Tuesday 6 January 2015

కలానికి అవిటితనం అడ్డు అవుతుందా ?

కలానికి అవిటితనం అడ్డు అవుతుందా ?
మనసుకు సృజనాత్మక శక్తి ఉండాలే కాని విశ్వం లోని 
నక్షత్రాలతో కూడా లంకె వేసి జ్ఞానాన్ని సంపాదించవచ్చు అని 
''స్టీఫెన్ హాకింగ్ '' శరీరం అంతా పనిచేయకపోయినా జ్ఞానానికి 
కావలసినది మేధస్సే అని చూపించాడు . 
చుట్టూ ఉన్న సమస్యలను అక్షరాలుగా చెక్కడానికి చేతులు 
అక్కర్లేదు ,స్పందించే మనసు ,చూపించే సృజన ఉంటె చాలని 
ఈ రాజేశ్వరి నిరూపించింది . 
(rajeswari news article link ikkada )


సుద్దాల అశోక్ తేజ గారి చేత తన పుస్తకం ముద్రణ చేయించుకోవడమే కాక వారి 
అమ్మ గారి పేరు మీద నెలకొల్పబడిన అవార్డ్ అందుకొంటూ ,అంగ వైకల్యం 
శరీరానికి ఉన్నా , పేదరికం చుట్టు ముట్టి ఉన్నా సంకల్ప బలం తో 
ఏదైనా సాధించవచ్చు అని చూపిస్తుంది . 

కొందరి జీవితాలు విత్తనాలు 
హృదయాలలో నాటుకొని విస్తరిస్తారు 
కొందరి జీవితాలు వెలిగే దీపాలు 
కరిగిపోతూ కూడా కాంతులు విరజిమ్ముతారు 
కొందరి జీవితాలు ఎగసి పడే అలలు 
ఎదిరించి నిలబడిన రాయినైనా కరిగిస్తారు 
కొందరి జీవితాలు చరిత్ర దాచుకున్న స్తూపాలు 
నిబ్బరంగా నిలబడి కాలానికి సైతం దారి చూపిస్తారు .... 

''ఆనందం తో సంపూర్నేష్ బాబు ను అక్షరాలుగా పంచుకున్న మనం 
ఆర్ద్రతతో కొన్ని అక్షరాలు రాజేశ్వరి కోసం పంచుకోలేమా !!!''
                                          @@@@@@@@@@@@@@ 


2 comments:

లక్ష్మీ'స్ మయూఖ said...

నేనూ ఈరోజే టివిలో చూసాను రాజేశ్వరి గురించి.నిజంగా భగవంతుడు తాను చేసిన తప్పులను ఈవిధంగా సరిదిద్దుకుంటాడని అనిపించింది. ఆతల్లిదండ్రులు అదృష్టవంతులు.అన్నిటికన్నా సుద్దాల అషోక్ తేజగారు స్పందించినతీరు కంటనీరు తెప్పించింది.అవునా?కాదా?, శశిగారూ.కళ ఏఒక్కరిసొత్తుకాదని రాజేశ్వరి నిరూపించిది.వైకల్యం శరీరానికేగానీ మనసుకు కాదని తనని తాను ఆవిష్కరించింది.హ్యాట్స్ ఆఫ్ రాజేశ్వరి.

శశి కళ said...

mayukha garu thank you