Saturday 20 August 2011

కృష్ణా.....నా బుజ్జి కన్నా....

 బృందావనమాలి ..రా రా మా బ్లాగ్ కు ఒకసారి 
అలిగి చెలరేగి చేద్దాము అల్లి బిల్లి కొంటె అల్లరి....
 వచ్చేసా...శశి...నీ బక్తికి మెచ్చేసా.........శశి...నిన్నే...
నోరు మూసుకోమ్మా .....లేకుంటే ఈగలు పోతాయి...

"నీ చిరు నవ్వుల వెన్నెలలో మైమరువగా చేయగా ఏలనో..
మైమరిచిన చెలి నోరే మూయదని నవ్వుతు చెప్పెవేలనో?"

 సరే..శశి ఏమైనా కబుర్లు చెప్పమ్మా...
చెప్పనా స్వామి..అయినాగాని నువ్వు ఇందు దగ్గర 
చెప్పించు కుంటావు కదా...

 ఈ రోజు నువ్వు చెప్పమ్మా...
  
నీ లీలలే చెపుతాను...నువ్వు దేవకీ,వసుదేవులుకు
 జైలులో పుట్టావు.ఆహా...యెంత సత్యం చెప్పావు శశి 
మాకు తెలీదని పే ....ద్ద.

"తడవ తడవకు కడుపు శోకము తాళజాలక
   పెంపు కిచ్చెను దేవకీ..."
మీ అమ్మ బలే ఏడ్చింది పా...పం.

 "అరికాళ్ళ తామరములు,మా అయ్యా బొడ్డునా పారిజాతం 
  అన్ని ఉన్నాయిరా..నా తండ్రి నిన్ను ఎడబాసి నేనేటుల   జీవింతురా....శ్రీ రంగ రంగ రంగా...మా అయ్య కావేటి రంగ రంగా

ఏడుపు వస్తుంది...తరువాత చెప్పు ...

ఏముంది స్వామీ యశోదా,నందులు నిన్ను ప్రేమగా సాకారు.
నువ్వేమో అల్లరే అల్లరి ....ఏమి చేసాను శశి ......

"విన్నావ యశోదమ్మా...మీ చిన్నికృష్ణుని లీలలు"

"అల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిన గజ్జలు 
 గల్లన ,తల్లి మేలుకొని దొంగను చూసి అల్లరి 
 యేమని అడిగినందుకే ...అలిగిన వేళనే చూడాలి..."
 హ...హ.....హ....గుర్తుంది...బాగాఎడిపించేవాడిని.

తరువాత చాలా మంది రాక్షసులుని చంపావు.
 ఒక రోజు కాళియ పాముని చంపాలని మడుగు లోకి దూకావు.

"కాళింది మడుగున కాళియుని పడగల ఆ బాల గోపాలా
ఆ బాల గోపాలుని ...అచ్చెరువున..అచ్చెరువున..." 

చూసావా అనకొండ లాంటి పామును ఎలా ఆడిస్తున్ననో...నువ్వు ఉన్నావు ...అనకొండ
 సినిమాలో కాళ్ళు పైన సీట్లో పెట్టుకున్నావు.

(హుష్....చెప్పకూడదు)

శశి ఇంకా...చెప్పు....ఇంకానా...సరే...ఇంద్రునికి కోపం వచ్చి మీపై తుపాను పంపాడు లైలా లాంటిది...

ఆమె ఎవరు శశి ? అబ్బ ఆమె కాదు స్వామీ...అది తుపాన్ పేరు.

 నువ్వేమో గోవర్దన గిరి గొడుగులా పట్టి అందరిని కాపాడావు.
"లీలగా ఒక దొడ్డ కొండ ను వేలనేత్తిన దేవరా..ఏల నన్నిట 
వేల నేత్తవు గోవర్దన గిరిదారి...శౌరి శ్రీహరి కృష్ణా........"

  ఇంకా తరువాత ..బృందావనానికి వెళ్లావు.
 అక్కడ రాధతో,గోపికలతో నీ రాస లీలలు....

అంత మందిని ఎందుకు చేసుకున్నావు స్వామీ ?
చేసుకోవటం కాదమ్మా...అది పరమాత్ముని లోని సమ్మోహన శక్తి.

 భక్తీ లో అది కూడా ఒక పద్దతి ,నాలో వాళ్ళని ,వాళ్ళలో నన్ను 
ఊహించుకోవటం....రాధ మనిషి లోని ఆత్మఅది ఎప్పుడు 
పరమాత్మ అయిన నన్నుచేరుకోవాలని తపిస్తూ ఉంటుంది.

"ముని జన మానస మోహిని లోహిని బృందావనం 
మురళి రవళికి ఆడిన నాగిని బృందావనం"
 ఇంకేముంది స్వామి...దానవుడైన మీ మామ కంసుని 
చంపి మోక్షం ఇచ్చావు.

"మారుజనక మదుర వేణి మామ కంసుని
చేరి వదియించిన శౌర్య బాల మంగళం..కృష్ణ మంగళం"

   శశి బాగా చెప్పావు ఏమి కావాలో కోరుకో..

నాకేమి కావాలి ...ఇది చూసిన చదివిన..
కృష్ణా అన్న వారికందరికీ కావలసినవి అన్ని ఇచ్చెయ్యి.

నీకేమి వద్దా....అందరు బాగుంటే నేను బాగున్నట్లే కదా.
మన భారతీయలు ఏమంటారో తెలుసు కదా...

"లోకా సమస్త సుఖినోబవంతు"

అలాగే కానిమ్మ ...నీ పెళ్లి కాక ముందు నుండి కూడా
నువ్వుఏమి అడిగితె అది ఇచ్చాను కదా.

 "ఎవరు కన్నను,ఎవరు పెంచిన,చివరి కతడానంద మిచ్చినది 
ఎవరికి?....తలపు లుడిగి తత్వమేరిగి తనను ఆశ్రయించిన 
 వారికి...తనను ఆశ్రయించిన వారికీ..."

 స్వామీ చివరగా మంచి పాత పాట వినిపిస్తాను వినండి.

"రసమయ జగతిని రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మదురిమలో
  ఎల్లరి మనములు చల్లన చేసే నల్లని దేవుని అల్లరిలో..."

 ఆ......ఆ......ఆ.....ఓ...ఓ....లాహిరి లాహిరి లో....ఓహో...
జగమే...ఊగెనుగా....ఊగెనుగా...తూగెనుగా........


10 comments:

మధురవాణి said...

చాలా ముచ్చటగా ఉన్నాయండీ కృష్ణుడితో మీ కబుర్లు.. :)

రసజ్ఞ said...

హహ బాగుందండి!! పాటల మధ్యలో మాటల ఛలోక్తులతో చక్కగా ఉంది మీ టపా.

ఇందు said...

కృష్ణష్టమి శుభాకాంక్షలు శశి! బాగుంది నీ టపా! :)

మాలా కుమార్ said...

బాగా రాసారు .
శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు .

రాజ్ కుమార్ said...

బావున్నాయండీ మీ కబుర్లూ...
కృష్ణాష్టమి శుభాకాంక్షలు..

ఇందు said...

నాదగ్గర చక్కగా కబుర్లు చెప్పించుకుంటున్నడు కదా! మళ్ళీ పిలిచిమరీ నువ్వు చెప్తావేంటి ;) నో నేనొప్పుకోనూఊ! నో ;) [నిన్న నా పేరు చూడలేదు.....అలా ఆ బొమ్మలు చూస్తూ చదువుకుంటూ వెళ్ళిపోయా! ఇవాళ మళ్ళి చూసా :) కెవ్వ్వ్వ్! నా క్రిష్ణుడిని ఇచ్చేయ్.....ఇచ్చేయ్]

శశి కళ said...

కెవ్వ్....కన్నయ్యా...ఇంత మంది స్నెహితులిచ్చావా
థాంక్యు...థాంక్యు....మీ కందరికి వెల్కమ్...
ఇంక యెప్పుడూ నాతొనె ఉండాలి సరెనా...
క్రిష్ణయ్యా అందరికి యెమి కావాలంటె అవి ఇచ్చెయ్యి.

Anonymous said...

ఒయ్ నేను క్రుష్ణుని ,నితొ మాట్లాడినది నేను కాదు బాల
NTR నేను ఇప్పుడే నీ blog చూస్తున్నాను. అయిన నీ కొరిక మెచ్చాను, అందరికి ఇస్తాను.

kiran said...

కేవ్వ్వ్....అరుపులమ్మ శశి అరుపులు...
నీ భక్తి కి మెచ్చి నీతో ఎక్కువ సేపు గడుపుదాం అని ..నీ కోరికలు అన్ని తీర్చుదాం అని...నా జన్మదిన వేడుకలు జరుపుకుని నిదానంగా వచ్చితిని..
ముందు నాకు వెన్న పెట్టు ..ఆ తర్వాత అటుకులు పెట్టు...ఆ తర్వాత నువ్వు చేసిన పిండి వంటలు పెట్టు..
ఇవన్ని ఆరగించాక.....నిద్ర రాక పోతే నీ కోరికలు వింటా.. :P (సరదాకి రాసానండి...)

అనకొండ సినిమాకి కళ్ళు పైన పెట్టేసార..హహ్హహః.same pinch ..:)

శశి కళ said...

హుష్...మనిద్దరం శేం పించ్ అని నాకు ముందె
తెలుసు