువాత మా ఇంటికి మా వారు వచ్చి నపుడు నేను వయోలిన్ నేర్చుకోన్నానని తెలిసింది.ఒక సారి వాయించవా?
అని అడిగారు(ఖర్మ అలా అడిగించింది) సరే అని వేరే
వాళ్ళ ఇంట్లో వయోలిన్ ఉంటె తెప్పించి మొదలు పెట్టాను.
(ఎలాగయినా శబాష్ అనిపించుకొని వయోలిన్ 
కొనిపించు కోవాలని అనుకున్నాను )
 ఇద్దరం శ్రద్ధగా కూర్చున్న తరువాత మొదలు పెట్టాను.
మొదట మోహన రాగం అయితే నచ్చుతుంది అందరికి అని 
మొదలు పెట్టాను.గ గ పా పా ....దప సా సా....వర వీణ ...మృదు పాణి  ...వనరుహలో ..చను రాణి.....
పాట అయిపోయినా అయన మొహం లో ఫీలింగ్స్ లేవు
(ఆయనకు సంగీతం గూర్చి ఏమి తెలీదని అప్పుడు తెలిసింది)అర్ధం అయితే వాయిన్చటమే గొప్ప ఇక ఏమి రాని వాళ్లకి అర్ధం కావాలంటే ...దేముడా ఏమిటే ఈ అగ్ని పరీక్ష ?
కల్యాణి వాయించాను.పేస్ లో ఏమి మార్పు లేదు.భైరవి ...ఊహు ........
బ్రోచేవారెవరురా ?...........ఊహు.......ఎవరు వచ్చి బ్రోవలేదు...............
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి ..........ఊహు.......ఆమె కూడా రాలే.....
(ఇక్కడ వయోలిన్ కోనీడని మనకు టెన్షన్ )
నన్ను బ్రోవ నీకు భారమా?నీదు స్మరణ గాక వేరే ఎరుగను.......ఊహు.......ఏమిటి దారి?
రోషం వచ్చేస్తుంది,రాగాలకి ఇల్లు కదిలి పోతుంది ఈన గారి మనసు మాత్రం కరగలేదు.
ఒక చిన్న ఉపాయం వచ్చింది.ఎస్ అలాగే చేయాలి అనుకొన్నాను.సినిమా పాటలు వాయిస్తే
ఎలా ఉంటది అనుకోని దేవుడికి దండం పెట్టుకొని
(పనిలో పని కొబ్బరికాయ లంచం ఇస్తానని అనుకొన్నాను)
ఉపాయం బాగుంది కాని నాకేమి సినిమా పాటలు రావు.ఒక అక్క ముద్దుగా నాకు 
ఒక పాట నేర్పించింది.అదేమిటి అంటే "చూడు పిన్నమ్మ పాడు పిల్లడు.......పాట"
వాయించబోయి ఒక్క క్షణం ఆలోచించాను.బుద్ధి ఉండే వాళ్ళు ఎవరైనా ఆ పాట వాయిస్తే
వయోలిన్ కొనివ్వరు అని నా బుద్ధి ఆపేసింది.ఏమిటి దారి?
సమస్య మళ్ళా మొదలు?సరే మిస్సమ్మ లో పాట "సా ని స రి మా ...రీ ని సా సా....
మాకు మేమే మీకు మీరే .....పాట మొదలెట్టా పోయాను.
(మళ్ళా బుద్ధి ఒక్క చరుపు చరిచింది.కొత్త పెళ్లి కొడుకు ఆ పాట పాడితే పారి పోతాడని)
       అయ్య..........urekhaa ...........ఒక పాట గుర్తు కు వచ్చింది.అందరికి తెలిసిన పాట.
దొరికిందే చాలని వాయించాను.ఏమిటంటే జనగణమన........
 కద అయిపోలేదండి.అక్కడే మొదలు అయింది.

            మద్యహ్ననికల్ల రాజీవ్ గాంధి చనిపోయారు.వారం రోజులు టివి లో,రేడియో లో
 వయోలిన్ అంటే వయోలిన్...........ఇంకేక్కడ కొనిస్తారూ........ఇరవయ్ ఏళ్ళు అయినా

నేనేదో రాజీవ్ గాంధి ని చంపినట్టు ఇంత వరకు వయోలిన్ కొనిలేదు .

8 comments:

కొత్త పాళీ said...

హ హ హ. హిలేరియస్!!

రాజ్ కుమార్ said...

హిహిహిహిఇ.. బావుందండీ...
టైటిలే కేక లా ఉందీ..
మీరు వయొలిన్ వాయిస్తే ఇంత వయొలెన్సా?? ;)

రాజ్ కుమార్ said...

plz disable word verification... ;)

ఇందు said...

hahaha! superrrrrrrrrr :))))))))))

శశి కళ said...

mugguriki thanks for ur encouragement

prasad said...

mee katha chala bagundandi.jandyala cinema chusthunnatlu vundi.

శశి కళ said...

thanks prasad gaaru...

Ennela said...

ayyo, rajiv ni champindi meeraa..anavasaramgaa yevarino anumaaninchaa....
super super...