హమ్మయ్య ఏడాది చివరి రోజు కూడా వృధా అవకుండా మంచి
పుస్తకం దొరికింది . ''బుద్ధుడు - బౌద్ధ ధర్మం ''
డాక్టర్ పానుగోటి కృష్ణా రెడ్డి గారి రచన . ముందు మాట లో
బుద్ధుడి గూర్చి అరటిపండు వలిచి పెట్టినంత
సులభంగా ఉంది అని చూసి ,
అదెలా సాధ్యం అనుకున్నాను .
కాని చదివిన తరువాత నిజమే అనుకున్నాను .
అంతంత భారీ విషయాలు చక్కగా అర్ధం
అయ్యేట్లు వ్రాసారు . ఇంకా చాలా పుస్తకాలలో మేము
చెప్పినదే నిజం అన్నట్లు వ్రాస్తూ ఉంటారు .
కాని దీనిలో ఎక్కడ అయినా కొంత వివాదం ఉంటె
అక్కడ క్లియర్ గా దీని మీద వివాదం
ఉంది అనే విషయం కూడా ఇచ్చి ఉన్నారు .
బుద్ధుడి మహాభినిష్క్రమణ గూర్చి ,
చివరలో తిన్న బిక్ష గురించి , బిక్షలో మాంసాహారం తినడం
గురించి ...... అక్కడ ఉన్న సందేహాన్ని కూడా బ్రాకెట్లో ఉంచారు .
పాటకుల విజ్ఞతను గౌరవించినట్లు ఉంది .
''ఆత్మో దీపో భావ '' ఏదీ గుడ్డిగా నమ్మకుండా ఎవరికి వారు
సద్విచారణ తో తమ దీపాన్ని వెలిగించుకోవాలి .
''మార్పు అనేది అంతిమ సత్యం '' ఒక మనిషి తోనే ఈ సమాజం
నడవదు . ఎవరు గొప్ప అని కాక ఏది మంచిది అని ధ్యానం తో
ఉంటూ నడవాలి . తనకు తెలిసింది చెపుతున్నాను అంటాడే కాని
తనను దేవునిగా పూజించమని ఎక్కడా చెప్పడు .
''తృష్ణ అన్ని బాధలకు మూలం ''
నాకు ఇది ఇష్టం ,అది ఇష్టం అనుకొంటూ ఉంటాము . కాని కొద్ది
రోజులకు మనకు అర్ధం అవుతుంది అది యెంత తీర్చుకున్నా అంతం
అయ్యేది కాదు . సంతృప్తి తోనే అది మాయం అయ్యేది అని .
ఇలాంటి భావన రావాలి అంటే '' విపశ్యన '' ధ్యానం తోనే
సాధ్యం . నిజంగా నేను ఈ ''శ్వాస మీద ధ్యాస ''ధ్యానం నేర్చుకున్నప్పుడు
ఎంతో ఆశ్చర్య పడ్డాను . ఎంత హాయిగా ఉంది . గురువులు లేరు .
ఎవరైనా ఇంట్లోనే హాయిగా చేసుకోవచ్చు . మొదట కొంత ఆలోచనలు
వచ్చినా ఇప్పుడు ఎంత హాయిగా ఆలోచన రహిత స్థితి కి సులభంగా
వెళ్ళవచ్చు .
ఇంకా కొన్ని బుద్ధుడి మాటలు
''అప్రియమైన సత్యం చెప్పకూడదు అని చెపుతూ ఉంటారు కదా !
కాని బుద్ధుడు సత్యం అప్రియమైనదైనా సరే చెప్పాలి అంటాడు .
సత్యం చెప్పకుండా తప్పులు సరిదిద్దడం సాధ్యం కాదు ''అంటారు .
మామూలు మనుషులం కాసింత అటూ ఇటుగా ఉన్నా ,
ఎదుటి వారికి మంచి జరుగుతుంది అంటే కటువుగా ఉన్నా
సత్యం చెప్పాల్సిందే . ఎవరు చెప్పినా ,ఏమి చేసినా అన్ని
దారులు వెళ్ళాల్సింది సంఘం వైపే . సమాజ హితవు కు
ఉపయోగపడని మనిషి జన్మ వృధా . అందుకే సంపాదించిన
దానిలో కొంత ధర్మ కార్యాలకు ,అన్న దానానికి ఉపయోగించాలి .
''సంఘం శరణం గచ్చామి ''
మరి అన్నింటిలోకి ఇదే గొప్ప మతం అని ఎవరైనా చెపితే నమ్మకూడదు .
ధ్యానం చేసుకుంటూ మనిషిగా ఏది మంచిదో అది చేయాలి .
ఎందుకంటె ఏదో ఒక మతం లో ఇమిడినపుడు మన జ్ఞానానికి హద్దులు
వచ్చేసినట్లే . హద్దులలో జ్ఞానం ఎప్పటికీ ఇమడదు . ఎన్నో
విషయాలు చదివిన తరువాత , ఎన్నో అనుభవాలు పొందిన
తరువాత మనిషికి తెలిసేది ఒక్కటే.....
''తనకు తెలియనది ఎంతో ఉందని ''
@@@@@@@@@@@@@