Friday, 12 October 2012

ఏమిటి నిజమా?ఇలా కూడా బ్రతకోచ్చా?

హా....చెప్పు ....టి.వి.సీరియల్ మధ్యలో కరంట్ 
పొతే విసుక్కున్నట్లు ....తూగుతుంటే లేపిన 
పెద్ద మనిషిని విసుక్కుంటూ తెల్ల కాగితం ,పెన్ 
తీసుకున్నాడు చేతిలోకి....

''పేరు ఏమిటి?''....చెప్పాడు 
''ఎక్కడ ఉంటారు?''చెప్పాడు అతను.

''ఏమి పోయింది?ఎప్పుడు?''

చెప్పినది విని మన్మోహన్ గారు మాట్లాడితే వినపడి నట్లు 
ఉలిక్కి పడ్డాడు.
''ఏమిటి అది పోయిందా?నిజమా?''

''నిజమండి''బాధగా చెప్పాడు అతను.

''నిండుదా?ఖాళీదా?''అడిగాడు.

''అయ్యో ఖాలీది వాడు ఏమి చేసుకుంటాడు చెప్పండి 
నిండుదే '' దిగులుగా తరుక్కుని పోయిన గుండెతో 
భారంగా చెప్పాడు.

నిలబడ్డాడు రైటర్ ....''అయితే మీరు ఏమి చేస్తున్నారు 
ఇప్పుడు"రైలు ప్రమాదం జరిగితే కాపాడకుండా
ఫోటోలు తీసే మొహం వేసుకొని...

''ఏమి చేస్తాము చెప్పండి.ఉదయాన్నే తోటకూర,గోంగూర 
మన్ను కూర శుబ్రం చేసి తరిగి తగు మోస్తర ఉప్పు వేసి 
....''చెపుతూ ఉన్న అతనికి అడ్డు తగిలాడు రైటర్ ...
ఉండు వ్రాసుకోవాలి.

అతను చెప్పసాగాడు''మశానం కూర ముళ్ళు లేకుండా చక్కగా 
గిల్లుకొని అన్నీ  కలిపి మిక్సీ లో వేసుకొని తగినంత నీరు పోసుకొని 
......కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు....''తరువాత సరిగా 
గుర్తు లేదు'' 

''లేదు..లేదు గుర్తు చేసుకొని చెప్పు''అదిలించాడు రైటర్.
తప్పదా అన్నట్లు చూసి....మూడు సార్లు బుర్ర,
పది సార్లు మోకాలు గోక్కున్నాడు.సరే సహాయం కావాలో 
ఏమో అని తన వంతుగా తానూ కూడా గీరాడు రైటర్.

''హా గుర్తుకు వచ్చింది''...''చెప్పు''ఆసక్తిగా చేతిలోని 
పెన్నుతో ముందుకు వంగాడు రైటర్.
''అవన్నీ మిక్సీ లో వేసి వడ గట్టాలి ...తరువాత కొంచెం 
జిలకర పొడి,మిరియాల పొడి కలుపుకొని 
తాగాలి''తన్మయంగా చెప్పు కొని పోతునాడు.

''ఆపు...ఆపు''అరిచాడు రైటర్ ...వస్తున్న ఎస్.ఐ.ని 
చూసి సాల్యుట్  చేస్తూ.

ఏమిటి సంగతి కళ్ళతో అడిగాడు.....చెప్పాడు.
ఉలిక్కి పడ్డాడు ఎస్.ఐ.
''ఏమిటి నిండుదే''

''అవును''తల పంకించాడు.వ్రాస్తున్న మేటర్ చూసాడు.
ఆనందం తొ ఉబ్బి తబ్బిబ్బు అయ్యాడు.
గుడ్ నాకు ఒక కాపీ వ్రాసి పెట్టు.....
అని పక్కకు  పిలిచాడు.
చిన్నగా గుస గుస....''దొరికితే ఇంటికి పంపెయ్యి
మేం సాబ్ ఆర్డర్''చెప్పి వెళ్లి పోయాడు.
తనకే సొత్తు అని ఆనంద పడిన రైటర్ మొహం వాడి పోయింది.
సరే ఈ వివరాలు అన్నా తెలుసుకుందాము అని 
అతని వైపు తిరిగి ఇంకా ఉన్నాయా?చెప్పు.....

అతను తన్మయంగా చెప్పుకు పోతునాడు.
మధ్యాహ్నం ....కెరట్ ఒక సెంటిమీటర్ ముక్కలుగా 
తరిగి బీర కాయ పీచు తీయకుండా ,పచ్చి మిర్చి తొ 
కలిపి తొక్కి దానిని కెరట్  లో కలపాలి.
దానిలో బీట్ రూట్ తురుము ,తేనే కలిపి....
చెప్పుకుంటూ పోతునాడు.అర బస్తా కాగితాలు వ్రాసి 
నిట్టూ ర్చాడు రైటర్....ఇప్పుడు దీనికి రెండో కాపీ 
రాయాలి ......గుట్టను దిగులుగా చూసాడు.

''సరే దొరికితే చెపుతాము పో''చెప్పి పంపేసాడు.
           @@@@@@@

''సార్ దొరికింది''సంతోషం గా వెళ్లి  చెప్పాడు ఎస్.ఐ.కి.
దెబ్బకి మొహం నూనెలో వేసిన పూరిలాగా పొంగింది.
(ఎన్ని రోజులు అయింది పూరి తిని అనుకుంటూ)

ఉన్నట్లుంది చిల్లు పొడిచిన పూరి లాగ అయిపోయాడు 
వచ్చిన ఫోన్ కాల్ విని....''ఎవరు సార్''

''నా మొగుడు...ఎలా తెలిసిందో ఏమో దొరికిందని''
''ఇప్పుడేమి చేద్దాము సార్ ?''
''ఏమిటి చేసేది నా మొహం ఆడకు పంపించు''
ఆ కాగితాల కట్ట తీసుకొని సరే ఇవే ప్రాప్తం
అనుకుంటూ వెళ్లి పోయాడు.
  @@@@@@@@

చాలా రోజుల తరువాత వచ్చాడు ...అతను .
కాని మొహం లో దీనత్వం లేదు,
ఏదో తేజస్సుతో వెలిగి పోతుంది.
''ఇంకా రోజులు పడతాది దొరకటానికి 
దొరికితే పిలుస్తాము పో ''కసురుకునాడు రైటర్ .

''అయ్యో వద్దు సార్...దొరికినా ఇవ్వొద్దు అని చెప్పటానికి 
వచ్చాను''నవ్వుతూ అన్నాడు.

'అదేమిటి''వింతగా అడిగాడు రైటర్.

''మరే ఆ గ్యాస్ బండ పోయినప్పటి  నుండి దరిద్రం వదిలి పోయింది.
చక్కగా కూర గాయాలు తిని కొలెస్టరాల్ లేదు,
గ్యాస్ ప్రాబ్లెం లేదు.మ ఆవిడా సన్న పడింది.
ఇంటి బడ్జెట్ మిగులు లోకి వచ్చింది.పిల్లలకు ఫీ కట్ట గాలుగుతునాము'
ఇప్పటికే ఫ్లాట్ కొన్నాము ...ఇల్లు కట్టాలి అని ప్లాన్ చేస్తున్నాము''

ఓర్నీ గ్యాస్ ఇంట్లో లేక పొతే ఇంత సంతోషమా?
వెంటనే ఆ బండ ను వదిలిన్చుకోవాల్సిందే.

ప్రభుత్వాన్ని అందరు తిడతారు కాని ఇంత మంచి 
చేస్తుందని తెలుసుకోరు.
భక్తిగా కళ్ళు మూసుకొని ప్రభుత్వానికి దణ్ణం పెట్టాడు.
కల  కాలం ఉండమని ......



7 comments:

శిశిర said...

హహ్హహ్హ

Anonymous said...

:)

సుభ/subha said...

హహహహహహ :):).... పంచ్ లు సూపర్ అసలు.
టి.వి.సీరియల్ మధ్యలో కరంట్
పొతే విసుక్కున్నట్లు
మన్మోహన్ గారు మాట్లాడితే వినపడి నట్లు
రైలు ప్రమాదం జరిగితే కాపాడకుండా
ఫోటోలు తీసే మొహం వేసుకొని..... కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్
-సుభ

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

అందరం కందమూలాలు తింటూ సాములోర్లం అయిపోదాం. సుడితిరిగితే మానవాతీతశక్తులుకూడా వచ్చేస్తాయేమో

పల్లా కొండల రావు said...

వెంటననే కేంద్ర , రాష్ట్ర ప్రభుుత్వాధినేతలకీ పోస్టు పోస్టు చేయాలి శశి గారు.

శశి కళ said...

శిశిర గారు,కష్టే పలి గారు థాంక్యు



సుభా :))))

శశి కళ said...

చైతన్య అప్పుడు చక్కగా పెద్ద ఆశ్రమాలు నడప వచ్చు కదా




కొండల రావు గారు థాంక్యు