Saturday 6 October 2012

యే దేశమేగినా ......

''ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు''సందర్భంగా 
నెల్లూరు  జిల్లా లోని ''సతీష్ ధావన్ స్పేస్ సెంటర్''
లో అన్ని స్కూల్స్ నుండి టాపర్స్ అయిన వారిలో 
యాబై మందిని సెలెక్ట్ చేసి వారికి గురు,శుక్ర వారాల్లో 
పోటీ పరిక్షలు ,క్యిజ్ ''జి.ఎస్.ఎల్ .వి.''అవార్డ్ కోసం 
నిర్వహించారు.
దీనిలో విశాఖ పట్నం కు చెందిన ఎం.పరిణీత మొదటి బహుమతి,
హైదరాబాద్ కు చెందినా నూతి.ప్రణవ్ రున్నర్ అప్ గా నిలిచారు.
వాళ్ళకు అక్కడ శాస్త్రవేత్తలు అనీ చూపించి అక్కడ చేస్తున్న 
ప్రయోగాలు గూర్చి వివరించారు.ఇప్పుడు వాళ్లకు 
అక్కడ పెద్ద అయిన తరువాత వాళ్ళ ప్రయోగాల లో 
పాలు పంచుకోవాలి అని ఉంది అని చెప్పారు.

ఇది నిజమే అయితే మంచి పరిమాణమే.యువత ఇలాగే 
ఆలోచించాల్సి ఉంది.
అయితే ఎక్కడ ఉన్నా ....
''ఏ దేశమేగినా 
ఎందు కాలిడినా 
ఏ పీటం ఎక్కినా 
ఎవ్వరు ఎదురైనా 
పొగడరా నీ తల్లి భూమి భారతిని 
నిలుపరా నీ జాతి నిండు గౌరవం''

ఇవి గుర్తు ఉంచుకుంటే బాగుంటుంది.
వారికి  నా ఆశీస్సులు.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి.మనం ఇస్రో లో ఎలా ఉంటుందో 
వాళ్ళు అన్నీ చూపిస్తారో లేదో అని అనుకుంటాము.
కాని అది నిజం కాదు అక్కడ గర్వం లేకుండా మనలను 
అనీ తిప్పి చక్కగా వివరిస్తూ చూపుతారు.
రాకెట్ ప్రయోగాలు లేక పొతే మనలను బుధవారం 
అనుమతిస్తారు.ఇంకా పి.ఆర్.ఓ.గారికి ఫోన్ చేసి అనుమతి తీసుకోవచ్చు.
అక్కడ  పులికాట్ సరసు,ప్రయోగ కేంద్రం చక్కని వాతావరణం 
సముద్రం,వాళ్ళు ఆ ద్వీపాన్ని అప్పటిలాగే కాపాడటం 
మన అదృష్టం బాగుంటే నవంబర్ నుండి డిసంబర్ వరకు 
దూర తీరాల నుండి వచ్చి పిల్లలను పొదిగి పెద్ద చేసుకొనే 
పెలికాన్స్,ఫ్లేమింగోస్ మొదలగునవి చూడటం చాలా గొప్ప 
అనుభవం.మీకు.మీ పిల్లలకు ఈ యాత్ర విజ్ఞానదాయకం,
సంతోషం కలిగిస్తాయి.
p.r.o. gari phone number:0862322618336


3 comments:

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

నా మొదటి ఉద్యోగం అక్కడే. జీ.ఎస్.ఎల్.వీకి కొత్త లాంచ్ పాడ్, ఇఅతర సౌకర్యాలు కట్టేదానికి ప్రవివేటు కంపెనీ తరపున వెళ్ళాను. కానీ నాకన్నా అమ్మే ఎక్కువ చూసింది. తనకి రెండుసార్లు ఎలక్షన్ డ్యూటీకి శ్రీహరికోట పంపితే వాళ్ళని మాములుగా సందర్శకులను పంపేంతే వరకేకాక, కొన్ని రహస్య ప్రాంతాలు కూడా చూపించారు. ఇంకో చిన్న విషయం- అమ్మకి టీటీసీ అయ్యక అక్క్డ ఉద్యోగం వస్తే, మూడో ప్రపంచయుద్ధం వస్తే అమెరికా వాడు మొదటిబాంబు దీనిమీదే వేస్తారని చెప్పి అమ్మమ్మవాళ్ళు పంపించలేదు :)

సుభ/subha said...

శశి గారూ మంచి పోస్ట్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు.. నేనొస్తాను నన్ను తీసుకెళ్తారా అక్కడికి :)

శశి కళ said...

రమేష్ గారు థాంక్యు


చైతన్య భలే వ్రాసావు.మీ అమ్మమ్మ లాగే అప్పట్లో బాంబు
వేస్తారు అని అందరం బయపడే వాళ్ళం


శుభా యెప్పుడూ వెల్కం