Sunday, 23 October 2011

సముద్రమంత....హృదయం....

మొన్న ఒక కధ రివ్యు  చదివాను...నిజంగా జ్ఞాపకాల అలలను రేపి నువ్వు 
ఒకరికి కృతజ్ఞతలు తెలియ చేసుకోవాలని గుర్తు చేసింది.అది
అద్దేపల్లి.ప్రభు గారు వ్రాసిన అతడుమనిషి కధ.ఒక రోజు వర్షం లో 
నా జీవితం లో జరిగిన ఒక  సంఘటనలో ఆ కధే  గుర్తుకు తెచ్చుకున్నాను.
మరలా ఆ కధ చదివినపుడు.....అదే జ్ఞాపకాల మడతలలో ....
గుప్పుమన్న మానవత్వపు పరిమళం.......ఈ సందర్భంగా నా మల్లె పువ్వు 
కవిత లో ఒక వాక్యం...............................

"మనిషి మల్లె పువ్వైతే ........సమాజం సుగంధ భరితం  అవుతుంది"

సూక్ష్మం  గా చెప్పాలంటే "అతడు మనిషి"కధ .....ఒక టౌన్ లో నివసించే అతను
ఒక వానా కాలపు రాత్రి నది దాటలేక ఒక గుడిసె లో ఉండి  వారి ఆతిధ్యం 
తీసుకో వలసి వస్తుంది.అప్పుడు వారు చూపే ఆదరణ అతనికి నచ్చుతుంది.
ఇంకా వారి బాబు అతని చుట్టూ పక్కల తెలుసుకున్న జ్ఞానాన్ని చెపుతుంటే 
తన బాబుకు తెలిసిన జ్ఞానం గొప్పదా..ఇది గొప్పదా....అని....సరేలెండి ...
ఇది నా కధ....ఆయన కధ చెపితే ఎలా?

ఒక రోజు....మబ్బులు భయంకరంగా ముసురుకుంటున్నాయి....రాంగోపాల్ వర్మ 
దెయ్యాల లాగా ఆకారాలతో భయపెడుతూ......బాయ్.....మని సడి చేస్తూ గాలి
జుయ్యన వీస్తూ...ఊ...ఊ.....అన్నిటిని ఎగర కొడదామని  చూస్తూంది.....
అప్పుడో ఇపుడో వర్షం వచ్చేస్తుందని....చల్లగా నిమురుతూ చెపుతూంది కబురు.

అప్పుడు...నేను స్కూల్ లో ఉన్నాను.లంచ్ టైం కి ఒక గంట ముందే పర్మిషన్ 
తీసుకున్న వానలో తడిసిపోతామని భయపడి....
(కాదు లెండి...ఎంచక్కా తడుస్తాము 
కాని....మాకు వర్షం పడితే చిన్న పెద్ద వరల్డ్ మ్యాప్ లో ఉండే సముద్రాలు నాయుడుపేట
 కు వచ్చేస్తాయి.....మరి మనకు స్కూటర్ వచ్చు కాని .....నీళ్ళలో పడవ నడపటం రాదు)

బయటకు వస్తుంటే శైలజ మేడం పిలిచారు"శశి మా బాబుని కూడా నీతో తీసుకొని పో.
వీడికి ఈ మధ్యే కుక్క కరిచింది.....మళ్ళా నీళ్ళలో తడిస్తే ప్రమాదం"అని వాళ్ళ ఏడవ
 తరగతిచదివే బాబుని నాతొ పంపింది.

సరే అని వాడిని ఎక్కించుకొని జుయ్య్యయ్య్య్యయ్యి............అని వెళుతున్నాను

ఊరికి స్కూల్కి మధ్యలో కొంత దూరం ఇళ్ళు ఏమి ఉండవు.
అదిగోఓఓఓ......అక్కడకు వచ్చే సరికి పడింది..టప...టప....రెండో చుక్క...బాబోయ్...
బాబు సంగతి ఏమిటి?నా సంగతి సరే తడిచినా ....మహా అయితే తలలో మట్టికి చిన్న 
చెట్టు మొలుస్తుంది....అంత  కన్నా ఏమి కాదు......పాపం మేడం నా మీద నమ్మకం  తో 
బాబుని నాతొ పంపింది.....చుట్టూ చూసాను....
ఏమి ఇళ్ళు లేవు......దగ్గరలో చిన్న గుడిసె .....దాని ముందు
చిన్న పంచ.......దాని కింద నిలబడ్డాము.........

గోడకి అతుక్కొని నిలబడ్డ.....జుయ్య్య్యయ్య్య్యి ....అని హోరు గాలి....
దానితో వర్షపు జల్లుమాపై  పడుతుంది..
బాబు ని గోడకు ఆనించి నిలబెట్టి  నేను వాడికి
 కొంచం కొంగు అడ్డం పెట్టి నిలుచున్నాను.

అయినా మిష్టర్ వర్ష దేవ్ గారికి కనికరం లేదు........
జల్లులు మీద జల్లులు కురిపించేస్తూనే ఉన్నాడు..

ఊహూ....ఆడవాళ్లే పాపం బాబు ఉన్నాడే అనన్నా కరుణిస్తాడు   అనుకుంటే ..
ఊహూ....నీకు దిక్కున్న చోటుకు పో అని సవాల్ విసురుతున్నాడు వానదేవుడు.....

ఏమి చేసేది వాడిని కాపాడటం నా భాద్యత కదా...ఏదైతే అది అయిందని....మెల్లిగా ఆ
పాకతలుపు తోసాను.అది చిన్న దీర్ఘచతుర స్రాకారపు పాక అన్న మాట.....
మనం కొంచం వొంగివెళ్ళక పొతే గడప మొహమాటం లేకుండా బాపు గారి కార్టూన్స్ లో
లాగా ఎంచక్కాఒక బొప్పిని ప్రసాదిస్తుంది.

అక్కడ ఒకతను నులక మంచం పై వాళ్ళ పాప లను  ఇద్దరినీ కూర్చో పెట్టుకొని
ఉన్నాడు.ఒక పాపకు పది నెలలు ,ఇంకో పాపకు మూడేళ్ళు ఉంటాయి.
పక్కన ఆ మంచం పట్టేంత స్తలమేఉంది.
అక్కడ వాళ్ళ భార్య వంట చేస్తుంది.మేము ఎక్కడ నిలబడాలి?అందుకని వాళ్ళు
మంచం ఎత్తేసి నిలబడి మాకు చోటిచ్చారు.
ఇంతలో ఇంకా మాలాగా ఇద్దరు ఆడవాళ్ళు ఒకఅతను కూడా వాన వల్ల లోపలి
వచ్చారు.అసలు నిలబడటం కూడా కష్టం గా ఉంది.
బయటకు పోదామంటే తుపాను లాగా ఉంది వాతావరణం.

అప్పుడు మొదలైంది అసలు కద....బుజం మీద చల్లగా ....
ఏమిటా అని చూద్దును కదా.....
పై నుండి నీళ్ళు పడుతున్నాయి....కొంచం పక్కకి జరిగాము...
బాబు ని నాకు అటు పక్కగా నిలబెట్టు కొన్నాను.
మళ్ళా ఇంకో పక్క నుండి నీళ్ళు  పడుతున్నాయి.....వాళ్ళు రెండు 
దగ్గరలా యేవో రెండు గిన్నెలు పెట్టారు......నీళ్ళు  వాటిలో పడుతూ ఉంటె
టపా...టపా....టపా....టపా....టపా......
.కొత్త సంగీతం....చలి గాలి ఒక పక్క.......పొయ్యి సెగ......తాలింపు వాసనా.....
ఏదో కూర చేస్తుంది పాపం.......యెంత సేపు ఉంటాము భావుకతలో .......
వాస్తవం చేదుగా ఇంకా చాలా దగ్గరల నీళ్ళు పై నుండి కారుతూ ఉన్నాయి......


కొంచం పొయ్యి పై నీళ్ళు పడకుండా ఏదో యూరియా గోతం కట్టుకున్నారు.......
ఇప్పుడు ఇంకేమి చేయాలి ?గిన్నెలో పడిన నీళ్ళు కూడా ఆ వడికి చింది నేలపై పడి
నేలంతా బురద.....మళ్ళ ఆ బురద నా చీర కుచ్చిళ్ళ పడుతూ......దేవుడా పాపం 
వీళ్ళకి ఎవరైనా గుడిసె పైన కప్పుకోను ఏమైనా ఇవ్వ వచ్చును కదా అనిపించింది.....

నాకు బాబుదే దిగులుగా ఉంది.....వాళ్ళంతా అందరం కష్టాలు పడుతూ  ఉన్నా
 నేనొక్కటే పడుతున్నట్లు నా దుస్తితికి జాలిగా చూస్తున్నారు......
సరే ఏమైతే అది అయిందనివాళ్ళతో "నేను తడిచినా పర్వాలేదండి....
పాపం బాబుకి కుక్క కరిచింది వాడు తడవ కూడదు"అన్నాను.

వాళ్ళు పాపం వెంటనే ఇంకో వైపు కొంచం స్తలం తడవకుండా చేసి అక్కడ బాబుని నిలుచో పెట్టారు.
హమ్మయ్య అనుకొన్నాను.పాపం వాళ్ళైతే తడిసి పోతున్నారు.....అయినా సరే సహాయం చేసారు.
నిజంగా దేవుడు ఎక్కడ ఉంటాడు ?సహాయం చేసే వాళ్ళ మనసులలో తప్ప.

తరువాత వాన పూర్తిగా వెలిసిన తరువాత ,మామూలుగా నేను టీచర్ ని కాబట్టి
నా బాగ్ లో చాక్లెట్స్  ఉంటాయి.అవి పిల్లలకు ఇద్దామని చూస్తె లేవు.

డబ్బులు ఇస్తే వాళ్ళు చాలా ఫీల్ అయ్యేటట్లుగా అనిపించారు.
సరే ఆ పాపా బుగ్గ పుణికి ముద్దు పెట్టు కొన్నాను.వాళ్ళు చాలా సంతోషించారు.
తరువాత చాక్లెట్స్ కొనుక్కో పాపా అని ఆ పాపకి కొంచం డబ్బులు ఇచ్చి
(చాలా కొంచం లెండి...బండి ఉంది కాబట్టి మన దగ్గర చాల డబ్బులు ఉండవు)
టాటా చెప్పి వచ్చేసాము .

బాబుని వాళ్ళ ఇంట్లో క్షేమంగా వదిలి హమ్మయ్య అని ఊపిరి తీసుకున్నాను.
మరి ఎవరైనా మనకు భాద్యత అప్పచెపితే దానిని కచ్చితంగా  పూర్తీ చేయాలి కదా......

ఇంట్లో కి వచ్చిన తరువాత మా వారు జరిగిన దంత తెలుసుకొని నేను క్షేమంగా 
వచ్చినందుకు సంతోషించారు."శశి అన్ని నగలు వేసుకొని ఆడదానివి అలా
ఎవరింటి కైనా వెళ్ళ కూడదబ్బా....జాగ్రత్తగా ఉండాలి"అన్నారు.

నేనన్నాను కదా "నన్ను ఎవరు ఏమి చేయలేరు నేను ఝాన్సి లక్ష్మి బాయి ని కదా"
అన్నాను.

మా వారంటారు....ఆ విషయం నీకు తెలుసబ్బ ....వాళ్లకు తెలీదు కదా.....
.అని......రచ్చ గెలిచాము......ఇంట్లో గెలవ లేక పోతిమి.......

మా కధ ఎప్పుడూ ఉండేదే.....మీరు అతడు మనిషి రివ్యు చూడాలంటే ఈ లింకు చూడండి.

Thursday, 20 October 2011

ఆయుష్హు పెంచే మందు...హుష్....

ఆలో...ఆలో...ఆలో...అందరు వచ్చేసారా.......
ఈ రోజే అందిన వార్త.......మనసు దిటవు చేసుకొని వినండి.....
చెప్పేస్తున్నా........
ఇప్పుడే చెప్పేస్తా........
ఏమి అనుకోవద్దు.....
ఇప్పటి దాకా చెప్పలేదని అలగొద్దు........
మళ్ళా నా పై నిష్టూరం ఆడవద్దు.......

చెప్పేస్తున్నా........చెప్పేస్తున్నా......చెప్పెస్తునా.....

(ఏమిటి ఎవరో సర్ఫ్ ఎక్స్ల్ ల్ ఒక రూపాయని చెపుతావా అంటున్నారు?)

అమెరికా అధ్యక్షుడు ఒబామా వ్యాన్  ఎవరో కొట్టెసారంట.............

అబ్బ ...మాకు తెలుసులే అంటున్నారా?తెలిస్తే ఏమిటి అంట...

ఆ దొంగ గొప్పదనం గూర్చి వ్రాసారా?
అసలు ఈ దొంగతనం అనేది కృత యుగం నుండి ఉన్నట్లు ఉంది.

కృత యుగం లో వేదాలను దొంగలించారు.
భూమిని దొంగలించి చాపలా చుట్టి నీళ్ళలో వేసేసారు.
(భూమిని చుడితే నీళ్లె క్కడ  నుండి వచ్చాయబ్బా?)

సరే వీళ్ళందరూ రాక్షసులు ....వాళ్ళ బుద్దే అంత.......

మరి ద్వాపర యుగం సంగతి ఏమిటి?మిష్టర్ క్రిష్ణయ్య గారు 
ఎందరి  ఇళ్ళలో పాలు,పెరుగు,వెన్న,......సోఓఓఓఓ ఆన్ ....
దొంగాలించారో ఇంతవరకు సి .బి.ఐ.కూడా తేల్చలేక పోయింది.

మరి కవి గారు వీళ్ళందరూ ఎందుకు దొంగతనాలు చేస్తున్నారో 
చెప్పారు.......

పాల సంద్రము నందు పవ్వళించెడి వాడు 
పరులి ఇంటి పాలు కోరనేల ?
ఎదుటి వారి సొమ్ము ఎల్ల వారలకు తీపి......

మరి మన దొంగ గారి దొంగతనం కేకో కేక....అని ఒబామాగారు 
వచించు చున్నారు......

దీనిలో  మెరుపు ఏమిటంటే సదరు దొంగగారూ 
ఆ వ్యాన్ ను ఒక హోటల్ దగ్గర వదిలేసి వెళ్ళారు.

ఎందుకు వదిలేసి వెళ్లి ఉంటాడు?
శశి నువ్వ్వే ఏదో జవాబు ఫిక్స్ అయ్యి ఉంటావు చెప్పెయ్యి 
అంటారా.....హెంత మంచోల్లో...........

పాపం వ్యాన్ అయితే దొంగలిన్చగలం ......దానికి కావలిసిన 
పెట్ర్రోల్ కోసం పెట్రోల్ బంక్ దొంగాలించలేము అనుకోని 
వదిలేసి ఉంటాడు.

సరే ఉడతా భక్తిగా బ్రాహ్మి పాపం ఈ విషయం విని బాధ పడుతున్నాడు...
ఒదార్చండి మరి............


దిగులుతో బాధ పడుతున్న బ్రాహ్మీ...(దీనిని బాధ పడటం అనరా?)
అలా అనవాకండి.....హర్ట్ అవుతాడు.........



సరే ...సరే....కూల్....బ్రాహ్మి........ఏమిటి కూల్ అంటే 
తడి గుడ్డ నెత్తిన వేసుకోమని అర్ధమా?
ఏమిటి నీకు ఇలా అర్ధం అయిందా?

కేవ్వ్వ్వవ్వ్వ్వవ్........ఏమిటి ఈ కేక?
అయ్యా బాబోయ్ .....ఎవరది ...ఇవి నా పొటోలు 
నువ్వు దొంగతనం చేసావు అంటున్నారు?

రమ్మని పాపం......ఆశ ...దోశ.....అప్పడం.....వడా........

ఇప్పుడు వ్యాన్ దొంగ హోటల్ దగ్గర వ్యాన్ పెట్టాడు.....
అంటే హోటల్ వాళ్ళు దొంగలించి నట్లేనా?

(శేబాష్ శశి సూపర్ లాజిక్......కొంచం విజ్నారం seCREtary 
తెలివి దొంగలిన్చినట్లున్నావు)

అయినా పోటో లు దొంగలించారు అనకూడదు....కాపి ,పేస్ట్ 
చేసారు అనాలి.....అయినా ఆ బుల్లి దొంగను ఏమి అనలేరు....
చేయలేరు......బెట్ పెడతారా?

ఒక్క సారి తనకు సపోర్ట్ ఎవరు ఉన్నారో చూసి మాట్లాడండి......


(పోటో షాప్ సహకారం బై శశి గారి పుత్రుడు)


అయినా ఏమిటండి పే......ద్ద......దొంగ దొంగ .....అంటారు....

ఫోన్ వాళ్ళు మీకు ఏమి చెప్పారు.......మర్చిపోయారా?

                      గిచ్చే వాళ్ళు 
                      గిల్లే వాళ్ళు 
                      ఏడిపించి నవ్వే వాళ్ళు 
                      దొంగతనాలు చేసే వాళ్ళు 

అరె ప్రతి ఫ్రెండు ........అవసరమెరాఆఆఆఆఅ...............

సరే ....సరే....ఆయుష్షు పెంచే మందు ఏది అంటారా?

మరి మీ చక్కని పెదాలపై నెల వంకలు ఎలా వచ్చాయి?
ఆ మందు వలననే......

Tuesday, 18 October 2011

అకటా...ఏమంటిరి......ఏమంటిరి......

ఎమంటిరి?ఎమంటిరి?
రేణుకా చౌదరి గారు ఎమంటిరి?

"ఇదేమన్నా ప్రెషర్ కుక్కర్లో  వంటనా?అనియా?"

హెంత మాటా.....యెంత మాటా.......

ఇది ప్రాదేశిక వివాదము  కాని మా శక్తి వివాదము  కాదె ....
కాదు అదే నందురా....మా ప్రెషర్ లేకుండా ఈ రాష్ట్రం లో ఏ 
పనైనా జరుగునా....వాని గురువు ఢిల్లీ మాటేమిటి.....అక్కడ 
కూడా వెనక నుండి ప్రెషర్ పెడుతుంటేనే మాటలు బయటకు 
వస్తున్నవి కదా...............

అన్నియునూ కనపడని ప్రెషర్ తోనే జరుగుతుండ..........
నేడీ కుక్కర్ .....కుక్కర్ అని తేలిక మాటలేల.............

మరి మదీయ గొప్పదనము మీ కెరుక  అయిన అటుల వచింపబోదురు కదా?

సఖి....నా ప్రాణ నెచ్చలి .....శశి కళ.......మదీయ గొప్పదనము శతదా....సహస్రదా
....సహస్రదా......లక్షదా........లక్షదా....కోట్లదా...... వీరికి వివరింపుము........

అటులనే సఖా........వినుడి ..వినుడి ....కుక్కర్ గాధా......వినుడీ మనసారా.........

                           ఎవరిని ఎలా ఉడికించాలో 
                            బాగా తెలుసు ...........
                            కుక్కర్ తో 
                             సావాసం.............

మరి కుక్కర్ లేక పొతే యెంత మంది లేత వంటగాళ్ళు(ఆడ వాళ్ళ ను ఏమనాలో)
కు చేనక్కాయలు ఎలా ఉడక పెట్టాలో నేర్పేది ఎవరు?
మొక్కజొన్నలు ఎలా ఉడక పెట్టాలో నేర్పేది ఎవరు?
పప్పు ఎలా వండాలో......అన్నం ఎలా చిమడ పెట్టాలో 
నేర్పేది ఎవరు?ఎవరు?ఎవరు?................................

                          గ్యాస్  బడ్జెట్ 
                           కిందకు దిగింది 
                           ప్రెషర్ ఉంటె 
                           అంతే.............


గ్యాస్ సబ్సిడీ లో కోత పెడుతూ......ఆరు సిలిండర్లె అని 
అరిచి గీ పెడుతూ.......ఉడకని అన్నం .......నానని పప్పు 
జాలిగా చూస్తూ.....కట్టెలు కొట్టుకొని బతకాల్సిన పరిస్తితిలో .......
ఆడవాళ్ళను ఆదుకున్నది ఎవరు?ఎవరు?ఎవరు?

                       వంట 
                       తగలడింది.......
                       కుక్కర్ 
                       లేక...........
 ఒక పక్క వంట.....ఒక పక్క పిల్లల తంటా.....
శ్రీవారి ఆకలి మంట.....తకదిమి తొమ్.....తకదిమి తొమ్....
కదాకళి  ,   కూచి పూడి చేస్తుంటే......వంట మాడకుండా ఆడవాళ్ళను 
కాపాడింది ఎవరు?ఎవరు?ఎవరు?

                        అన్ని తనలో 
                       ఇముడ్చుకుంటుంది....
                       ఇల్లాలి 
                       ప్రేమ కోసం............

శ్రీవారికి అన్నం సరే....బాబుకి పప్పు సరే.....తాతకి తాలింపు సరే......
పాపకి కంకి సరే.......ఎన్నున్నా.....ఏమి తెచ్చినా......నీ సుఖమే 
నే కోరుకున్నా .......నీ కోసమే నే ఉడుకుతున్నా.....అంటూ 
అనుక్షణం తన నెచ్చెలి సుఖం కోరుకునేది ఎవరు?ఎవరు?

                     మొగుడి ముందే 
                     విజిల్ వేస్తుందే......
                     ఆడవాళ్ళ సప్పోర్ట్ 
                     ఉందిగా.............

అమ్మ రేణుక ఎంతంటే.....యేమని చెప్పను....కుక్కర్ గొప్పదనాన్ని....
శ్రీమద్రమా రమణ గోవిందో.....గోవింద.........

ఇంకా మాకేంత  ఇష్టమంటే.........

"లామి లామినా.....జాన్ కారేగా......జింగా.....జింగా.......
లామి లామినా......హే...హే.....వక్క......వక్కా ......హే...హే....
it is the time for aaaaafricaaaaaaaaaa................."

(ఏమి అర్ధం కాలేదా?అది మా బాబుకు ఇష్టమైన పాట అన్న మాట.
వాడికి నిద్ర వచ్చేదాకా మేము కూడా చచ్చినట్లు వినాల్సిందే........
పాపం బాబుకి ఎన్నేళ్ళు అంటారా?చిన్న పిల్లాడే ......సీనియర్ ఇంటర్....)

మా బాబుకి ఆ పాట యెంత ఇష్టమో.....నాకు కుక్కర్ అంత ఇష్టమన్న మాట.

కాబట్టి కుక్కర్ ని గాలితో పని చేస్తుందని గాలి తీసిపారెయ్య కండి.

కుక్కర్ లేనిదే సగటు ఇల్లాలికి నిమిషం గడవదని గుర్తించండి........

ఇక మేమిద్దరం కలిసాము అనుకోండి............

రావే చేద్దాం ........భాండియా.......జరా 
లొట్టలు వెయ్యదా ఇండియా ............

మీ మాటలు వెనక్కు తీసుకొని కోట్ల మంది ఇల్లాళ్ల 
అభిమాన దనాన్ని కాపాడుతారని ఆశిస్తున్నాము.........


Saturday, 15 October 2011

కవితా విహారం

ఇది మా పాప హేమ మాధురి వ్రాసింది.సరే పాపం తనకి 
బ్లాగ్లో చూసుకోవాలని కోరిక.ఈ రోజు వాళ్ళ మాగజైన్ 
సైబర్ క్రెస్ట్ కి పంపుతుంటే సరేలే పోనీ అని బ్లాగ్లో పెట్టాను.

మరి మీ ఆశీస్సులు తెలియచేయండి.


                              ఇదే ఇదే మా లోకం       
     
సౌర శక్తికి రెక్కలు తొడిగిన లోకంలో 
ప్లాస్టిక్ కాలుష్య బూతాన్ని తరిమి కొట్టి 
పచ్చని వన సీమల వయ్యారపు బాటల విహరించాలని 
భావించే యువతే మా భవిత   



హింస సమాధిపై శాంతి పావురాన్ని ఎగురవేసి 
స్నేహపు దీపాల వెలుగున 
ఐకమత్యం వికసించాలని 
భావించే యువతే మా భవిత                            


పిల్లలందరూ చదువుల తల్లి వొడిలో 
ఆకాశమే హద్దుగా అవకాశాలు సాదించి 
అవకాశాలు సృష్టించి విరించిలా వెలగాలని 
భావించే యువతే మా భవిత 

మూఢవిశ్వాసాల మదమును అణిచి 
జ్ఞానపు బావుటా ఎగురవేసి 
బుద్ద ధ్యాన మార్గం లో 
శాంతి సూక్తుల సీమ  లో సయోధ్యతో మెలగాలని 
భావించే యువతే మా భవిత                                                 

ఆలోచన పెంచి ఆవేశం త్రుంచి 
సద్విమర్శను సృజించి 
కర్తవ్యపు బాటలో భారతమాతకు అండగా నిలవాలని 
భావించే యువతే మా భవిత......

          @@@@@@@@@@@@@@@@@@@@@

ఈ కవిత ఈదూరి సుబ్బయ్య సాహితీ పీటం వారు 12-2-2011
న జిల్లా స్థాయిలో యువతకు పెట్టిన  కవితల పోటిలో
 రెండవ బహుమతి పొందినది.








                                        

Wednesday, 12 October 2011

ఆకాశం తన రెక్కల దుప్పటి కప్పుతూ ఉంటె.....

ఎవరికైనా యెంత సంతోషం ఆకాశం వచ్చి లాలిస్తే....
ఎందుకో ఆ సంబరం అంబరాన్ని చూస్తె...................

ప్రతి మనిషిని స్వార్ధం లేకుండా ఆదరిస్తుందని కాబోలు....
మనసులోని ఊసులు కు .....ఊ కొడుతుందని కాబోలు....
మరి అక్కడ ఏముందో?....ఎన్ని ప్రయోగాలు భూమి పైనుండి 
దానిని పూర్తిగా తెలుసు కోవాలని....సరదాగా మీరు కూడా 
క్రింద విషయాన్ని ఆలోచించండి........

కుదరదు...కుదరదు......కుదరదు....మాకు చాల పనులు 
ఉన్నాయి అంటారా?అయితే క్లాస్ తీసుకోవాల్సిందే........

క్రికెటర్స్ క్రికెట్ కాకుండా అప్పుడప్పుడు ఫుట్ బాల్ ఎందుకు 
ఆడుతారు?మరదే దేహ ధారుడ్యం పెరుగుతుందని.......

అలాగే మీరు అవసరం లేక పోయినా క్రింది విషయం ఆలోచించటం 
వలన ...బుర్రకు ఉన్న దుమ్ము పోయి తళ....తళ .......
మెరిసిపోతుందన్న మాట....

"ఏమో ...ఏమో....మీకే ఐడియా మెరువావచ్చు......
మీరే మేధావి అయిపోవచ్చు.........."

స్టీపెన్ హాకింగ్ చూడండి చక్రాల కుర్చీ లో కూర్చుని నింగికి 
లంకె వేస్తున్నాడు ఆలోచనతో   .....మీకేంటి......ఆహా....మీకేంటి?

సరే నబ్బా....కాని అది పద్దెనిమిది ఏళ్ళ వాళ్ళకే  కదా అంటారా?
అబ్బ ఐడియా నాకివ్వండి....నేను మా బాబు కిచ్చి ఇంప్రూవ్ 
చేసుకుంటాను.....ఎలా అయితేనేమి మీ ఐడియా నింగిని 
చేరుతుంది  కదా?
ఇంకేమిటి?బుర్రను బీరవా లోనుండి...పనిలో నుండి....
బయటకు తీసి.....సర...సర....సాన పెట్టెయ్యండి......



Saturday, 8 October 2011

చందమామ సిగ్గుపడింది....

చందమామ 
సిగ్గుపడింది 
పసిపాప 
బోసి నవ్వు నెగ్గలేక......

పిల్లలు దేవుడు చల్లనివారే......కల్ల కపటమెరుగని కరుణామయులే 
పుట్టినపుడు మనిషి మనసు తెరిచియుండును 
ఆ తెరిచిఉన్న మనసులో .....దేవుడుండును........
వయసు పెరిగి ,ఈసు కలిగి ,మదము హెచ్చితే
అంత మనసులోని దేవుడే మాయమగునులే........

పిల్లలు మన కోసం మాత్రమె కాదు...వారు జాతి మొత్తానికి సంపద
"సత్సంతానము పొంది జాతికి సౌభాగ్యము చేకూర్చవలె"

పిల్లలు శుక్లపక్ష చంద్రునిలా నవ్వుతూ ఎదుగుతుంటే 
ఆ ఇంటి లో ఎన్ని పండగలు......ముఖ్యంగా ఆ బిడ్డకి 
సంవత్చారం వచ్చేవరకు మన వాళ్ళు ఎన్ని పండుగలు
 జరుపుతారో చూడండి...........

(రసజ్ఞ గారు దోగాడటం అంటే ఏమిటి అని అడిగారు.....సరే మన వాళ్ళు చేసేవి అందరికి 
తెలుస్తాయని వ్రాస్తున్నాను)


ముందుగా పాపాయి పుట్టిన తరువాత పదకుండో రోజు 
కాని మంచి రోజు చూసి నామకరణం జరిపించి 
మంచి పేరు చూసి వాళ్ళ నాన్నగారు బియ్యం లో 
ఆ పేరు వ్రాసి పాపాయి చెవులో మూడుసార్లు ఆ పేరు 
చెపుతారు.ఆ రోజు నుండి ఆ పాపాయిని ఆ పేరుతొ పిలుస్తారన్న మాట.

తరువాత అదే రోజు పాపాయిని డోలారోహణం అంటే ఎంచక్కా 
లాలి...లాలి...అని ఉయ్యాలలో వేసి ఊపుతారు.
మరి అప్పటి దాక పాపాయి అమ్మ పక్కనే పడుకుంటూ
ఉంటుంది.అప్పటి నుండి ఉయ్యాలలో పడుకోబెట్టుతారు.

తరువాత మూడవ నెలలో మంచి రోజు చూసుకొని అత్తగారు
వాళ్ళు పాపని ,అమ్మని వాళ్ళ ఇంటికి తీసుకు పోతారు.
(ఇది ఏ నెలైనాకావొచ్చు)

అయితే ఇప్పటికి పాప నిద్రలోనే కాకుండా మెలుకువలో కూడా 
మనల్ని చూసి నవ్వుతుంది....పిడికిళ్ళు విడిచి ఆడుతుంది...
మనము ఏమైనా కబుర్లు చెపితే ఊ.... కొడుతుంది .......

అందుకని అందర్నీ పిలిచి ఊకోడుతున్నందుకు ఉగ్గిన్నెలు....
పిడికిళ్ళు విదిచినందుకు లడ్లు....నవ్వుతున్నందుకు పువ్వులు 
పంచి అందరి చేత పాపకి ఆశీస్సులు అందచేస్తారు.

(ఇది కూడా పాప ఎదుగుదలను బట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు)

తరువాత ఐదవ నెల వచ్చేసరికి చక్కగా బోర్ల పడతారు.
అప్పుడు అందరిని పిలిచి ఒక దుప్పటి ఫై బొబ్బట్లు పరిచి 
పాపను దానిపై  పడుకోబెట్టి అందరి చేత అక్షింతలు వేయించి 
బొబ్బట్లు అందరికి పంచాలి.




తరువాత పాపాయి ఆరోనేల వచ్చేసరికి చక్కగా పొట్టపై పారాడుతుంది.ఇక అప్పుడు మంచి రోజు చూసి 
అన్నప్రాసన చేసి పారాడుతున్నందుకు పాపకి, వచ్చిన అందరికి 
పాయసం ఇవ్వాలి.

ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే పాప ముందు పుస్తకాలు,
డబ్బులు ,మిటాయిలు,నగలు,బొమ్మలు ఇంకా చాలా ఉంచుతారు.
పాపకి ఏది ఇస్టమై ముందు తాకుతుందో చూద్దామని .......


ఇప్పుడు తరవాత దోగాడుతూ 
అంటే పొట్ట నేలకుతాకకుండా...
గడపలు దాటుతుంది.....
అప్పుడు దోగాడిన దానికి దోసెలు ..
గడప దాటితే గారెలు పంచాలి...

మళ్ళా గడపకు పసుపు,కుంకుం పెట్టి పూజ చేసి 
"మా పిలకాయలను చల్లగా కాపాడమ్మా"అని దణ్ణం పెట్టుకోవాలి.
(మరి తల్లి దీవెన తప్పక ఫలిస్తుంది)

తరువాత తొమ్మిదో నెలలో కాని పదకుండో నెలలో కాని 
పిల్లలకు పుట్టు వెంట్రుకులు తీయించాలి.ఇవన్ని సామాన్యంగా 
మేన మామే చేయాలి.




తరువాత మొదటి పుట్టిన రోజుకి వాళ్ళు చిన్నగా తప్పటడుగులు  వేస్తూ ఉంటారు.అందుకని దుప్పటి వేసి దానిపై అరిసెలు పరిచి నడిపించి అందరికి పంచాలి.

ఇంకా బోగి పండుగ రోజు రేగుపళ్ళు తెచ్చి అందరిని పిలిచి 
అందరి చేత పాపపై బోగి పళ్ళు పోయించాలి .

ఇంకా మొదటి పుట్టిన రోజుకి కేక్ అవి మామూలే.



మరి పిల్లలు లేని వాళ్ళు ఏమి బాధ పడక్కర్లేదండి.
ఇంతకూ ముందు మనిషి తానూ యెంత 
తక్కువ సంపాదించినా దానిలో ఒక్క పైసా వాటా దేవునికి అని తీసి పెట్టి దానితో
మంచి పనులు చేసేవారు.
 
అనాదాశ్రమాలకు వెళ్లి మీరు 
పెంచుకోక పోయినా ఒకరి ఖర్చు పెద్ద అయ్యేదాకా మీరే భరిస్తానని  చెప్పి వారి 
పెరుగుదలను చూడండి....
వాళ్ళు ఖచ్చితంగా ...

"కంటేనే అమ్మ అని అంటే ఎలా?
పెంచిన ప్రతి తల్లి దేవత కదా"....అనక పొతే చూడండి.


ఇంకా మీ బిడ్డయెంతగొప్పవాడు....
పుట్టకుండానే తన స్పూర్తితో 
మీచే ఎన్ని మంచి పనులు చేయిస్తున్నాడో ................


అలాటి ఒక మంచి ఆలయం జీవని.....చూడండి ఆ పిల్లల 
అమాయక నవ్వులలో జీవనిని.......(రాజ్ కుమార్ గారికి 
కృతఙ్ఞతలు ....ఇంత మంచి జీవని ని పరిచయం చేసినందుకు)


జీవని లింక్......jeevani2009.blogspot.com  
మరి రండి మన ముద్దలో నుండి పక్క వాళ్లకు కొంత పెడదాము.





Friday, 7 October 2011

అనగా...అనగా...ఒకబ్లాగ్...

  అనగా...అనగా...ఒక బ్లాగ్...అందులో ఓ అయ్యోరమ్మ....
 మరీ అంత సీన్ లేదు కాని.....పర్లేదు....ఓ....లుక్కెయ్యండి....

ఇదంతా శైల బాల అభిమానమే ...తను వ్రాసిన నాకు నచ్చిన బ్లాగ్లు పోస్టింగ్
నుండి నా నేస్తాల కోసం తెచ్చిపెట్టాను....చదవండి......

ఎవరైనా మనలను మెచ్చుకుంటే ఎవరికైనా సంతోషమే....అది శైల బాల లాంటి 
వాళ్ళు చేస్తే అది ఎంతో స్పూర్తిని ఇస్తుంది.....థాంక్యు శైల............

(శైల బాల బ్లాగ్ లింక్----kallurisailabala.blogspot.com     )have a nice reading........



ఓక టీచర్ గారి బ్లాగ్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం.

మీరు గాని ఒక నవ్వు గాని నవ్వాలంటే...
మీరు గాని అరుంధతి సినిమా చూడాలంటె...
మీరు గాని స్కూటీ నేర్చుకోవాలంటే...
మీరు గాని మన చుట్టూ ఉన్న వారు చేసే పనులు స్పూర్తిగా తీసుకోవాలంటే...
మన టీచర్ గారి బ్లాగ్ చదవాల్సిందే.

కొంచం అమాయకత్వం , కొంచం పెద్దరికం
అంతలోనే చిన్న పిల్లల కబుర్లు
మళ్లి అంతలోనే టీచర్ గారి కబుర్లు అన్ని ఉన్నాయి ఇక్కడ
నాకు ఎక్కడ పరిచయం అంటే బజ్జ్లో
ఒకరోజు "శైలు !అలగకు ఇంకా నీ పోస్ట్ చదవలేదు " అంటే అరె నేను అవిడకి తెలుసా ?అనుకున్న ...తర్వాత అర్ధం అయింది ఆవిడ అప్పటికే నా బ్లాగ్ చదువుతున్నారు అని
సరే అలా మాట కలిసింది.

ఒకరోజు ఫోన్ చేసారు.
"నేను ఎవరో చెప్పు చూద్దాం " అంటూ ఒక పొలికేక
"శశి గారు !" ఇటు ఒక గావుకేక
ఈ పొలికేకలు, గావుకేకలు తో ఇటు మా కాలనీ అటు వాళ్ళ కాలనీ వాళ్ళు దడుసుకున్నారేమో మరి నాకు తెలీదు కాని ఈ సందర్భం గా ఒక్క మాట చెప్పాలి మీరు ఎప్పుడయినా నెల్లూరు భాష వినాలంటే శశి గారు మాట్లాడితే వినాల్సిందే.
ఈ మాట ఎందుకు చెప్పానంటే నేను పది మాటలు మాట్లాడితే అందులో నాలుగు ఆంగ్లం, రెండు తెలుగు, రెండు హిందీ ఇక ఈ మధ్య చెన్నయి లో ఉండటం మొదలు పెట్టాక మనకు వచ్చిన రెండు మూడు తమిళ మాటలు కూడా కలిసిపోతున్నాయి అని అంటున్నారు. ( ఈ మధ్య మావారు ఈ విషయం మీద క్లాసు తీసుకున్నారు ఆయనతో మాట్లాడేటప్పుడు ఒక్క అంగ్ల పదం కూడా రాకూడదు అని ...ఆ దిశగా నేను ప్రయత్నం చేస్తున్నాను.)
శశి గారితో మాట్లాడాక నేను కూడా తెలుగులో మాట్లాడాలి అని ఒక కంకణం కట్టుకున్నాను.
ఇక బ్లాగ్ విషయానికి వస్తే
స్ఫూర్తి పేరుతొ రాసిన పోస్ట్ లు దగ్గరినుంచి సినిమా సిత్రాలు వరకు అన్ని బావుంటాయి.స్ఫూర్తి పేరుతొ రాసిన పోస్ట్ లు నన్ను బాగా ఆకట్టుకున్నాయి.అన్ని బావుంటాయి కాబట్టి ఎ ఒక్కదాని గురించి ప్రత్యేకంగా చెప్పడం లేదు.
ఒక్కసారి కాదు ఎన్నిసార్లు అయిన చదవచ్చు.

నేను..కెవ్వ్....నా దయ్యం
బూత ప్రేత పిశాచ ...
నారి బంబం.......అవును సొంత పాటే ......నా దెయ్యం వేరే వాళ్ళ పాటలు పాడితే రాదు)
ఇది మాత్రం సూపర్ అసలు.( శశి గారు మరి నా దయ్యం సంగతి ఏంటి ? 
నాకు పాటలు రాయడం రాదు కాబట్టి మీరు నా దయ్యనికి ఒక పాట రాయాల్సిందే ...)

(ఈయన లేక పోతే పోలేమా పెద్ద......ఇష్....నిజంగానే పోలేము.
అందులో దెయ్యం సినిమా. ఎవరండి ఇండియా డెవలప్ అయింది అంది)
 
హమ్మయ్య......సాయబు వచ్చి మేం సాబ్......అని అరిచి ఆ మంత్ర దండం విసిరేశాడు.
చచ్చాడు పో........అనుకోని ఊపిరి పీల్చుకున్నా.....కాని చావడు......ఇంకేమి చేసేది
దేవుడా........అనుకుంటున్నా......అరుందతి దానితో పొడుచుకుంది............
 
(బాబోయ్.....ఇప్పుడు దెయ్యాన్ని ఎవరు చంపాలి ....నేనా?...కేవ్వ్వ్......)
 
ఈ పోస్ట్ చదివి ఎవ్వరు నవ్వకుండా ఉండలేరు.కాకపోతే శశి గారు
( భర్త రాకుండా మనం దయ్యం సినిమాలు చూడలేము అని ఇలా చెప్పేస్తే ఎలా అండీ ?)

ఇంకా ఆలస్యం ఎందుకు నెల్లూరు వెల్లిపోదాం పదండి.
శశి గారు స్కూటీ నేర్చుకోవడం చదవాల్సిందే అంటే స్కూటీ మీద కూర్చుని చదవకండి నవ్వలేక పడిపోతారు.కావాలంటే మీకు మీరు పందెం వేసుకుని చదవండి నేను అస్సలు నవ్వను అని 
తప్పకుండ ఓడిపోతారు.
 
ఎప్పుడైనా skooty నేర్చుకోవాలంటే
break మీద break అని పెద్ద అక్షరాలతో వ్రాసుకోవాలి )
 
మా స్కూల్లో సర్ ఒకరు "ఏమి madam ఇంకా బండి మీద రావటం
లేదు"అని అడిగారు."దైర్యం చాలటం లేదు సార్"అన్నాను.
వెంటనే ఆయన "ఊరుకోండి మీరు పోయే 20 కి మీ
స్పీడు కి ఒక పిల్లవాడు మీ పక్కన పరిగెత్త గలడు.దానికే భయం ఎందుకు"అన్నారు
 
అది అసలు సంగతి ఏడాది స్కూటీ నేర్చుకున్నాక ఎవరయినా ఇంతకన్నా స్పీడ్ గా వెళ్ళగలరా ?

కవిత కదంబం 

లో తెలుగు భాష తీయదనం గురించి

చిన్నారి బాబు ని వడిలో వేసుకొని అమ్మ
అని పెదాలు తాకించి చూపిస్తూ నేర్పించే
ప్రేమలో ఉంది............

చందమామ రావే ,జాబిల్లి రావే
అని అమ్మపెట్టె గోరు ముద్దలో ఉంది........

రావోయి బంగారి మామ ...అని పిలిచే
ఎంకి ప్రేమ లో ఉంది .............

సంకురాత్రికి దాన్యం రావాలని
కోరుతూ ప్రేమగా నాటే నారు మళ్ళలో ఉంది......

చెల్లియో చెల్లకో..అని రాగాలాపనతో
మేకల్ని మేపే గొంతులో ఉంది......

భగ..భగ..మండే సెగలా వస్తున్నాడు కదిలి
అని రగిలించే బుర్రకధలో ఉంది ......

తెలుగుని వదలలేక బ్లాగుల్లో వ్రాసుకుంటూ
ప్రేమను చూపుతున్న మీ అందరిలో ఉంది ....

జనాల్లో ఉంది .....జానపదాల్లో ఉంది
పల్లెల్లో ఉంది.....పసి పాప మనసులో ఉంది
ఇది ఎంతో బావుంది.

మీ ప్రక్కన మీ సహచరిగా చిన్న మొక్క
ఉండేటట్లు చూసుకోవటం.......

పర్యావరణం గురించి చెప్పింది ఈ మాట.
అన్ని నేను చెప్పేస్తే మీరు బ్లాగ్ లో ఏం చదువుతారు కంగారు పడకండి
నాకు బాగా నచ్చినా ఒక చిన్న మాటతో ఇది ముగించేస్తాను.

మీరో ఒక పని చేయండి.ఒక మొక్కని నాటండి.
ఇరవయ్యి ఏళ్ళు బాగా పెంచండి.తరువాత పీకి
ఇంకో దగ్గర వేయండి.అది ఎలాగా ఉంటుందో
ఆడపిల్లలు అంతే.
మేము ఎంత బాగా చూసుకున్న పుట్టింటి వాళ్ళని చూస్తే నీకు సంతోషం
లేదా పుట్టింటికి వెళ్ళాలంటే చాలు ఎక్కడ లేని అనందం వచ్చేస్తుంది అనే భర్తలు ఇది చదివితే తెలుస్తుంది ఆడపిల్ల అంటే ఏంటో??
మరి బ్లాగ్ కి వెళ్లి చదివేసి చెప్పండి.itissasiworld.blogspot.com

Wednesday, 5 October 2011

కనిపించని నాలుగో సింహం....


హలో...ఏమిటి వెతుకుతున్నారు...
ఏమిటి సింహాన్నా?వట్టి చేతులతో చంపెద్దమనా?
చాల్లే కూర్చోండి..

నేనంటే దూకుడు సినిమా చూసి దూకుడు మీదున్న...
మీకేమి అయింది?
ఏమిటి అర్ధం అయిందా?దూకుడు సినిమా పై వ్రాస్తున్నాను అని...
వద్దా...నేను వినాఆఆఆఆఆఆఅ......

మైండ్ లో ఫిక్స్ అయ్యానంటే బ్లైండ్ గా వెళ్ళిపోతాను....

సరే ఏదో చెప్పమంటారా .......సాస్ కే పాంచ్ చెప్పేస్తాను 

(అంటే 405 కాదు నాలుగు ఐదు లైన్స్ లో చెప్పేస్తా)

మరి సింహాల సంగతి చెపుతా వినండి.

మొదటి సింహం ఇందులో కనిపించే మహేష్ బాబు.
ఏమాటకి ఆ మాటే చెప్పుకోవాలి...షేర్వానిలో షంషేర్ గా ఉన్నాడు.
"పోలిస్ "అని దూకుడుగా చెపుతుంటే రక్తం సర ..సర...అంటూ దూకుడే.

(చాలా రోజుల తరువాత హాల్ లో విజిల్స్ విన్నాను.మరి అన్ని ధరలు
పెరుగుతూ తరుముతుంటే మామూలు మనిషి ఎక్కడ గాలి 
పీల్చుకోవాలి?)

రెండో సింహం ప్రకాష్ రాజ్...ఆయన కోసమే కద అంతా నడుస్తూ 
ఉంటుంది.(ఏమి చేయలేము ...డైరెక్టర్ అలా ఫిక్స్ అయ్యాడు)

పాపం..ఎక్కడా సరిగా కనిపించని సింహం సమంతా...నా 
అభిప్రాయమే కాదు ...మా తోడి కోడళ్ళ అందరి అభిప్రాయం.
నలుగురం నాలుగు దిక్కులలో ఉంటాము కాబట్టి వాళ్ళతో 
మాట్లాడితే నాకు నాలుగు పక్కల టాక్ తెలిసిపోతుంటుంది.

మూడో సింహం విలన్ నాయర్ ..ఈయనకు తోడూ మరో నలుగురు.
వీళ్ళందరూ కలిసి మహేష్ బాబు నాన్న ప్రకాష్ రాజ్ ని,బాబాయ్ ని 
చంపుతారు.కాని ప్రకాష్ రాజ్ ఎలాగో బ్రతికి (మన ప్రాణానికి)కోమా లోకి 
వెళుతాడు.ఆయనని కోమా నుండి వచ్చినాక ఆయను 
సంతోష పరచటానికి ..మహేష్ బాబు విలన్ లను   
ఒక్కొక్కరిని ఒక్కో రకంగా చంపటమే కద.

(థాంక్ గాడ్ ...పక్కన యెర్ర అక్షరాలతో కధ ఏ ఊరిలో ఉందొ 
చూపిస్తూ ఉన్నారు లేకుంటే నాకు అర్ధం అయ్యి ఉండేదే కాదు)

ఏమిటి?ప్రశ్నార్ధకాలు మొహాల్లో ...ఓహో నాలుగో సింహం ఏమిటి అనా?

అదే...అదే చెపుతున్నా...ఈ నాలుగో సింహాన్ని నాకు చూపిననది 
ఎవరంటే మాస్టర్ తన్నీరు .అఖిల్.....వీడు  ఎవరంటే నా ఒక్కగాని ఒక్క 
తమ్ముడికి ఒక్కగానొక్క కొడుకు..అంటే మేనల్లుడు...

వీడితో సినిమాకి ఎవరు పోరు ఎందుకంటె మన బుర్ర తింటూ ఉంటాడు 
పక్కన కూర్చుని...కాని మనకు సినిమాలో నాలుగో సింహం చూపిస్తుంటాడు...

(మరి అత్తా అనగానే ఐస్క్రీం లా కరిగిపోతాను)

ముందు హాల్ లోకి వెళ్ళగానే మొదలెట్టాడు...అత్తమ్మా చూడు 
అని ప్రొజెక్టర్ రూం వైపు...ఏమిటంటే మా ఊరిలో శాటి లైట్  ద్వారా 
వేసే ఫస్ట్ సినిమా అంట..చెప్పాడు.

(వెంటనే మా నాన్న సినిమా రీళ్ల కోసం పక్కూరి సినిమా హాళ్ళకి
అర్ధ రాత్రిళ్ళు వెళ్ళటం అంతా నాకు గిర్రున రీలు లాగా తిరిగింది)

సరే అక్కడ మహేష్ బాబు టైటిల్ సాంగ్ విరగ దీసేస్తున్నాడు...
వీడేమో అత్తమ్మ...చూడు అవి హారిసన్ బైక్స్ ..jr.n.t.r. ఫస్ట్ 
కొన్నాడు ...అన్నాడు.(రెండు లక్షలా చిల్లర)

అక్కడ విలన్ మిద్దె పైన నిలబడి మొబైల్ లో పాట  వింటూ 
ఉంటాడు...వీడేమో వెనుక చూడు ఆ బిల్డింగ్ కిలోమీటర్ ఎత్తు
ఉంటుందంట ....అన్నాడు.

మహేష్ బాబు పాట కి తెగ స్టెప్స్ వేస్తుంటే మన కళ్ళు అటే ఉంటాయి 
...వీడేమో అటు చూడు పక్కన నమస్కారం పెట్టె బొమ్మ...అంటాడు.

ఇంకోసారి మహేష్ బాబు కలర్ ఫుల్గా పాటేస్కుంటాడు......
వీడేమో ...చూడు తెల్లోళ్లు ఈ రకంగా స్టెప్స్ వేయటం ఏ సినిమాలో 
లో వేయలేదు ..అంటాడు...

మరి మీకు కనిపించిందా నాలుగో సింహం...లేకుంటే వాడిని 
తోడిచ్చి మిమ్మల్ని సినిమాకు పంపుతాను...
(ఏమిటి ఎవరో కెవ్వ్....అంటున్నారు)
                 
                 కొస మెరుపు 
నేను మొన్న ఒకటవ తేది సాయంత్రం కోటకి వెళ్లాను.
బస్సు లేట్ అయ్యి ఆరు గంటలకు వెళ్ళాను.

ఐతే ఐదు గంటలకు టీవీ 5 లో శ్రీను వైట్ల తో లైవ్ వచ్చింది.
దాన్లో అఖిల్ కి లైన్ కలిసి శ్రీను వైట్ల తోమాట్లాడాడు.

ఎం.ఎస్.నారాయణ,బ్రహ్మి కామిడి బాగుందని చెప్పాడంట.
ఆయన థాంక్స్ చెప్పాడంట.టైటిల్ సాంగ్ బాగుందంటే "అది పది రోజులు 
షూట్ చేసాము బాబు "అని చెప్పాడంట.

నేను కాని ముందు వెళ్లి ఉంటె నేను కూడా శ్రీను వైట్ల తో మాట్లాడి 
ఉండేదాన్ని.నా వంద రూపాయలు ఆయనకు ఇచ్చేసినా,నా బుర్ర 
మొత్తం తినేసినా ఆయనకు అభినందనలు తెలిపెదాన్ని...

ఎందుకంటె.....
"మా N.T.R. ని యెర్ర కోట పై చూడాలనే 
కోరిక తీర్చారు కాబట్టి"